twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో తేల్చేశారు!

    By Bojja Kumar
    |

    ఆసక్తికరంగా సాగుతున్న బిగ్‌బాస్ తెలుగు షోలో మళ్లీ ఎలిమినేషన్ టైమ్ వచ్చింది. ఆదివారం సాయంత్రం ప్రసార అయ్యే ఎపిసోడ్లో ఇంటి నుండి ఎవరు బయటకు వెళతారు అనేది నాని ప్రకటించనున్నారు. శనివారం జరిగిన ఎపిసోడ్లో ఈ సారి ఎలిమినేషన్ నుండి శ్యామల, గీత మాధురి సేఫ్ అయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది రోల్ రైడా, పూజ, సునైన. వీరిలో ఒకరు నేడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోనున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఎవరు బయటకు వెళతారు? అనే విషయంలో ఒకరి పేరు బలంగా వినిపిస్తోంది.

    ఈ వారం బయటకు వెళ్లేదెవరంటే?

    ఈ వారం బయటకు వెళ్లేదెవరంటే?

    ఈ వారం బిగ్‌బాస్ ఇంటి బయటకు వెళ్లేది ఎవరు అంటే చాలా మంది దీప్తి సునైన అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎలిమినేషన్ జోన్లో ఉన్న ముగ్గురిలో అందరికంటే వీక్ కంటెస్టెంట్ ఏవిడే అని అంటున్నారు. ఇటీవల ఇంట్లో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఆమెకు మైనస్ అయ్యాయని అంటున్నారు.

    రోల్ రైడాకు అదే బలం...

    రోల్ రైడాకు అదే బలం...

    ఎలిమినేషన్ జోన్లో ఉన్న ముగ్గురిలో అందరికంటే బలమైన కంటెస్టెంటుగా రోల్ రైడాను పేర్కొంటున్నారు. బిగ్‌బాస్ ఇంటికి రాక మెుందే తన సాంగ్ ఆల్బమ్స్‌తో రోల్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన్ను సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక గ్రూఫ్స్ ఉన్నాయి. అతడు గేమ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉండటం వల్ల ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు.

     పూజా రామచంద్రన్

    పూజా రామచంద్రన్

    ఇక ఇటీవలే ఇంట్లోకి ఎంటరై పూజా రామచంద్రన్ తనదైన శైలిలో గేమ్ ఆడుతూ సత్తా చాటుతున్నారు. దీప్తి సునైనాతో పోలిస్తే పూజా మరింత స్ట్రాంగ్‌గా గేమ్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో పూజా కూడా ఈ వారం సేఫ్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఇది బిగ్‌బాస్... ఏమైనా జరుగొచ్చు

    ఇది బిగ్‌బాస్... ఏమైనా జరుగొచ్చు

    అయితే ఇది బిగ్‌బాస్ షో అనే విషయం కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. ఒక్కోసారి ప్రేక్షకుల అంచనాలు తారు మారు అయ్యే అవకాశం ఉందని, ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆదివారం రాత్రి నాని ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

    English summary
    Roll Rida, Pooja Ramachandran, and Deepti Sunaina are in the nominations. Deepthi Sunaina maybe Eliminated From Bigg Boss Telugu 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X