Demon Pavan Remuneration: సామాన్యుడి నుంచి యోధుడిగా.. డిమాన్‌ పవన్ రెమ్యునరేషన్ ఎన్ని లక్షలంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 (Bigg Boss Telugu 9) చివరి అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ పడనున్నది. ఈ తరుణంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా బిగ్ బాస్ గురించే చర్చ. ఈ సీజన్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ట్రోఫీ ఎవరి చేతికి వెళ్తుంది? అనే ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కేవలం ఒక్క రోజులోనే గ్రాండ్ ఫినాలే జరగనుండటంతో, ఈ సీజన్‌కు సంబంధించిన ప్రతి అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా డిమాన్ పవన్ (Demon Pavan)రెమ్యునరేషన్ చర్చనీయంగా మారింది. ఇంతకీ డిమాన్‌ పవన్ రెమ్యునరేషన్ ఎన్ని లక్షలంటే?

డిమాన్ పవన్‌ను అగ్నిపరీక్ష టాస్క్‌లో చూసిన చాలామంది మొదట్లో 'ఇతడు బిగ్ బాస్‌కు సెలెక్ట్ కాకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు' అని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయన బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో అడుగుపెట్టాడు. తన ఆట, తన మాట తీరుతో అందరి అభిప్రాయాలను పూర్తిగా మార్చేశారు. కండబలంతో పాటు బుద్ధిబలం ఉపయోగించి ఆడుతూ, తాను సాధారణ కంటెస్టెంట్ కాదని నిరూపించారు. వరుసగా రెండుసార్లు కెప్టెన్‌గా నిలిచాడు. అయితే రీతూతో ఉన్న లవ్ ట్రాక్ కారణంగా పవన్‌పై కొంత నెగెటివిటీ వచ్చింది.

Demon Pavan Remuneration From Commoner to Warrior How Much Did Bigg Boss Telugu 9 Star Earn

బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరూ ఎప్పుడూ గొడవపడటం, మళ్లీ కలిసిపోవడం... ఈ డ్రామా కొంతమందికి చిరాకు తెప్పించిన మాట వాస్తవమే. దీంతో పవన్ గేమ్ దెబ్బతిన్నదని, టాప్ 5 లో కూడా నిలుస్తాడో లేదో అనే సందేహం వ్యక్తం చేశారు. కానీ రీతూ ఎలిమినేట్ అయిన తర్వాత పవన్ పూర్తిగా మారిపోయాడు. తన ఆట తీరుతో టాప్ 5 లో స్థానం సంపాదించుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా టైటిల్ రేసులో కళ్యాణ్, తనూజలకు గట్టి పోటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్ ప్రకారం.. టాప్ 3 నిలిచి, టైటిల్ కోసం పోరాడుతున్నారు.

వాస్తవానికి రీతూ బయటకు వెళ్లిన వెంటనే పవన్‌లో పవర్ యాంగిల్ బయటపడింది. పంచ్‌లు వేస్తూ కామెడీ చేయడం, టాస్కుల్లో 'బాహుబలి'లా ఆడటం, గేమ్‌పై పూర్తి ఫోకస్ పెట్టడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట్లో ఫైనల్‌లో నాలుగో స్థానంలో ఉంటాడనుకున్న పవన్, ఓటింగ్ ట్రెండ్స్‌లో ఏకంగా మూడో స్థానానికి ఎగబాకడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 'ఈ ఫైర్ మొదటి నుంచే ఉండుంటే పవన్ విన్నర్ అయ్యేవాడు' అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కూడా పవన్ ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రశంసించాడు. 'మీ విల్ పవర్, ఫిట్‌నెస్ మాత్రమే కాదు... గెలుపు కోసం చివరి వరకూ పోరాడే తత్వం మిమ్మల్నీ నిజమైన యోధుడిగా మార్చేశాయి. కామనర్‌గా అడుగుపెట్టిన పవన్ నేను యోధుడుగా మారారు. అమాయకమైన చిరునవ్వు వెనక ఉన్న డిమాన్ ఏంటో అందరికీ చూపించారు. నామినేషన్లలో ఎంతమంది మాటలతో దాడి చేసినా, మీరు మౌనంగా నిలబడ్డారు. అవసరమైనప్పుడు మాత్రమే ధీటుగా బదులిచ్చారు' అంటూ బిగ్ బాస్ ఎలివేషన్ ఇచ్చాడు. అంతే కాదు 'మాటల కన్నా చేతలే గొప్ప' అన్న నమ్మకంతో పవన్ ఆడిన ఆటే అతడిని ఇంత దూరం తీసుకొచ్చిందని బిగ్ బాస్ వ్యాఖ్యానించాడు.

ఒక్క గెలుపు కూడా పవన్‌కు సులువుగా రాలేదని, ప్రతి విజయం చెమటోడ్చి సాధించిందేనని స్పష్టం చేశాడు. ఎవరి మద్దతు లేకపోయినా, తన కోసం తానే వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డాడని ప్రశంసించాడు. అయితే పవన్ మనసంతా రీతూనే ఉండటం, ఆమె బయటకు వెళ్లినప్పుడు ఆయన కంటతడి పెట్టడం ప్రేక్షకులను కదిలించింది. జర్నీ వీడియోలో ఎక్కువ భాగం రీతూతో గడిపిన క్షణాలే ఉండటం, తాను ఎదుర్కొన్న అవమానాలు, ఆడిన ఆటలు, తల్లి జ్ఞాపకాలు అన్ని పవన్‌ను ఎమోషనల్ చేశాయి. చివర్లో 'పోతారు... మొత్తం పోతారు' అనే డైలాగ్‌తో బిగ్ బాస్ పవన్ రేంజ్‌ను మరింత పెంచేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. డిమాన్ పవన్ రెమ్యునరేషన్ మీద పడింది. సమాచారం ప్రకారం పవన్‌కు వారానికి సుమారు రూ.70,000 చొప్పున చెల్లించినట్టు తెలుస్తోంది. 15 వారాలకు గాను ఆయన సుమారు రూ.10 లక్షల 50 వేల వరకు సంపాదించినట్టు అంచనా. ప్రస్తుతం టాప్ 5లో ఉన్న పవన్ ఒకవేళ టైటిల్ విన్నర్ అయితే, ఈ మొత్తానికి అదనంగా రూ.50 లక్షల ప్రైజ్ మనీ, ఇతర బోనస్‌లు, గిఫ్టులు కూడా అందుకునే అవకాశం ఉంది. అన్ని కలిసొస్తే పవన్ భారీ మొత్తంతో ఇంటికి వెళ్లే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి సాధారణ కంటెస్టెంట్‌గా మొదలైన పవన్ ప్రయాణం ఓ యోధుడిగా ఎదిగేలా చేసింది. విన్నర్ అవుతాడా లేదా అన్నది ఫినాలే రోజునే తేలనుంది. ఇక బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X