షన్ను రొమాన్స్ పై దారుణంగా.. ఆఖరి నిమిషంలో రంగంలోకి దీప్తి సునైనా.. వాడికి నచ్చినట్లు ఉండనివ్వండి అంటూ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొత్తానికి తుది సమరంలో కి చేరుకుంటోంది. వచ్చేవారం గ్రాండ్ ఫినాలే పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎవరు ఈ సారి టైటిల్ ను అందుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఇక ప్రస్తుతం అందరికంటే జనాల్లో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న లిస్టులో ఇద్దరూ చాలా బలంగా పోటీపడుతున్నారు అని చెప్పవచ్చు. ఇక వారిలో సన్నీతో పాటు షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నాడు. అయితే చివరి దశలో ఎక్కువగా నెగిటివ్ టాక్ రావడంతో గెలుపు పై మరోసారి సందిగ్దత నెలకొంది. ఇక ఎవరూ ఊహించని విధంగా అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా రంగంలోకి దిగడం విశేషం.

మొదటి నుంచి కూడా..
బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దీప్తి సునయన ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత ఆమె ప్రత్యేకమైన డ్యాన్స్ లతో కవర్ సాంగ్స్ తో తన స్థాయిని మరింత పెంచుకుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూనే ఉంది. ఇక ఇటీవల బిగ్ బాస్ లోకి షన్ను అడుగు పెట్టడంతో మొదటి నుంచి కూడా తనకు మద్దతు తెలుపుతూ వస్తుంది.

లిమిట్స్ లో ఉండాలి అంటూ
షణ్ముఖ్ జస్వంత్ ఇటీవల కాలంలో అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా అతను సిరితో ఒక ప్రత్యేకమైన కెమిస్ట్రీ తో కొనసాగుతున్నాడు. వారి రిలేషన్ పై చాలా రకాల నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ముఖ్యంగా లవర్స్ అనే తరహాలో హక్కులు ఇచ్చుకోవడం ఆ తర్వాత ఒకే బెడ్ పై నిద్రపోవడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చివరికి సిరి తల్లి కూడా లిమిట్స్ లో ఉండాలి అంటూ కౌంటర్ ఇచ్చింది అంటే వారి వ్యవహారంపై జనాల దృష్టి ఎక్కడికి వరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రంగం లోకి దిగిన దీప్తి
సిరి తల్లి కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా ఆమెతో ఎప్పటిలానే ముందుకు సాగుతున్నాడు. రియాలిటీ షో లో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో చెప్పడం కష్టమే. అయితే షన్ను సిరి రిలేషన్ పై మళ్లీ దారుణమైన కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి. సిరి కారణంగా అతను తన క్యారెక్టర్ కూడా కోల్పోతున్నాడు అని కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక ఈ తరుణంలో అతనికి అండగా ఉండేందుకు దీప్తి సునయన కూడా రంగం లోకి దిగింది.

ఎంత ప్రచారం చేసినా..
దీప్తి సునయన మొదటి నుంచి కూడా తన ప్రియుడి కోసం అనేక రకాల లైవ్ సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించింది. తప్పకుండా అతను గెలవాలి.. మీ అందరి సపోర్ట్ కూడా అతడికి కావాలి అని ప్రచారాలు కూడా చేసింది. అయితే ఎంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఇటీవల కాలంలో మాత్రం ఊహించనివిధంగా నెగిటివ్ టాక్ అయితే వస్తుంది.

వాడికి నచ్చినట్లు..
ఇక బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే కోసం షణ్నూకి సపోర్ట్ చేయడానికి దీప్తి సునైనా రంగంలోకి దిగింది. ఈ షోలో షణ్ముఖ్ క్యారెక్టర్‌ని అంచనా వేయవద్దు అంటూ.. అది కేవలం ఒక గేమ్ షో అని అందరూ గుర్తుపెట్టుకోవలని తెలిపింది. ఇక షణ్నూ ఎంతో మంచివాడని ముందుగా అతను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయనివ్వాలని కూడా వివరణ ఇచ్చింది. ఇక మీ అంచనాలకు తగ్గట్లు రీచ్ అవ్వాలనుకోవద్దని వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి.. అని వివరణ ఇచ్చింది.

ఆ విషయంలో అనుమానం లేదని..
ఇది కేవలం ఒక రియాల్టీ షో అంటూ ఎవరిమీదా ద్వేషం వద్దని చెప్పిన దీప్తి మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి మీరు సపోర్ట్ చేయాలని తెలియజేసింది. ఇక నా మద్దతు ఇప్పటికీ, ఎప్పటికీ షణ్నూకే అని ఆ విషయంలో ఎలాంటి అనుమానం లేదని అంది. ఇక షన్ను సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటూ దీప్తి సునయన తన ఇన్‌స్టాగ్రామ్ లో ప్రత్యేకంగా పోస్టు షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











