గీత మాధురి, సామ్రాట్‌తో క్లోజ్‌పై అనుమానం! క్లాస్ పీకిన దీప్తి, శ్యామల!

By Rajababu

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్లు, ఎలిమినేషన్లతో కాలం గడిచిపోతున్నది. ఇప్పటి వరకు దూరంగా ఉంటున్న కొందరు సెలబ్రిటీలు ఒకరికొకరు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమతో ఉన్న భేదాభిప్రాయాలను తొలగించుకొనేందుకు సిద్ధపడుతున్నారు. గత రెండు వారాలుగా సామ్రాట్‌కు గీతా మాధురి దగ్గర కావడం ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు తలెత్తాయి. అదే అనుమానాలు ఇంట్లో గీత మాధురి స్నేహితులు శ్యామల, దీప్తి నల్లమోతు కూడా కలగడంతో వారి మధ్య ఏదో జరుగుతుందనే భావనకు బలం చేకూరింది. బయటి ప్రేక్షకులు దీనిపై చర్చిస్తే అది గాసిప్ అవుతుందేమో కానీ.. ఏకంగా ఇంటి సభ్యులే గీతా మాధురికి నచ్చచెప్పడం హాట్ టాపిక్ అయింది. సామ్రాట్ వ్యవహారంపై శ్యామల, దీప్తి, గీత మాధురి ఏం చర్చించుకొన్నారంటే..

సామ్రాట్‌తో క్లోజ్‌గా ఉండటంపై

సామ్రాట్‌తో క్లోజ్‌గా ఉండటంపై

గీతా మాధురిని ఇంటి ఆవరణలోకి తీసుకొచ్చి శ్యామల, దీప్తి సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పుడు కేవలం 10 మందే మిగిలాం. అందరం ఒకరికొకరు క్లోజ్ అవ్వడంలో తప్పేమీ లేదు. తప్పు ఒప్పులు కాకుండా కాకుండా.. సామ్రాట్‌తో క్లోజ్‌గా ఉండటంలో మాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ బయట చూసే వాళ్లకు తప్పుడు సంకేతాలు వెళ్లవద్దు అనేది మా అభిప్రాయం అని దీప్తి చెప్పింది.

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 72 Highlights...!
నందూతో ఉన్నట్టు అనిపిస్తుంది

నందూతో ఉన్నట్టు అనిపిస్తుంది

బయట నా ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటానో సమ్రాట్‌, మిగితా వారితో కూడా అలానే ఉంటున్నాను. 70 రోజులు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం దగ్గరకావడం జరుగకుండా ఉండలేదు. వారితో ఉంటే నందూ (భర్త)తో ఉన్నట్టు అనిపిస్తుంది. మా మధ్య రిలేషన్ నందుకు ఇబ్బంది కాకుండా ఉంటే బాగుంటుందని అనుకొంటున్నాను అని గీతా మాధురి బదులు చెప్పింది.

తప్పుడు ప్రచారం జరుగకుండా

తప్పుడు ప్రచారం జరుగకుండా

దీప్తి మాట్లాడుతూ.. సామ్రాట్ మోకాలిపై తల పెట్టుకొని పడుకొన్నాడు. అంత వరకు ఫర్వాలేదు. అంతకు మించింతే అది మరోలా ఉంటుంది. అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. మన మధ్య ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు మనపై తప్పుడు ప్రచారం జరుగకుండా చూసుకోవాలని సూచించింది.

 కవల పిల్లలు పుడుతారని

కవల పిల్లలు పుడుతారని

దీప్తి చెప్పిన దానికి గీతా మాధురి మాట్లాడుతూ.. గత రాత్రి సామ్రాట్, అమిత్‌లిద్దరికి తలపై రాశాను. ఆ సమయంలో నాకు కవల పిల్లలు పుడుతారేమో అనిపిస్తుంది సామ్రాట్ అన్నారు. ఎందుకంటే నేను ఇద్దరి తలపై రాస్తున్నందుకు అలా అన్నాడు. అందుకు అబ్బో ఇద్దరు పుడితే చాలా సమానంగా ప్రేమను పంచాల్సి ఉంటుంది అని అనుకొన్నాం అని అన్నారు.

 నందును రిప్లేస్ చేయలేరు

నందును రిప్లేస్ చేయలేరు

ఒకవేళ సామ్రాట్‌తో క్లోజ్‌గా ఉండటంపై మీకు ఏమైనా అనుమానాలు వస్తున్నాయా? నా జీవితంలో నందూను ఎవరూ కూడా రిప్లేస్ చేయలేరు. నందు అంటే నాకు పిచ్చి ప్రేమ. రోల్ రైడా, అమిత్, సామ్రాట్, తనీష్‌ను చూస్తే నందు గుర్తుకొస్తాడు. వీళ్లు మాట్లాడుతుంటే నందుతో మాట్లాడినట్టే ఉంటుంది.

 అతడితో క్లోజ్‌గానా?

అతడితో క్లోజ్‌గానా?

అలాగే రోల్ రైడాతో క్లోజ్‌గా ఉండటంపై కూడా శ్యామల, దీప్తి నల్లమోతు అభ్యంతరం తెలిపారు. రోల్ రైడా తలపై రాస్తూ ప్రేమను కురిపించడం మంచిది కాదు. నీవు నందుకు అలా రాస్తే ఒకే.. అలా మా తలపై రాస్తే దాని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని దీప్తి చెప్పగా.. మీరంతా చాలా సంప్రదాయంగా ఆలోచిస్తున్నారు అని గీతా అనడంతో వారి చర్చ ముగిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X