చంపడానికైనా వెనుకాడరు: దీప్తి సునైన.. కిరిటీ చేసిన తప్పే భాను.. తేజస్వికి శిక్ష.. కెప్టెన్‌గా గీత
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో శుక్రవారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా నడిచింది. ఎప్పటిలానే గ్రూపు రాజకీయాలు స్పష్టంగా కనిపించాయి. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో చెత్తగా ఆడిన సెలబ్రిటీ భానుశ్రీని బిగ్‌బాస్ ఆదేశాల మేరకు కౌశల్ జైలులో పెట్టారు. కెప్టెన్ పదవికి జరిగిన ఎన్నికల ప్రచారంలో గీతా మాధురి, దీప్తి సునైన ఆకట్టుకొన్నారు. వివరాల్లోకి వెళితే..

జైలులో భానుశ్రీ
చెత్తగా ఆడింది భానుశ్రీ అని కౌశల్ చెప్పగా బిగ్‌బాస్ ఆమెను జైలులో బంధించాలని ఆదేశించారు. దాంతో కౌశల్ జైలులో పెట్టి తాళం వేశారు. కానీ తన వద్ద ఉన్న జైలు కార్డును ఉపయోగించి భానుశ్రీని జైలు నుంచి విడిపిస్తానని కోరగా బిగ్‌బాస్ కుదరని చెప్పడం జరిగింది. దాంతో కౌశల్ జైలు కార్డు అలానే మిగిలిపోయింది.

కిరిటి మాదిరిగానే భానుశ్రీ
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భానుశ్రీ దురుసుగా ప్రవర్తించింది. కౌశల్‌పై ఆరోపణలు చేసి తిరిగి మాట మార్చడం వల్లే జైలుశిక్ష పడిందనే అభిప్రాయాన్ని సామ్రాట్ వ్యక్తం చేశాడు. గతంలో కౌశల్‌కు వ్యతిరేకంగా కిరిటి చేసిన తప్పునే భానుశ్రీ చేసింది అని పేర్కొన్నాడు. సామ్రాట్ అభిప్రాయానికి బాబు గోగినేని కూడా మద్దతు తెలిపాడు.

తేజస్వికి శిక్ష విధింపు
లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇరు జట్లు బాగా ఆడినందున బిగ్‌బాస్ మంచి పాయింట్లు ఇచ్చాడు. కానీ ఇంటిలో పరికరాలను ధ్వంసం చేసినందుకు తేజస్వికి శిక్ష విధించాడు. లగ్జరీ వస్తువులను వాడుకోవడానికి వీలులేదు. అలాగే ఇంటి సభ్యులు కూడా తమ లగ్జరీ వస్తువులను ఇవ్వడానికి వీలు లేదని ఆంక్షలు విధించాడు.

భానుశ్రీపై కౌశల్ వివక్ష
జైలులో ఉన్న భానుశ్రీని శుక్రవారం మధ్యాహ్నానికే విడుదల చేశాడు. ఈ నందర్భంగా తాను త్వరగా విడుదలయ్యానని భానుశ్రీ చెప్పడం గమనార్హం. భానుశ్రీని జైలుకు పంపించడంలో కౌశల్ వివక్ష చూపించాడు అని తేజస్వి, సామ్రాట్ అనడం జరిగింది.

కెప్టెన్ పదవికి గీత, దీప్తి
బిగ్‌బాస్ హౌస్‌లో పలు మార్పులు చోటుచేసుకొనేందుకు ఈ వారం కెప్టెన్ పదవికి ఇద్దరు మహిళలను నామినేట్ చేశారు. సీక్రెట్ టాస్క్‌లో అందరి వస్తువులను దొంగిలించి గెలిచిన గీతా మాధురిని ఒక అభ్యర్థిగా పరిగణించారు. మరో అభ్యర్థిని ఎన్నుకోవాలని ఇంటి సభ్యులకే వదలివేశాడు. దాంతో దీప్తి సునైనాను కెప్టెన్ పదవికి పోటీదారులుగా ఎంపిక చేశారు.

కెప్టెన్‌గా గీతా మాధురి ఎంపిక
కెప్టెన్ పదవికి గీతా మాధురి, దీప్తి సునైన విభిన్న తరహాలో ప్రచారం నిర్వహించారు. ప్లకార్డులు ధరించి ప్రతీ ఇంటి సభ్యుడిని ఓటు అడిగారు. వారు వేసే ప్రశ్నలకు ఇద్దరూ ఓపికగా సమాధానాలు చెప్పారు. ఇంటిలో ఎలాంటి మార్పులు చేపట్టబోతున్నారో సభ్యులకు చెప్పారు. ఇలా హామీలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇంటిలో జరిగిన కెప్టెన్ ఎన్నికలో గీతామాధురి భారీ మెజారిటీతో గెలుపొందారు. గీతాకు 10 ఓట్లు రాగా, దీప్తి సునైనాకు రెండు ఓట్లు రావడం జరిగింది.

చంపడానికైనా వెనుకాడరని
ఇంటి సభ్యుల్లో ఒకరికొకరు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది అని దీప్తి సునైనా అభిప్రాయపడింది. బిగ్‌బాస్ టైటిల్‌ను గెలువడానికి చంపడానికి కూడా వెనుకాడని పరిస్థితి ఇంటిలో ఉంది అని దీప్తి సునైనా షాకింగ్ కామెంట్లు చేసింది.

ఆకట్టుకొన్న దీప్తి సునైనా
ఎన్నికల ప్రచారంలోనే కాకుండా ఓటింగ్‌లో కూడా దీప్తి సునైనా పరిణతిని చూపింది. ఎవరైనా కెప్టెన్‌గా నిలపడితే తనకే ఓటు వేసుకొంటారు. కానీ ఇంటిలో సీనియర్ సభ్యురాలైన గీతా మాధురికి ఓటు వేస్తే చక్కగా హ్యాండిల్ చేస్తుంది అని దీప్తి స్వయంగా ఆమెకు ఓటు వేయడం అందరినీ ఆకట్టుకొన్నది.


Click it and Unblock the Notifications











