Don't Miss!
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముదిరిన దీప్తి నల్లమోతు ఫేక్ ఓటింగ్ వివాదం.. కౌశల్ ఆర్మీపై కేసు నమోదు!
బిగ్‌బాస్ తెలుగు 2 విజేత ఎంపిక కోసం కంటెస్టెంట్ దీప్తి నల్లమోతుకు ఫేక్ ఓటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ ఎండీ శ్రీరాం లతీష్ స్పందించారు. తమపై ఆరోపణలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న కౌశల్ ఆర్మీపై ఆయన కేసు నమోదు చేశాడు. ఈ మేరకు హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో అసలేం జరుగుతున్నదంటే..
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
30న బిగ్‌బాస్ ఫైనల్
ప్రస్తుతం బిగ్‌బాస్ ఫైనల్ ఆదివారం (సెప్టెంబర్ 30న) జరుగబోతున్నది. కౌశల్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు, సామ్రాట్ రెడ్డి, తనీష్ టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో కౌశల్ ముందంజలో ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి. ఆ తర్వాత గీతామాధురి ఉన్నట్టు సమాచారం.
దీప్తి నల్లమోతు ఓటింగ్ శాతం
అయితే గత కొద్దిరోజులుగా దీప్తి నల్లమోతు ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఈ పరిణామం కౌశల్ ఆర్మీతోపాటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. దాంతో దీప్తి నకిలీ ఓట్లతో ముందుకెళ్తున్నది. ఆమె ఫేక్ ఓటింగ్ వెనుక రామిట్ సొల్యూషన్స్ ఉంది అని ట్విట్టర్లో సందేశాలు వెల్లువెత్తాయి.
ఫేక్ ఓటింగ్‌పై కఠిన చర్యలు
అంతేకాకుండా ఫేక్ ఓటింగ్ జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నాని, బిగ్‌బాస్ టీమ్‌కు సోషల్ మీడియా ద్వారా కోరారు. నానిగారు.. దీప్తి, రామిట్ మధ్య ఉన్న సంబంధంపై ఎంక్వైరీ వేయండి. అదే విషయాన్ని శనివారం వేదికపై నుంచి చెప్పండి అంటూ కోరారు.
దీప్తి నల్లమోతు ఫేక్ ఓటింగ్‌పై
దీప్తి ఫేక్ ఓటింగ్ అంటూ కౌశల్ ఆర్మీ చేసిన కామెంట్లపై రామిట్ సొల్యూషన్ కంపెనీ అధినేత శ్రీరాం లతీష్ స్పందించారు. మా కంపెనీకి దీప్తి నల్లమోతు క్లయింట్. తాము పలు బ్రాండ్స్‌ను ప్రమోట్ చేస్తాం అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
సాక్ష్యాలతో ఆరోపణలు చేయాలి
దీప్తి నల్లమోతు కోసం రామిట్ సొల్యూషన్స్ ఫేక్ ఓటింగ్ జరుపుతున్నదని ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఎవరి వద్దనైనా సాక్ష్యాలు ఉంటే వాటితో కామెంట్ చేయండి. అలాంటి సాక్ష్యాల వల్ల దర్యాప్తు సులభమవుతుంది. వారు ఫేక్ ఈ మెయిల్ ఐడీలతో కేసు నమోదు చేసింది. సరైనా సాక్ష్యాలు లేకుండా ఆరోపణలను నమ్మవద్దు. వాళ్లు తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన డాక్యుమెంట్ ఎవరైనా సులభంగా చేయవచ్చు.
చట్టరీత్యా నేరం అని
ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా ఫేక్ న్యూస్ నమ్మవద్దు. ఆధారాలు లేకుండా రూమర్లు సృష్టిస్తే చట్టరీత్యా నేరంగా భావించబడుతుంది అని దీప్తి నల్లమోతు అఫీషియల్ అకౌంట్లో ఓ పోస్టు కనిపించింది. అంతేకాకుండా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేయడం గమనార్హం.