Bigg Bossలో దీప్తి ఎంట్రీ.. షన్నుకు డీప్ హగ్.. ఆ హగ్స్ గురించి వార్నింగ్.. సిరి వల్లే అంతా అంటూ!
బిగ్ బాస్ తెలుగు 5 పన్నెండవ వారాన్ని పూర్తి చేసుకొని పదమూడవ వారానికి దూసుకుపోతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఫ్యామిలీ మీట్-అప్ రౌండ్ ఈ రోజు ప్రారంభమవుతుంది. అయితే ఈ ఫ్యామిలీ మీట్ అప్ లో షన్ను కోసం దీప్తి సునైనాను హౌస్ లోకి తీసుకు రాగా ఆమె ఇచ్చిన హింట్స్ ఆసక్తికరంగా మారింది..ఆ వివరాల్లోకి వెళితే..

తల్లి సహా ప్రియురాలిని కూడా
ఈ బిగ్ బాస్ ఫ్యామిలీ మీట్ అప్ లో ఒక కంటెస్తంట్ కుటుంబం నుండి ఇద్దరు కుటుంబ సభ్యులు లోపలికి అనుమతించబడతారు. కాబట్టి దాని ప్రకారం, దీప్తి సునైనా కూడా షన్నుని కలవడానికి బిగ్ బాస్ తెలుగు 5 హౌస్‌లోకి ప్రవేశించవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. గత వీకెండ్ ఎపిసోడ్‌లో, షణ్ముఖ్ జస్వంత్ నాగార్జునకు దీప్తిని చాలా మిస్ అవుతున్నానని చెప్పాడు, కాబట్టి మేకర్స్ వారంలో దీప్తి సునైనా హౌస్ లోకి పంపెలా ఈ వీకెండ్ లో షన్ను తల్లి ఉమా రాణినీ లోపలికి పంపేలా ప్లాన్ చేయవచ్చని అంటున్నారు.

రికార్డులు బద్దలు కాయం
స్మాల్ స్క్రీన్‌లో షన్ను దీప్తిలకు విపరీతమైన క్రేజ్ ఉన్నందున మేకర్స్ TRP రేటింగ్ కోసం దీప్తి ఎంట్రీని ప్లాన్ చేసి ఉండవచ్చు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. షో మొదటి రోజు నుంచి బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరినీ చూడాలని ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. ఇక మరో ఆసక్తిరమైన విషయం ఏంటంటే దీప్తి సిరితో షన్ను ప్రవర్తిస్తున్న తీరు విషయంలో షన్నుని హెచ్చరించింది అని అంటున్నారు. అదే గనుక జరిగితే, ఖచ్చితంగా, స్టార్ మా యొక్క TRP రేటింగ్ స్మాల్ స్క్రీన్‌పై అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని భావిస్తున్నారు.

గట్టిగానే ప్లాన్ చేసిన మా టీవీ
ఏది ఏమైనప్పటికీ, షణ్ణుకు భారీ ఫాలోయింగ్ ఉన్నందున అతని ఫ్యామిలీ మీట్-అప్ ను అందరికంటే లాస్ట్ లో ప్లాన్ చేశారని అంటున్నారు. ఒక రకంగా ఈ ఫ్యామిలీ రౌండ్ ప్లాన్ చేసి కంటెస్టెంట్స్ విశ్వాసాన్ని పెంచబోతున్నరు అని అంటున్నారు. ఇప్పటికీ, మానస్, కాజల్, శ్రీరామచంద్ర, మరియు సిరి హనుమంత్ కుటుంబ సభ్యులు గ్లాస్‌హౌస్‌లోకి ప్రవేశించారు.

సిరి విషయంలో వార్నింగ్
ఇక జరుగుతున్న ప్రచారం మేరకు దీప్తి సునైనా శనివారం ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. అంతే కాక దీప్తి సిరితో సంబంధం గురించి పరోక్షంగా షణ్ను హెచ్చరించి, అతని ఆటపై దృష్టి పెట్టమని కోరిందట. అంతే కాక సిరి వల్ల తన పాపులారిటీ పోతుందని కూడా దీప్తి షణ్నుకి హింట్ ఇచ్చిందనీ అంటున్నారు. దీప్తిని బాగా మిస్ అవుతున్న షన్నుకి దీప్తి ఒక డీప్ హగ్ కూడా ఇచ్చిందని అంటున్నారు. ఇంతకు ముందు సిరి తల్లి కూడా షన్నుని కౌగిలించుకోవడం ఇష్టం లేదని సిరిని హెచ్చరించింది.
Recommended Video

గత సీజన్స్ లో లానే
మనం గత సీజన్ లను గమనిస్తే, కుటుంబ సభ్యులునెటిజన్ లు తమ వాళ్ళ గురించి ఎలా భావిస్తున్నారో అనే విషయాలను వాళ్లకుషేర్ చేస్తారు, అలాగే వారు కొన్ని సూచనలను కూడా అందింస్తారు. ఇక బిగ్ బాస్ తెలుగు 5 సీజన్ గ్రాండ్ ఫినాలే దిశగా సాగుతున్నందున, ఈ వారం ఎలిమినేషన్ తర్వాత, కేవలం టాప్ కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉంటారు. షణ్ను మరియు సిరి తమ కుటుంబ సభ్యుల సూచనలను పాటించి టైటిల్ కోసం పోరాడతారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











