twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ టైటిల్ కోల్పోయిన షన్ను.. అలా హింట్ ఇచ్చిన దీప్తి సునైనా... టైటిల్ విన్నర్ ఎవరంటే?

    |

    అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటి దాకా 14 వారాల్లో 14 మంది ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ సీజన్ లో సన్నీ లేదా షన్ను ట్రోఫీ గెలిచే అవకశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు షన్నుకు ట్రోఫీ ఏమీ దక్కలేదని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    మునుపెన్నడూ లేని విధంగా

    మునుపెన్నడూ లేని విధంగా

    తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో మునుపెన్నడూ లేని విధంగా తాజా సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లు ఒకేసారి వచ్చారు. వారిలో వారానికి ఒకరు చొప్పున 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమా దేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారం ప్రియాంక సింగ్‌, పద్నాలుగో వారం కాజల్‌లు ఎలిమినేట్ అయ్యారు. జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ మినహా.. మిగిలిన వారందరూ కూడా తక్కువ ఓట్ల శాతాన్ని అందుకోవడం వల్ల బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది.

    ఫినాలే

    ఫినాలే

    ఇక మిగిలిన వారంతా ఎలిమినేట్ కావడంతో ఈ సీజన్‌లో మానస్, శ్రీరామ చంద్ర, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఫినాలేకు చేరుకున్నారు. వీళ్లంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో.. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అనే అంశం మీద ఆసక్తి నెలకొంది. ఈ సీజన్‌లో వచ్చిన రోజు నుంచే టైటిల్ రేసులో ఉన్నవారిలో షణ్ముఖ్ జస్వంత్ కూడా ఒకరు.

     మంచి ఆట తీరుతో

    మంచి ఆట తీరుతో

    అయితే అనుకోకుండా హౌస్ లోకి వచ్చాక వీజే సన్నీ మంచి ఆట తీరుతో ఫాలోయింగ్ సంపాదించాడు. టాప్ 5లో ఉన్న అందరిలోనూ వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మధ్యనే టైటిల్ పోటీ ఉంటుందని టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే వీళ్ళిద్దరికి మాత్రమే ఆరంభం నుంచి ఓటింగ్ లో ఎక్కువ ఆదరణ దక్కుతూ వచ్చింది. ఇప్పుడు శ్రీ రామ చంద్ర కూడా సెకండ్ పొజిషన్ కోసం పోటీ పడుతున్నారు.

    దీప్తి సునైనా

    దీప్తి సునైనా

    అయితే బిగ్ బాస్ తెలుగు 5 పాపులర్ కంటెస్టెంట్ షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా అతను ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుండి అతనిని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తోంది. షణ్ముఖ్ జస్వంత్‌కు ఓటు వేయాలని దీప్తి ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు. అనధికారిక పోల్స్‌లో షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ఆ అర్ధం వచ్చేలా

    ఆ అర్ధం వచ్చేలా

    ఇప్పుడు, షణ్ముఖ్ ట్రోఫీని కోల్పోయాడని ప్రచారం మొదలైంది. దానికి ఊతం ఇచ్చేలాగానే దీప్తి సునైనా యొక్క సోషల్ మీడియా పోస్ట్ షణ్ముఖ్ ట్రోఫీని గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయినట్టు సూచనలు చేసింది. ఆమె ఈ విషయాన్ని ఎవరికీ స్పష్టంగా చెప్పలేదు, కానీ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆమె కథనం ప్రకారం, ఈ సీజన్‌లో షణ్ముఖ్ షో గెలవలేడని దీప్తి సునైనాకు సరైన ఆలోచన ఉంది. దీప్తి సునైనా యొక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ను చూస్తే ఆ విషయం అర్ధం కాక మానదు. ''జీవితంలో ప్రతీదీ ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది'', శన్ముఖ్ కోసం నిలబడినందుకు థాంక్స్, ఆ ప్రేమ అందించినందుకు థాంక్స్ అంటూ ఆమె పేర్కొంది.

    English summary
    deepthi sunaina hints that Shannu Lose Bigg Boss Telugu 5 Title
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X