Don't Miss!
- Sports
Brett Lee Advice: కోహ్లీకి ఇంతకంటే మంచి టైం దొరకదు.. కచ్చితంగా ఈ టైం ఉపయోగించుకోవాలి
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా ఫస్ట్ పోస్ట్: నా వెనుక తను ఉన్నాడంటూ వీడియో రిలీజ్
ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన విషయాల్లో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ న్యూస్ ఒకటి. సుదీర్ఘ కాలంగా లవ్ ట్రాకును నడిపిన వీళ్లిద్దరూ కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కుతారు అంటూ ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ ఐదో సీజన్ మొత్తం మార్చేసింది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్ వ్యవహరించిన తీరుతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియుడితో విడిపోయిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో మొదటి పోస్టును చేసింది. అందులో తనకు శక్తినిచ్చే ఒక వ్యక్తి ఉన్నారని చూపించింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

అలా మొదలైన ఇద్దరి లవ్‌ట్రాక్
సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ కూడా ఉన్నారు. ఆరంభంలో వేరు వేరుగా వీడియోలు చేసిన వీళ్లద్దరూ ఆ తర్వాత కలిసి పని చేశారు. దీంతో జంటగా బాగా ఫేమస్ అయిపోయారు. అలా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ తర్వాత షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయిన విషయం తెలిసిందే.
జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

బిగ్ బాస్‌లో రచ్చ.. తారుమారు
బిగ్ బాస్ ఐదో సీజన్లోకి షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతడు స్నేహితురాలు సిరి హన్మంత్‌తో కలిసి రచ్చ రచ్చ చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు, ఈ ప్రభావం అతడి గెలుపు అవకాశాలను కూడా భారీ స్థాయిలో దెబ్బతీసిందని చెప్పొచ్చు.

షణ్ముఖ్, దీప్తి బ్రేకప్ చెప్పుకుని
షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరించిన తీరుతో అతడికి చెడ్డపేరు వచ్చింది. దీంతో అతడికి దీప్తి సునైనా బ్రేకప్ చెప్పబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, వీటిని అతడు మాత్రం ఖండించాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప్తి కొద్ది రోజుల క్రితమే బ్రేకప్క సంబంధించిన ప్రకటనను వదిలింది. దీంతో షణ్ముఖ్ జస్వంత్‌కు కోలుకోలేని షాక్ తగిలింది.
Unstoppable with NBK: బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు.. తెలుగులో నెంబర్ వన్.. ఇండియాలో ఐదో ర్యాంక్

అతడలా... ఆమె ఇలా మాట్లాడి
బ్రేకప్ జరిగిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కూడా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. ఆల్ ది బెస్ట్ దీపు.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను' అని పోస్ట్ చేశాడు. అలాగే, దీప్తి కూడా తన కెరీర్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లైవ్‌లో చెప్పింది.

బ్రేకప్ తర్వాత దీప్తి ఫస్ట్ పోస్టు
బ్రేకప్ అయిన తర్వాత అటు షణ్ముఖ్ జస్వంత్, ఇటు దీప్తి సునైనా ఇద్దరూ సోషల్ మీడియాలో గతంలో మాదిరిగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అప్పుడప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు మాత్రమే పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా దీప్తి సునైనా ఇన్‌స్టాలో ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు తండ్రి కూడా ఉన్నారు. దీంతో ఇది వైరల్ అయిపోయింది.
ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!

నా వెనుక తను ఉన్నాడంటూ
దీప్తి సునైనా తాజాగా వదిలిన ఇన్స్టాగ్రామ్ రీల్లో తండ్రితో కలిసి ఆమె క్యూట్‌గా ఆడుకుంటూ కనిపించింది. దీనికి 'ఆమె ఒంటరిగా మిగిలిపోలేదు. ఆమెకు తండ్రి ప్రేమ అండగా నిలిచింది. కనిపించని నైతిక శక్తిగా మారిపోయింది' అంటూ రాసుకొచ్చింది. దీంతో తనకు తండ్రితో పాటు కుటుంబం ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అన్న విషయాన్ని దీప్తి సునైనా పరోక్షంగా వెల్లడించింది.