రీతూతో అలానే ఉంటా.. రిలేషన్‌పై డిమాన్ ఓపెన్.. బ్రేకప్ తప్పా అంటూ..

Demon Pavan - Rithu Chowdary: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9తో ప్రేక్షకులకు బాగా దగ్గరైన జంటల్లో రీతూ చౌదరి - డిమాన్ పవన్ జంట ఒకటి. హౌస్‌లో ఉన్నప్పటి నుంచే వీళ్ల మధ్య కనిపించిన బాండింగ్, కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అదే బాండింగ్ బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుండటంతో, వీరిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారా? అన్న చర్చలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల ఇద్దరూ కలిసి ఓ డ్యాన్స్ షోలో పాల్గొనడం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన కిసిక్ టాక్ షో ప్రోమోలో డిమాన్ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

షో ప్రారంభంలోనే యాంకర్ వర్ష తనదైన పంచులతో డిమాన్ పవన్‌ను ఇరుకాటంలో పడేసే ప్రయత్నం చేసింది. "అసలు కత్తి ఉంటే వేసేసేదాన్ని... మా రీతూను ఎందుకు నామినేట్ చేశావు? అప్పటి నుంచి కోపంతో చంద్రముఖిలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు దొరుకుతావని" అంటూ షాకింగ్ కామెంట్స్‌తో ఇంటర్వ్యూను మొదలుపెట్టింది. దానికి పవన్ కూడా తగ్గకుండా 'నామినేషన్స్ ఉన్నది నామినేట్ చేయడానికే కదా, లేకపోతే ఇంకెందుకు?' అంటూ వర్షకు గట్టిగానే రిప్లై ఇచ్చాడు. ఈ సరదా మాటల తూటాలు ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేశాయి.

Demon Pavan Opens Up About His Relationship With Rithu Chowdary After Bigg Boss Telugu 9

అంతటితో ఆగకుండా వర్ష నేరుగా రీతూ గురించి ప్రశ్నించింది. 'ఎలా ఉంది?' అంటూ అడిగితే, పవన్ మొదట విషయం అర్థం కానట్టుగా 'నేను బాగానే ఉన్నా' అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ వర్ష మరోసారి అదే ప్రశ్న వేయడంతో, 'రీతూ గురించా?'అంటూ సిగ్గుపడుతూ స్పందించాడు. ఆ క్షణంలో పవన్ ముఖంలో కనిపించిన ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇక బిగ్‌బాస్ హౌస్‌లో రీతూ-పవన్ మధ్య జరిగిన గొడవను గుర్తు చేస్తూ వర్ష ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసింది. 'రీతూను నువ్వు నామినేట్ చేసినప్పుడు, రీతూ కన్నా నువ్వే ఎక్కువగా లోపల ఏడ్చినట్టు అనిపించింది' అని అడిగింది. దానికి పవన్ భావోద్వేగంగా స్పందిస్తూ, 'ఫస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి' అన్నాడు. అదే సమయంలో వారి రిలేషన్ గురించి క్లారిటీ ఇస్తూ, 'మేమిద్దరం బావ-మరదళ్లలా ఉంటాం. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అలానే ఉన్నాం. నాకు ఆమె అంటే ఫ్రెండ్ కంటే మరదలిలా ఫీల్ అయ్యేది'అని చెప్పాడు. 'రీతూ ఫ్రెండ్‌గా కాకుండా మరదలిగా బాగుంటుంది అనిపించిందా?' అని అడగ్గా, పవన్ 'ఫస్ట్ నుంచే నేను అలానే ఫీల్ అవుతున్నా' అంటూ నవ్వేశాడు.

రీతూ ఇంటికి ఎప్పుడైనా పిలిచిందా? అన్న ప్రశ్నకు పవన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'ఒకసారి పిలిచింది కానీ వెళ్లలేదు. తర్వాత మళ్లీ పిలవలేదు'అన్నాడు. దీనిపై వర్ష సరదాగా 'మరోసారి పిలుస్తుంది... అప్పుడు కూడా వెళ్లకపోతే విడిచిపెట్టి వెళ్లిపోతుంది' అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి పవన్ 'పిలిస్తే కదా వెళ్లేది... పిలవాలి' అని అనగానే, వర్ష 'బావ చికెన్ చేసిన వస్తావా అన్నట్టు పిలవాలా?' అంటూ సెటైర్ వేసింది.

బయటివాళ్లు హౌస్‌లోకి వచ్చి రీతూ క్యారెక్టర్ గురించి బ్యాడ్‌గా మాట్లాడినప్పుడు ఎలా ఫీలయ్యావు? అని వర్ష అడగ్గా, పవన్ సీరియస్‌గా స్పందించాడు. 'హౌస్‌లో జరిగేదంతా జెన్యూనే. వాళ్లు ఎందుకు అలా మాట్లాడారో, ఎందుకు నమ్మలేకపోయారో నాకు చాలా బాధ వేసింది. హౌస్ బాండ్ నిజమైనది కాకపోతే, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంతకాలం కలిసి ఉండలేం. బయటికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రీతూతో ఒక్క గొడవ కూడా కాలేదు' అని స్పష్టం చేశాడు.

అమ్మాయి అయినా అబ్బాయి అయినా కెరీర్‌లో ఎదురు దెబ్బలు తిని మళ్లీ జీవితాన్ని ప్రారంభిస్తే, వాళ్ల నుంచి చాలా నేర్చుకోవచ్చని పవన్ చెప్పాడు. 'అలాంటి వాళ్లు మనకు ఇన్స్పిరేషన్'అంటూ రీతూపై పరోక్షంగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. సమాజంలో బ్రేకప్ అయిన అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడటం చూస్తున్నాం కదా? మీరు ఆ విషయాన్ని ఎలా చూస్తారు? అన్న ప్రశ్నకు పవన్ 'బ్రేకప్ అనేది జీవితంలో చాలా సాధారణం. మన ఫ్రెండ్స్‌లోనే చాలామందికి బ్రేకప్ అయి ఉంటుంది. వారిని మనం వదిలేస్తామా?'అంటూ కౌంటర్ ప్రశ్న వేశాడు.

మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో డిమాన్ పవన్ మాటలు, ఎక్స్‌ప్రెషన్స్ రీతూ-పవన్ రిలేషన్‌పై మరింత ఆసక్తిని పెంచాయి. వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? లేక మంచి ఫ్రెండ్స్‌గానే ఉంటారా? అన్నది కాలమే చెప్పాలి. కానీ ఒకటి మాత్రం ఖాయం... రీతూ-డిమాన్ జంట బిగ్‌బాస్ తర్వాత కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X