దీప్తి సునైనా పోస్ట్ వైరల్: మా ఇద్దరి కనెక్షన్ అప్పుడే తెలుస్తుంది అంటూ!
సోషల్ మీడియా పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఎంతో మంది యువతులు విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తద్వారా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు.
యూట్యూబ్‌లో డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక, ఈ మధ్య తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన దీప్తి సునైనా.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ తర్వాత పెరిగిన క్రేజ్
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అంతేకాదు, తనీష్‌తో చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షోతో క్రేజ్‌ను డబుల్ చేసుకుని మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది.

షణ్ముఖ్‌తో ప్రేమ.. బ్రేకప్ చెప్పి
తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. వీళ్లిద్దరూ కలిసి పని చేస్తోన్న సమయంలోనే జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అయితే, ఇటీవలే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పేసింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోంది.

కెరీర్‌పై ఫోకస్.. ప్రాజెక్టులతోనే
దీప్తి సునైనా చాలా కాలం పాటు తీరిక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడిపింది. ఈ క్రమంలోనే వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ వచ్చింది. అయితే, కొంత కాలంగా గ్యాప్ తీసుకుంటోన్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని ప్రాజెక్టులను కూడా ఓకే చేసేసింది. త్వరలోనే వాటి షూటింగ్‌లలో పాల్గొనబోతుందని టాక్.

సోషల్ మీడియాలో సందడిగా
దీప్తి సునైనా బిగ్ సెలెబ్రిటీగా ఎదిగిపోవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తెగ హైలైట్ అవుతోంది.

దీప్తి ఫ్రెండ్ ఇంట్లో పండగలా
దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో ప్రముఖ నటుడు సామ్రాట్ రెడ్డితో చాలా క్లోజ్‌గా ఉండేదన్న విషయం తెలిసిందే. అతడిని సోదరుడిగా భావించి ఆ బంధాన్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఇక, ఆగస్టు 15వ తేదీన సామ్రాట్ రెడ్డి భార్య లిఖిత ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

చేయి పట్టుకున్న ఫొటో వదిలి
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దీప్తి సునైనా.. తనతో పాటు తనతో సన్నిహితంగా ఉండే వాళ్లకు సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే జన్మించిన సామ్రాట్ రెడ్డి కుమార్తెను చూసేందుకు వెళ్లిన దీప్తి.. ఆ చిన్నారి తన చేతిని పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకుంది. దీనికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

మా కనెక్షన్ అప్పుడే తెలుస్తది
సామ్రాట్ రెడ్డి కూతురి ఫొటోను షేర్ చేసిన దీప్తి సునైనా 'నా క్యూటీలు సామ్రాట్ రెడ్డి, అంజనా శ్రీ లిఖితకు కంగ్రాట్స్. పాపకు నాకు ఉన్న కనెక్షన్.. అది పెద్ద అయ్యాకే మీకు తెలుస్తుంది' అని రాసుకొచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో దీప్తి చెప్పిన విషయంపై చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











