త్వరలో పెళ్లి పీటలెక్కనున్న డిమోన్ పవన్- రీతూ చౌదరి? బిగ్‌బాస్ కంటెస్టెంట్ హింట్!
బిగ్‌బాస్ సీజన్ వస్తుందంటే ఖచ్చితంగా ఫన్, గొడవలు, టాస్క్‌ల కోసం ఎదురుచూస్తారు. వీరితో పాటు ఈ ఏడాది లవ్ బర్డ్స్ ఎవరు? అన్న దానిపైనా ఆన్‌లైన్‌లో డిస్కషన్స్ జరుగుతాయి. ప్రతి బిగ్‌బాస్ సీజన్‌లోనూ రెండు మూడు జంటలు తమ రొమాన్స్, లవ్‌ట్రాక్‌లతో ఆడియన్స్‌ను మెప్పిస్తారు. వీరిలో కొందరు స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటూ ఉండగా.. మరికొందరు మాత్రం నిజంగానే ప్రేమలో పడి, పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు. హిందీ సహా ప్రాంతీయ భాషలలో ప్రసారమవుతున్న ఏ బిగ్‌బాస్ సీజన్ తీసుకున్నా ఇలాంటి వారు తారసపడతారు.
డిమోన్‌తో క్లోజ్‌గా రీతూ చౌదరి
గతేడాది జరిగిన బిగ్‌బాస్ తెలుగు 9లో డిమోన్ పవన్ - రీతూ చౌదరిల జంట అందరినీ ఆకట్టుకుంది. సెలబ్రిటీ అయ్యుండి, హౌస్‌లో తన ఫ్రెండ్స్ తనూజ, ఇమ్మాన్యుయేల్ ఉన్నప్పటికీ డిమోన్ పవన్‌తో రీతూ చౌదరి క్లోజ్‌గా ఉండటం ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచింది. హౌస్‌లో ఎవరు ఏం చేసినా? ఏం జరిగినా ప్రతి విషయంలోనూ పవన్‌కు సపోర్ట్ చేసింది రీతూ. అటు పవన్ కూడా తనతో పాటు హౌస్‌లోకి వచ్చిన కామన్‌మెన్స్‌ను కాకుండా రీతూతోనే ఎక్కువగా ఉండేవాడు. చాలా సందర్భాల్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

డిమోన్ కోసం సపోర్ట్ చేసిన రీతూ
బిగ్‌బాస్ నుంచి తను ఎలిమినేట్ అయినప్పటికీ డిమోన్ పవన్ గెలవాలని రీతూ అండగా నిలిచింది. తన సర్కిల్‌తో పాటు పీఆర్‌ను వాడి అతనికి ఓట్లు పడేలా చేసిందని టాక్. డిమోన్‌కు నాకు మధ్యన ఏం లేదని రీతూ చెప్పింది. అతను చాలా ఇన్నోసెంట్, నిజాయితీపరుడు, మంచి వ్యక్తి అని పవన్‌ను ప్రశంసించింది. మన స్కూల్‌లో, కాలేజీలో ఉండే బెస్ట్ ఫ్రెండ్‌లాగా నాకు హౌస్‌లో సపోర్ట్ చేశాడని తెలిపింది రీతూ. అయితే రీతూ కారణంగా పవన్ గేమ్ సరిగా ఆడలేకపోతున్నాడని, ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరుగుతున్నాడని సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపించాయి.
రీతూ చౌదరితో బీబీ జోడీ 2లోకి డిమోన్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో తన అద్భుతమైన ఆటతీరుతో అలరించిన డిమోన్ పవన్.. సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. తన అదృష్టమో లేక తల్లిదండ్రుల అదృష్టమో కానీ చివరి నిమిషంలో బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చెప్పి 15 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్ అందుకున్నాడు. అసలు బిగ్‌బాస్ నిర్ణయం ప్రకారం అప్పుడు పవన్ ఎలిమినేట్ కావాల్సి ఉండటంతో అంతా అతని సమయస్పూర్తి, అదృష్టానికి ఆశ్చర్యపోయారు. బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక ఎప్పటిలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లా ఉంటాడా? సినిమాలలో ఏమైనా ట్రై చేస్తాడా? అంటూ పెద్ద ఎత్తున డిస్కషన్స్ నడిచాయి. అయితే తన ఫ్రెండ్ రీతూ చౌదరితో కలిసి స్టార్ మాలో ప్రసారమవుతున్న బీబీ జోడీ 2 డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. దీనితో పాటు మా టీవీలోనే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ జీవితంలో స్థిరపడేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న లవ్ బర్డ్స్?
అయితే రీతూ చౌదరి- డిమోన్ పవన్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఎప్పటి నుంచో గాసిప్స్ వస్తున్నాయి. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ సందర్భంగా రీతూ చౌదరిని స్టార్ యాంకర్ శ్రీముఖి .. డిమోన్‌తో పెళ్లెప్పుడు అని అడగటంతో అంతా అవాక్కయ్యారు. ఈ ప్రోమోను పరిశీలిస్తే.. స్టార్ మా పరివారం కార్యక్రమం 175వ ఎపిసోడ్ కావడంతో శ్రీముఖి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పింది.
డిమోన్ పవన్‌తో రీతూ చౌదరి పెళ్లి ఎప్పుడు?
మన 175 ఎపిసోడ్‌ల వరకు ఎపిసోడ్ నెంబర్ ఎలా పెరుగుతోందో? కావ్య అందం అలా పెరుగుతోందని ఓ కంటెస్టెంట్ అన్నాడు. ఈవికు పెరుగుతోంది.. కానీ నీ కామెడీ పెరగడం లేదని అవినాష్ పంచ్ విసిరాడు. ఆ వెంటనే చిన్నదో చిన్నదో అనే పాటతో రీతూ చౌదరి ఎంట్రీ ఇచ్చింది. అది సరేగానీ ఇంతకీ ఏ గుడిలో పెళ్లో చెబితే భోజనాలకు వచ్చేస్తాం మేం అని శ్రీముఖి అడిగింది. ఎవరి పెళ్లి అని రీతూ అడగ్గా.. నీది, డిమోన్‌ది. వాడిని అడిగితే అక్కా నువ్వు అలా అనకు అక్కా అంటాడు అని డిమోన్‌ని ఇమిటేట్ చేసింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నిజంగానే రీతూ చౌదరి - డిమోన్ పవన్‌లు పెళ్లి చేసుకోబోతున్నారా? శ్రీముఖి చెప్పినదాంట్లో నిజమెంత అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి శ్రీముఖి ప్రశ్నకు రీతూ చౌదరి ఏమని ఆన్సర్ ఇచ్చిందో తెలియాలంటే ఈ ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











