For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీప్తి సునైనాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ముద్దులు: నీ ప్రవర్తన ఏంటి అంటూ వీడియో వదిలి మరీ!

  |

  సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా చాలా మందే ఉన్నారు. దీని ద్వారానే ఫేమస్ అయి.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ ద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత హైలైట్ అయింది. ఇక, ఈ మధ్య తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన దీప్తి సునైనా.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

  తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా దీప్తి

  తెలుగు రాష్ట్రాల్లో క్రష్‌గా దీప్తి

  దీప్తి సునైనా యాక్టింగ్, గ్లామర్‌తో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాదు, వరుసగా వెబ్ సిరీస్‌లు, మ్యూజిక్ ఆల్బమ్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ యమ పాపులర్ అయింది. అదే సమయంలోనే మరిన్ని ఆఫర్లను కూడా దక్కించుకుంది. అంతేకాదు, తన స్టన్నింగ్ లుక్స్‌తో దీప్తి సునైనా తెలుగు రాష్ట్రాల్లోకి కుర్రాళ్లకు క్రష్‌ అయిపోయింది.

  విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

  షణ్ముఖ్‌తో డేటింగ్‌తో ఫేమస్

  షణ్ముఖ్‌తో డేటింగ్‌తో ఫేమస్

  సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. వీళ్లిద్దరూ కలిసి పని చేస్తోన్న సమయంలోనే జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అప్పటి నుంచి జంటగా రచ్చ చేశారు.

  బిగ్ బాస్ నుంచి క్రేజ్ డబుల్

  బిగ్ బాస్ నుంచి క్రేజ్ డబుల్

  తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అంతేకాదు, తనీష్‌తో చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షోతో క్రేజ్‌ను డబుల్ చేసుకుని మరింత జోష్‌తో దూసుకుపోతోంది.

  మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!

  షణ్నూకు దీప్తి సునైనా కటీఫ్

  షణ్నూకు దీప్తి సునైనా కటీఫ్

  షణ్ముఖ్ జస్వంత్‌తో సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా... ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ఓ పోస్ట్ చేసింది.

  సోషల్ మీడియాలో సందడిగా

  సోషల్ మీడియాలో సందడిగా

  దీప్తి సునైనా ఈ రేంజ్‌లో క్రేజ్‌ను సంపాదించుకోవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ హైలైట్ అవుతోంది.

  టాప్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ లహరి: తొలిసారి ఓ రేంజ్‌లో అందాల ఆరబోత

  దీప్తి సునైనాకు శివ జ్యోతి కిస్

  దీప్తి సునైనాకు శివ జ్యోతి కిస్

  కొంత కాలంగా దీప్తి సునైనా జిమ్‌లో తెగ వర్కౌట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కమ్ న్యూస్ రిపోర్టర్ శివ జ్యోతితో కలిసి చేసిన ఓ వీడియోను వదిలింది. ఇందులో ఆమె దీప్తి సునైనాకు ముద్దుల మీద ముద్దులు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.

  నీ ప్రవర్తన ఏంటి అంటూనే

  నీ ప్రవర్తన ఏంటి అంటూనే


  ఈ వీడియోలో దీప్తి సునైనా తనకు ముద్దులు పెట్టిన శివ జ్యోతిని వంగబెట్టి వీపుపై గుద్దులు గుద్దేసింది. దీంతో ఆమెతో పాటు దీన్ని చూసిన వాళ్లందరూ షాక్‌కు గురవుతున్నారు. ఇక, ఈ క్లిప్‌ను శివ జ్యోతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకుంది. అంతేకాదు, 'దీప్తి సునైనా నీ ప్రవర్తన ఏంటి' అంటూ కామెంట్ చేసింది. దీనికి ఆమె 'దంచుడే' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది.

  English summary
  Bigg Boss Fame Deepthi Sunaina Very Active in Social Media. Recently She Shares Unexpected Video In Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X