For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ.. ఇటీవలే తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

  ఇక, ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోన్న దీప్తి.. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇవన్నీ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  సోషల్ మీడియా వల్ల పాపులారిటీ

  సోషల్ మీడియా వల్ల పాపులారిటీ

  సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లతో అ అమ్మడు తెగ పాపులర్ అయింది. అంతేకాదు, దీని ద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని కూడా అందుకుంది. మరీ ముఖ్యంగా ఎంతో మందికి క్రష్‌గా కూడా మారిపోయిందీ బ్యూటీ.

  Bheemla Nayak సంచలనం: 29 రోజులుగా నెంబర్ వన్.. టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డు

  షణ్ముఖ్‌తో లవ్ ట్రాక్‌తో హల్‌చల్

  షణ్ముఖ్‌తో లవ్ ట్రాక్‌తో హల్‌చల్

  దీప్తి సునైనా.. యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అలా చాలా కాలం పాటు జంటగా సందడి చేశారు.

  బిగ్ బాస్ ఆఫర్.. మరింత ఫేమస్

  బిగ్ బాస్ ఆఫర్.. మరింత ఫేమస్

  సోషల్ మీడియా ద్వారా ఎనలేని గుర్తింపును అందుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టేసింది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షో తర్వాత మరింత పాపులర్ అయిపోయింది. ఫలితంగా దీప్తి సునైనాకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

  మళ్లీ రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: మేకప్ రూమ్‌లో ముందూ వెనకా చూపిస్తూ ఘోరంగా!

  షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పిన బ్యూటీ

  షణ్ముఖ్‌కు బ్రేకప్‌ చెప్పిన బ్యూటీ

  సుదీర్ఘ కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా.. ఈ న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ఎమోషనల్‌గా చెప్పేసింది.

  అందులో ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అందులో ఎప్పుడూ బిజీగా ఉంటూ

  దీప్తి సునైనా సోషల్ మీడియా ద్వారానే క్రేజ్‌ను సంపాదించుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యమ యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. మొత్తానికి నిత్యం సందడి చేస్తూ ఫాలోవర్లను భారీగా పెంచుకుంటోంది.

  బీచ్‌లో ప్యాంట్ లేకుండా బిగ్ బాస్ దివి రచ్చ: వామ్మో ఈ తెలుగు పిల్లను ఇలా చూశారంటే!

  హాట్ ఫొటోలను షేర్ చేసిన భామ

  హాట్ ఫొటోలను షేర్ చేసిన భామ

  బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా సందడి చేయని దీప్తి సునైనా.. ఇప్పుడిప్పుడే దాని నుంచి తేరుకుంటోంది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని పిక్స్‌ను వదిలింది. ఇందులో ఈ అమ్మడు స్లీవ్‌లెస్ టాప్‌ ధరించింది. దీంతో క్లీవేజ్ షో చేస్తోంది. అంతేకాదు, వీటిలో దీప్తి కళ్లలో నీళ్లు కూడా కనిపిస్తున్నాయి.

  బట్టలు లేకుండా కనిపించడంతో

  బట్టలు లేకుండా కనిపించడంతో

  తాజాగా దీప్తి సునైనా షేర్ చేసిన ఫొటోల్లో ఆమె ఎడమ భుజం మీద ఉన్న టాటూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీనికి కారణం అది బట్టలు లేకుండా ఉన్న అమ్మాయి దేహంలా డిజైన్ చేయడమే. ఇక, ఈ ఫొటోలను షేర్ చేస్తూ 'నా అభద్రతా భావాలు దాచుకోడానికి చోటు లేకుండా పోవాలి' అంటూ క్యాప్షన్ పెట్టింది. మొత్తానికి ఈ టాటూ ద్వారా దీప్తి మరోసారి వార్తల్లో నిలిచింది.

  English summary
  Bigg Boss Fame Deepthi Sunaina Very Active in Social Media. Now She Shared Cute Photos In Her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X