బిగ్ బాస్ 5లో దీప్తి ఓటు షన్ను కు కాదట.. ఆ కంటెస్టెంట్ కి ఓటు వేయమని స్క్రీన్ హాట్ కూడా?

దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీప్తి గతంలోనే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి అలరించగా ఇప్పుడు షన్ను సీజన్ 5 లో అలరిస్తున్నారు..అయితే ఈ సీజన్ లో షన్నుకు ఓటు వేయమని కోరకుండా దీప్తి మరో వ్యక్తికి ఓటు వేయమని కోరడం సంచలనంగా మారింది..ఆ వివరాల్లోకి వెళితే

ఓపెన్ అయిపోవడంతో

ఓపెన్ అయిపోవడంతో


యూట్యూబ్ వీడియోలతో ఫ్యాన్ బేస్ పెంచుకున్న షణ్ముఖ్ జశ్వంత్, దీప్తి సునయనల లవ్ ట్రాక్ గురించి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకముగా చెప్పక్కర్లేదు. గతంలో వీరిద్దరికీ వేర్వేరు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నా ఆ బ్రేకప్స్ నుంచి బయటకు వచ్చి ఇద్దరూ ప్రేమలో విహరిస్తున్నారు. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో షణ్ముఖ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సమయంలో దీప్తి సునయన ఓపెన్ కావడంతో అసలు విషయం బయటపడింది.

ప్రేమ పక్షులు

ప్రేమ పక్షులు

టీవీలో తన షణ్ముఖ్ ఎంట్రీని చూసి ఎంతో ఆనందంతో ఐ లవ్ యూ చెప్పేసింది దీప్తి సునయన. ఆ తరువాత తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో కూడా అతనిని సపోర్ట్ చేస్తా పలు పోస్టులు పెట్టిన దీప్తి షణ్ముఖ్‌పై ఉన్న ప్రేమను బయటపెడుతూ అతనితో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేసింది. బయట షన్ను గురించి దీప్తి సునయన చెబుతుంటే.. లోపల దీప్తి గురించి షన్ను చెబుతుంటాడు. ఆ మధ్య షన్ను ఫ్యామిలీ మెంబర్ గా వెళ్ళిన దీప్తి హౌస్ లో అలరించి వచ్చింది.

నెట్టింట హల్చల్

నెట్టింట హల్చల్

అలా షన్ను, దీప్తిలు ఇప్పుడు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ష‌ణ్ముక్ కు ఓట్లు వేసి గెలిపించాల‌ని కూడా త‌న సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు ఉన్న‌ట్టు ఉండి త‌న స్టాండ్ ను మార్చుకుని షణ్నూకి కాకుండా మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్దతు ఇవ్వ‌డం సంచ‌ల‌నం గా మారింది. ఆమె దెబ్బకు దీంతో జ‌నాలు అంద‌రూ కూడా షాక్ అవుతున్నారు. అలా చెప్పడమే కాదు అత‌డికి తాను ఓటు వేసిన స్క్రీన్ షాట్ ను సైతం సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం విశేషం.

ఎవరో అనుకోకండి

ఎవరో అనుకోకండి


ప్రస్తుతం దీప్తి షేర్‌చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మార‌డం తో పాటు ప్ర‌తి ఒక్క‌రి లోనూ చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. అయితే ఆ కంటెస్టెంట్ ఎవ‌రా ? అని మీరు ఓ బుర్ర‌లు బ‌ద్ద‌లు కొట్టు కోవ‌ద్దు.. ఎందుకంటే ఆయన అసలు తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదు ఆయన త‌మిళ బిగ్ బాస్‌కు చెందిన వ్య‌క్తి. ప్ర‌స్తుతం త‌మిళ్ లో బిగ్‌బాస్ - 5 సీజ‌న్ జరుగుతుంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Deepthi Sunaina's Romantic Wish - Shanmukh Emotional || Filmibeat Telugu
వరుణ్ కు

వరుణ్ కు


ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ అనే కంటెస్టెంట్ కు దీప్తి సున‌య‌న త‌న స‌పోర్ట్ ప్ర‌క‌టించింది. అత‌డికి ఓట్లు వేసి గెలిపించాలంటూ దీప్తి త‌న ఫాలోవ‌ర్ల‌ను కోరింది. అదన్న మాట సంగ‌తి. ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికి వచ్చేసరికి దీప్తి ప్రియుడు ఇప్పుడు టాప్ 2 లో ఉన్నాడు.చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X