రోడ్డుపై దీప్తి సునైనా పరుగులు: పేరు మార్చుకున్న బ్యూటీ.. సీక్రెట్ త్వరలో రివీల్ చేస్తానంటూ!

సోషల్ మీడియాను ఎంతో మంది యువతీ యువకులు మిస్ యూజ్ చేసుకుంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే, దీనివల్లే చాలా మంది ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ అవుతున్నారు. అలా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఫేమస్ అయ్యారు. అందులో బబ్లీ బ్యూటీ దీప్తి సునైనా ఒకరు. డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌ ద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.. షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్ ట్రాకుతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఇక, ఈ మధ్యనే అతడికి బ్రేకప్ చెప్పిన దీప్తి.. తాజాగా సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేసింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

కుర్రాళ్లకు క్రష్‌గా మారిన దీప్తి

కుర్రాళ్లకు క్రష్‌గా మారిన దీప్తి

క్యూటీ దీప్తి సునైనా అందానికి అందం.. నటనకు నటన.. డ్యాన్స్‌కు డ్యాన్స్ చేస్తూ చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. తద్వారా సోషల్ మీడియాలో యమ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అంతేకాదు, కొన్ని భారీ ఆఫర్లను కూడా దక్కించుకుంది. అదే సమయంలో తన అదిరిపోయే లుక్స్‌తో తెలుగు రాష్ట్రాల్లోకి కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది.

లవ్ ట్రాక్‌తో మరింత ఫేమస్

లవ్ ట్రాక్‌తో మరింత ఫేమస్

డ్యాన్స్ వీడియోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే దీప్తి సునైనా.. ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో చాలా కాలం పాటు లవ్ ట్రాక్ నడిపింది. వీళ్లిద్దరూ కలిసి పని చేస్తోన్న సమయంలోనే జంటగా బాగా పాపులర్ అయిపోయారు. అలా షణ్ముఖ్, దీప్తి ప్రేమికులుగా మారిపోయారు. అప్పటి నుంచి తరచూ రచ్చ రచ్చ చేస్తూ కనిపించారు.

బిగ్ బాస్ ద్వారా పెరిగిన క్రేజ్

బిగ్ బాస్ ద్వారా పెరిగిన క్రేజ్

ఆంధ్రా, తెలంగాణలో భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునైనాకు బిగ్ బాస్ రెండో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. అందులో ఆటతో పాటు గొడవలు, గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. అంతేకాదు, తనీష్‌తో చనువుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలిచేది. దీంతో అప్పటి వరకూ చాలా మందికి తెలియని ఆమె.. ఈ షోతో క్రేజ్‌ను రెట్టింపు చేసుకుని ఆఫర్లను పట్టేసింది.

ప్రియుడికి బ్రేకప్ చెప్పిందిగా

ప్రియుడికి బ్రేకప్ చెప్పిందిగా

సుదీర్ఘ కాలం పాటు షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం సాగించిన దీప్తి సునైనా... ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున అతడికి బ్రేకప్ చెప్పేసింది. 'నా లైఫ్‌లో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఇన్నేళ్లలో నా లైఫ్‌ గురించి, కెరీర్‌ గురించి ఏనాడూ ఆలోచించలేదు. ఇప్పుడు వాటి మీద శ్రద్ధ పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ప్రకటించింది.

సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో హల్‌చల్


దీప్తి సునైనా ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే అందులో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, తనఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ పెరుగుతోంది.

పేరు మార్చుకుంటున్నానని

పేరు మార్చుకుంటున్నానని

దీప్తి సునైనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఒక నెటిజన్ 'మీలో మీకు అస్సలు నచ్చని విషయం ఏంటి' అని ప్రశ్నించాడు. దీనికామె 'చీరాకు పడడం. బేసిక్‌గా నాకు కోపం రాదు చిరాక్ వస్తుంది. 'చిరాకేశ్వరి' అని నా పేరు మార్చుకోవాలని అనుకుంటున్నా. కానీ, నాకు చిరాకు తెలియకుండానే వచ్చి పోతుంది' అని చెప్పుకొచ్చింది.

సీక్రెట్‌ను రివీల్ చేస్తానంటూ

సీక్రెట్‌ను రివీల్ చేస్తానంటూ

ఈ సెషన్‌లో భాగంగా మరో నెటిజన్ 'మీరు ఉదయం ఎందుకు అలా ఫాస్ట్‌గా పరిగెత్తారు' అని ప్రశ్నించారు. దీనికి దీప్తి సునైనా 'సీక్రెట్.. త్వరలోనే దాన్ని రివీల్ చేస్తాను' అని అందరిలో ఆసక్తిని పెంచేసింది. ఇవి మాత్రమే కాదు.. తనకు నచ్చిన పేరు, తన వాట్సాప్ డీపీ సహా ఎన్నో విషయాలను ఈ సెషన్‌లో దీప్తి తన ఫాలోవర్లతో పంచుకుంది. ఇవి మాత్రమే హైలైట్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X