లోపల నేను ఆడాను కానీ.. నా ఫ్యామిలీ ఆడిన ఆటే గొప్పది.. హారిక కామెంట్స్ వైరల్

బిగ్ బాస్ షోలో హారిక టాప్ 5 వరకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంట్లో తాను ఆట ఆడితే.. బయట తనకోసం తన ఫ్యామిలీ ఇంకా బాగా ఆడిందంటూ హారిక చెప్పుకొచ్చింది. మామూలుగానే కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో కష్టపడుతూ ఉంటే.. వారి ఫ్యామిలీ మాత్రం బయటకు వారి కోసం అహర్నిశలు కష్టపడుతుంటుంది. కంటెస్టెంట్లపై వచ్చే ట్రోలింగ్స్, నెగెటివ్ కామెంట్లకు సమాధానాలు చెబుతూ.. అపోహలను తొలగించాల్సి ఉంటుంది. ఇలా తనకోసం తన ఫ్యామిలీ ఎంతో కష్టపడిందంటూ హారిక చెప్పుకొచ్చింది.

హారిక ఎమోషనల్..

హారిక ఎమోషనల్..

బిగ్ బాస్ ఇంట్లో హారిక తన అన్న వంశీ గురించి ఎన్నోసార్లు తలుచుకుంది. అంతేకాకుండా తన ఫ్యామిలీ గురించి చెబుతూ అందరినీ కంటతడి పెట్టించింది. సింగిల్ పేరెంట్ కష్టాలు..నాన్న వదిలేసి వెళ్లడం, అమ్మ ఒంటరిగా పెంచడం వంటి విషయాలను చెప్పింది. తన అమ్మ గురించి చెబుతూ కంటతడి పెట్టేసింది.

జుట్టు కత్తిరించుకున్నప్పుడు కూడా..

జుట్టు కత్తిరించుకున్నప్పుడు కూడా..

టాస్క్‌లో భాగంగా హారిక తన జుట్టు కత్తిరించుకున్నప్పుడు కూడా కన్నీరు పెట్టేసుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించుకోనని అన్నకు మాటిచ్చాను.. కానీ మాట తప్పుతున్నాను.. సారీ అంటూ ఎమోషనల్ అయింది. ఆ సమయంలోనూ హారిక బ్రదర్ వంశీ తన కోసం నిలబడ్డాడు. మంచి పని చేశావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఆ విషయంపై అలా..

ఆ విషయంపై అలా..

ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భాగంగా హారిక తన తల్లిని చూసి ఏదో జరిగిందని బాధపడుతూ ఉంది. తన అమ్మకు ఏదో జరిగింది.. దెబ్బ ఎందుకు తాకిందంటూ హారిక ఎమోషనల్ అయింది. అలా హారిక ఎమోషనల్ అవుతూ ఉంటే స్టేజ్ మీద నుంచి తన అన్న అసలు విషయం చెప్పి హారికను కూల్ చేసేశాడు.

బయటి నుంచి సపోర్ట్..

బయటి నుంచి సపోర్ట్..

హారికపై చివరి మూడు వారాల్లో విపరతీమైన ట్రోలింగ్ వచ్చిన సమయంలోనూ పాజిటివిటీ స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేశారు. టాప్ 5 కంటెస్టెంట్ నుంచి విన్నర్ చేయాలని బాగానే శ్రమించారు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది. ఐదో స్థానంలో వెనుదిరిగి వచ్చేసింది. బయటకు వచ్చాక హారిక తన క్రేజ్, ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయింది. తన కోసం తన ఫ్యామిలీ ఎంత కష్టపడిందో తెలుసుకుంది.

నా కంటే గొప్పది..

నా కంటే గొప్పది..

హౌస్ లోపల నేను ఆడిన దాని కంటే హౌస్ బయట మా అన్న, మామ్ ఆడిన ఆటనే ఇంకా గొప్పది.. వారిద్దరూ నా జీవితంలో ఉండటం నాకెంతో గర్వంగా ఉంది.. నా అన్న చేయాల్సిన దాని కంటే ఎక్కువే చేశాడు.. నా అన్నకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్.. నా వెనకు, నా జర్నీ వెనుక ఉన్నది మా అన్నే అంటూ హారిక ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X