Deepthi Sunaina: ఇల్లు కొనడానికి అంత డబ్బు ఎక్కడిది?.. నెటిజన్ తింగరి ప్రశ్నకు దీప్తి సునైనా జవాబు ఏమిటంటే?
గతంలో కంటే ఇప్పుడు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాన్ని మంచి సాధనంగా ఉపయోగించుకుంటూ అనేక మంది పాపులర్ అయ్యారు. నెట్టింట్లో సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న క్యూట్ బ్యూటిల్లో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ డబ్ స్మాష్ వీడియోల ద్వారా పాపులర్ అయిన దీప్తి సునైనా అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉండటంతో అతి తక్కువ సమయంలో మోస్ట్ పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా దీప్తి ఇచ్చే క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు యూత్ ఫిదా అయిపోవడమే కాకుండా ఆమెను క్రష్ లిస్ట్ లో కూడా చేర్చారు. అయితే నిత్యం సోషల్ మీడియాలో సందడి చేసే దీప్తికి ఓ నెటిజన్ తింగరి ప్రశ్న వేశాడు. దానికి దీప్తి ఆన్సర్ ఏంటనే వివరాల్లోకి వెళితే..

గ్లామర్ ట్రీట్ ఇస్తూ..
యూట్యూబ్ లో డబ్ స్మాష్ ల ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మల్లో క్యూట్ బ్యూటి దీప్తి సునైనా ఒకరు. తనదైన అందం, నటన, డ్యాన్స్ లతో అట్రాక్ట్ చేసే దీప్తి సునైనా అప్పుడప్పుడూ హాట్ షోతో కూడా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా కొన్ని డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు ఆమెకు భారీ స్థాయిలో గుర్తింపును తీసుకు వచ్చాయి. ఫలితంగా ఈ భామ ఎంతో మందికి క్రష్‌గా మారిపోవడంతో పాటు మోస్ట్ పాపులర్ అయింది.

యూట్యూబర్ తో లవ్ ట్రాక్..
అతి కొద్ది కాలంలోనే ఎవరు సంపాదించుకోలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అలాగే, నచ్చావులే ఫేమ్ తనీష్‌తో చనువుగా ఉంటూ హాట్ టాపిక్ అయింది. ఇక, ఈ షో వల్ల ఈ బ్యూటీ రేంజ్ పెరగడంతో పాటు వరుసగా ఆఫర్లను కూడా దక్కించుకుని హవాను చూపింది. కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు లవ్ ట్రాకు నడిపించింది క్యూట్ బ్యూటి.

షన్నూకు బ్రేకప్..
షణ్ముఖ్ జస్వంత్ తో దీప్తి సునైనా ప్రేమాయణం సాగించడంతో వాళ్లిద్దరు మరింతగా పాపులర్ అయిపోయారు. అలా చాలా కాలం ప్రేమించుకున్న తర్వాత బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్ లో షణ్ముఖ్ పాల్గొన్నాడు. అయితే ఈ సీజన్ లో సిరితో ఫ్రెండ్ షిప్ అని చెప్పిన ప్రేక్షకులు ఇబ్బంది పడేలా చనువుగా ఉన్నారు. దీంతో షన్నూకు దీప్తి సునైనా బ్రేకప్ చెప్పేసినట్లు వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం అప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అయిపోయింది.

ఎప్పుడు యూక్టివ్ గా ఉంటూ..
యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించిన కొత్తలోనే దీప్తి సునైనా వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలతో హవాను చూపించింది. సోషల్ మీడియాతోపాటు అటు బుల్లితెర, ఇటు వెండితెరపై అవకాశాలను దక్కించుకుంది దీప్తి సునైనా. అయితే, చాలా కాలం పాటు గ్యాప్ తీసుకున్న ఆమె.. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ స్పీడ్ పెంచుతోంది. సోషల్ మీడియా ద్వారా బిగ్ సెలెబ్రిటీగా మారిన దీప్తి సునైనా.. అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది.

కొత్త వీడియోతో ముందుకు..
ఇప్పటికే అనేక కవర్ సాంగ్స్ తో అలరించింది క్యూట్ బ్యూటి దీప్తి సునైనా. ఏమై ఉండొచ్చో, మలుపు, తట్టుకేలేదే వంటి తదితర సాంగ్స్ తో పాటు పలు హిట్ అయిన సినిమా సాంగ్స్ ను రీ క్రియేట్ చేసి వదిలింది. ఇప్పుడు మరో కొత్త వీడియో సాంగ్ తో రాబతోంది ఈ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ. ఏమోనే అనే కొత్త ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోతో మరోసారి మ్యాజిక్ చేసింది బ్యూటిఫుల్ దీప్తి సునైనా. ఇటీవల విడుదలైన ఈ వీడియో పర్వాలేదనిపించుకుంది.

ఇల్లు ఎలా కొన్నారు..
ఇక నిత్యం సోషల్ మీడియాలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది దీప్తి. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది. తాజాగా దీప్తి సునైనా ఆస్క్ మి సెషన్ నిర్వహించింది. అయితే ఇటీవల దీప్తి కొత్త ఇల్లు కొనడం గురించి ఒక నెటిజన్ అడిగాడు. "మీరు ఇల్లు ఎలా కొన్నారు" అని ప్రశ్నించాడు ఆ నెటిజన్. దానికి కౌంటర్ గా మంచి జవాబు ఇచ్చింది దీప్తి సునైనా.

30 శాతం ఖర్చు పెట్టాను.
నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. "యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి నేను సంపాదించిన దాంట్లో 30 శాతం ఖర్చు పెట్టుకుని మిగతా 70 శాతం డబ్బు సేవ్ చేసుకున్నాను. అలా దాచుకున్న డబ్బులతో కొత్త ఇల్లు కొన్నాను" అని సమాధానం ఇచ్చింది బ్యూటిఫుల్ అండ్ క్యూట్ బ్యూటి దీప్తి సునైనా. దీంతో ఆ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చినట్లు అయింది. అయితే కొత్త ఇల్లు కొన్న దీప్తి సునైనా ఇటీవల కొత్త ఇంట్లోకి షిప్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











