బిగ్‌బాస్ 2లో లవర్స్ టాస్క్‌పై... దీప్తి నల్లమోతు భర్త రియాక్షన్!

By Bojja Kumar

బిగ్‌బాస్ తెలుగు 2లో ఈవారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో టీవీ9 యాంకర్ దీప్తి నల్లమోతు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె భర్త శ్రీకాంత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తమ కుటుంబం, ప్రేమ వివాహం లాంటి విషయాలతో పాటు దీప్తి కెరీర్, బిగ్ బాస్ అవకాశం ఎలా వచ్చింది? బిగ్‌బాస్ ఇంట్లో జరిగిన లవర్స్ టాస్క్‌పై తాను సీరియస్ అయినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

దీప్తి వాళ్లు చిన్నప్పటి నుండి విజయవాడలో మేము ఉండే ఇంటి కింద ఉండేవారు. ఆ తర్వాత వేరే ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయారు. చిన్నప్పటి నుండి మా ఇద్దరి మధ్య మంచి పరిచయం, స్నేహం ఉంది. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇంట్లోవారిని ఒప్పించాం. పార్కుల్లో తిరగడం లాంటి ప్రేమైతే కాదు, వారి ఇంట్లో వెళ్లి కూర్చునేంత స్వతంత్రం నాకు ఉండేది. 2002లో మా పెళ్లి జరిగిందని శ్రీకాంత్ తెలిపారు.

యాక్సిడెంట్ గురించి...

యాక్సిడెంట్ గురించి...

దీప్తి గతంలో రేడియో మిర్చిలో పని చేసేది. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు తన షో టైమింగ్స్. రేడియో మిర్చి ఉండే కాంప్లెక్స్ గ్రౌండ్ ప్లోర్ లోనే జిమ్ ఉండేది. ఉదయం 5 గంటలకు వెళ్లి 6.30 గంటల వరకు జిమ్ చేసుకుని 7 గంటలకు షోలో జాయిన్ అయ్యేది. ఓసారి ఉదయం వెళుతుంటే బందర్ రోడ్డు మీద హైదరాబాద్ నుండి వచ్చే బస్సు ఢీ కొట్టింది. ఆది మేజర్ యాక్సిడెంట్... దాని నుండి కోలుకోవడం దీప్తికి అది పునర్జన్మ లాంటిది.

దీప్తి కెరీర్ గురించి..

దీప్తి కెరీర్ గురించి..

రేడియో మిర్చి తర్వాత హైదరాబాద్‌ వెళ్లి ఒక సంవత్సరం పాటు సీవీఆర్ ఛానల్‍‌లో పని చేసింది. ఆ తర్వాత మళ్లీ విజయవాడ వచ్చాము. 2014లో రాష్ట్ర విభజన జరిగినపుడు టీవీ9 వారు విజయవాడలో ఆఫీస్ ఓపెన్ చేశారు. అపుడు దీప్తికి ఆఫర్ ఇచ్చి తీసుకున్నారు.

టీవీ9లో దీప్తి సాలరీ ఎంత?

టీవీ9లో దీప్తి సాలరీ ఎంత?

టీవీ 9లో దీప్తి సాలరీ ఎంత? అనే ప్రశ్నకు శ్రీకాంత్ స్పందిస్తూ.... నాకు నిజంగా తెలియదు అంటూ సమాధానం ఇచ్చారు.

బిగ్ బాస్ షోలో ఆఫర్ గురించి...

బిగ్ బాస్ షోలో ఆఫర్ గురించి...

మా టీవీ వారు ఫోన్ చేసి మిమ్మల్ని బిగ్ బాస్ షో కోసం అనుకుంటున్నాము అని చెప్పారు. ఆ తర్వాత ఇంట్లో అందరితో మాట్లాడి... పాజిటివ్, నెగెటివ్స్ గురించి చర్చించాం. టీవీ9 వారి నుండి కూడా ప్రోత్సాహం లభించడంతో ఈ షోకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి

బిగ్ బాస్ రెమ్యూనరేషన్ గురించి

బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు రెమ్యూనరేషన్ అయితే ఉంది. అయితే అది ఎంత? అనేది తెలియదు. వారి నుండి అగ్రిమెంట్ వచ్చింది, దాన్ని లాయర్‌కు ఫార్వర్డ్ చేశాం. దీప్తి బిగ్ బాస్ ఇంటి నుండి బయటకు వచ్చే సమయానికి ఎంత ఇస్తారు అనేది అందులో వివరంగా రాసి ఉంది.

 లవర్స్ టాస్క్ మీద అప్ సెట్ అయ్యారట, నిజమేనా?

లవర్స్ టాస్క్ మీద అప్ సెట్ అయ్యారట, నిజమేనా?

లవర్స్ టాస్క్ మీద మీరు అప్ సెట్ అయినట్లు యూట్యూబ్‌లో ప్రచారం జరుగుతోంది. నిజమేనా? అనే ప్రశ్నకు శ్రీకాంత్ స్పందిస్తూ... లవర్స్ టాస్క్ గురించి నన్ను ఇంత వరకు ఎవరూ అడగలేదు. ఇలాంటి వార్తలు నేనూ చూశాను. మాటీవీ యాజమాన్యంపై ఫైర్ అయ్యానని కొందరు వేశారు, రెండు మూడు ఛానల్స్‌లో స్పోర్టివ్‌గా తీసుకున్నాడని వేశారు. నేను ఇప్పటి వరకు దాని గురించి ఎవరితోనూ మాట్లాడలేదు. కానీ నేను స్పోర్టివ్ గానే తీసుకున్నాను. ఎందుకంటే అది కేవలం టాస్క్ మాత్రమే.

రోజు రోజుకు మారిపోతోంది

రోజు రోజుకు మారిపోతోంది

బిగ్ బాస్ 2లో టైటిల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది చెప్పడం కష్టం. రోజు రోజుకు గేమ్ మారిపోతోంది. ఇది 106 రోజులు సాగే షో. ఇప్పటికి కేవలం 30 రోజులు మాత్రమే అయింది. ఇంత ముందుగా అంచనా వేయడం కష్టం అని శ్రీకాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X