Demon Pavan Buzzz: రీతూతో డిమోన్ లవ్ ట్రాక్ ప్లానా? ఆ విషయంలో టెంమ్ట్.. బిగ్‌బాస్ మన్మధుడికి శివాజీ చుక్కులు..
Demon Pavan Buzzz: కామనర్‌గా అడుగుపెట్టి యోధుడిగా ఎదిగిన ప్రయాణం డిమాన్ పవన్ (Demon Pavan)ది. మాటలకన్నా చేతలే గొప్ప అని నిరూపిస్తూ, ప్రతి విజయాన్ని చెమటోడ్చి సాధించిన కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రీతూ లవ్ ట్రాక్ కొంత నెగటివిటీ తీసుకొచ్చినప్పటికీ, వాటిని అధిగమించి అవమానాలను జయంగా మార్చుకున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒంటరిగా వన్ మ్యాన్ ఆర్మీలా పోరాడుతూ, భావోద్వేగాల మధ్యనూ ధైర్యంగా నిలబడి టాప్ 3కి చేరిన పవన్ ప్రయాణం ప్రశంసలందుకుంది.
బిగ్‌బాస్ జర్నీ ముగిసిన అనంతరం, హీరో శివాజీ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ బజ్ (Bigg Boss Buzz) ఇంటర్వ్యూలో డిమాన్ పవన్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో శివాజీ పవన్‌కు చుక్కలు చూపిస్తూ ఆసక్తికర ప్రశ్నలతో నిలదీశారు.'బిగ్‌బాస్ సీజన్ 9 ప్రేమికుడు డిమాన్ పవన్'అంటూ ఆహ్వానించడమే కాకుండా, ఓ స్పెషల్ గిఫ్ట్ అందించి 'బిగ్‌బాస్ సీజన్ 9 మన్మథుడు'అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఇచ్చారు.

ఆ తర్వాత ప్రైజ్ మనీ విషయాన్ని ప్రస్తావించిన శివాజీ 'ఐదు టెంప్ట్ కాలేదు, 7.5కి కూడా టెంప్ట్ కాలేదు, 10 దగ్గర మాత్రం కాస్త టెంప్ట్ అయినట్లే కనిపించింది'అని ప్రశ్నించారు. దీనికి పవన్ స్పందిస్తూ.. ఇంట్లో వాళ్ల నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని తన ఫైనల్ డిసిషన్ చెప్పాలనుకున్నానని వెల్లడించారు. ఇక గేమ్ ప్లాన్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 'ఈ రెండు వారాల్లో చూపించిన గేమ్ ప్లాన్, గోదావరి ఎటకారం కామెడీ టైమింగ్ ఫస్ట్ వీక్ నుంచే చూపించి ఉంటే నువ్వే టైటిల్ విన్నర్ అయ్యేవాడివి'అని అన్నారు. దీనికి పవన్ 'నాకు కొంచెం మొహమాటం ఎక్కువ" అని సమాధానమివ్వగా, శివాజీ వెంటనే "అది మొహమాటం కాదు... అది రీతు అనే గేటు' అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.
ఇంటర్వ్యూలో శ్రీజ వ్యాఖ్యలను కూడా శివాజీ ప్రస్తావించారు. 'లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతుంది, ట్రై చేస్తాను అని నువ్వు మొదటే చెప్పావు' అంటూ శ్రీజ చెప్పిందని పేర్కొంటూ.. పవన్‌ను ఇరకాటంలో పడేశారు. దీనికి పవన్ 'అది ఆర్గానిక్‌గా జరిగింది. ప్లాన్ చేసింది కాదు'అని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే శివాజీ మాత్రం 'మేము ఆర్గానిక్ అనుకున్నాం, కానీ అది రాను రాను హైబ్రిడ్‌గా మారిపోయింది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి చర్చను మరింత వేడెక్కించారు. అంతేకాదు, శ్రీజ తన ఇంటర్వ్యూలో 90 శాతం మీ ఇద్దరి గురించే చెప్పిందని మరోసారి షాక్ ఇచ్చారు.
దీంతో పవన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. 'నేను బయట ఎలా ఉంటానో, బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అలానే ఉన్నాను' అంటూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. శివాజీ 'ఇక్కడికి వచ్చిన 20 మంది కంటెస్టెంట్లు కూడా ఇదే చెప్పారు' అంటూ మధ్యలో అడ్డుపడ్డారు. ఈ దశలో పవన్, 'హౌస్‌లో రీతు సపోర్ట్ చేసినట్లుగా నన్నెవరూ సపోర్ట్ చేయలేదు'అంటూ తన బాధను వ్యక్తం చేశారు. చివరగా, '15 వారాలు అందరు కంటెస్టెంట్లను దాటుకుని ఇక్కడికి వచ్చావ్... నీ జర్నీ ఎలా అనిపించింది?' అని శివాజీ అడగగా, పవన్ భావోద్వేగంగా స్పందించారు. 'చాలా ప్రౌడ్‌గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. నిజంగా బిగ్‌బాస్ నాకు గొప్ప అవకాశం'అంటూ కృతజ్ఞతలు తెలిపారు. డిమాన్ పవన్ బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ మొత్తం ఎమోషన్స్, షాకింగ్ కామెంట్స్, ఆసక్తికర అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం డిమాన్ పవన్ బజ్ ఇంటర్య్వూ వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications










