హారికను వదిలిపెట్టనంటూ సోదరుడి వార్నింగ్: బిగ్ బాస్‌లో ఆ పని చేయడంపై షాకింగ్ రియాక్షన్

By Manoj Kumar P

అలేఖ్య హారిక... ఈ పేరు పెద్దగా పరిచయం లేదు. కానీ, దేత్తడి హారిక అంటే మాత్రం చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో దక్కించుకున్న గుర్తింపే. సమాజంలో హాట్ టాపిక్ అవుతోన్న ఎన్నో అంశాలపై వీడియోలు రూపొందించి.. భారీ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుంది హారిక. ఈ గుర్తింపుతోనే బిగ్ బాస్ సీజన్ - 4 అవకాశాన్ని అందుకుంది.

హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో ప్రేక్షకుల దృష్టిలో పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హౌస్‌లో చేసిన ఓ పని పట్ల ఆమె సోదరుడు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇకపై హారికను వదలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

 అప్పుడు కాకున్నా.. ఇప్పుడు తెలిసింది

అప్పుడు కాకున్నా.. ఇప్పుడు తెలిసింది

దేత్తడి హారిక తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్. చాలా కాలంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఆమె హవా చూపిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఫాలోవర్లను దక్కించుకుంది. అయినప్పటికీ ఈమె చాలా మంది తెలియదు. అయితే, బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అయిపోయిందీ సోషల్ మీడియా స్టార్.

పొట్టి బట్టలు, హాట్ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ

పొట్టి బట్టలు, హాట్ డ్యాన్స్‌తో రచ్చ రచ్చ

బిగ్ బాస్ హౌస్‌లో తన మార్క్ చూపించేందుకు హారిక విశ్వ ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది. టాస్కులోనైనా ఇతర విషయాల్లోనైనా తన అభిప్రాయాలు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓ రోజు మార్నింగ్ మస్తీలో భాగంగా పొట్టి దుస్తులు ధరించి హాట్ డ్యాన్స్ చేసింది. ఇక, ఆరోజు నుంచి హారిక బాగా ఫేమస్ అయింది. దీంతో ఆమెకు అభిమానులూ భారీగా పెరిగిపోయారు.

అభిజీత్‌తో ట్రాక్.. మోనాల్ రివీల్ చేసింది

అభిజీత్‌తో ట్రాక్.. మోనాల్ రివీల్ చేసింది

బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకులు హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. గతంలో జరిగిన సీజన్ల మాదిరిగానే.. ఇప్పుడు కూడా అభిజీత్ - మోనాల్, అఖిల్ - మోనాల్ ట్రాకులు నడిచాయి. అదే సమయంలో హారిక.. అభిజీత్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తుందన్న టాక్ కూడా వినిపించింది. హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా గతంలో ఈ విషయాన్ని రివీల్ చేయడంతో దానికి బలం చేకూరింది.

ఆ టాస్కుతో యవ్వారం మొత్తం లీకైంది

ఆ టాస్కుతో యవ్వారం మొత్తం లీకైంది

రోబో - హూమన్స్ టాస్క్ సమయంలో దివి నుంచి చార్జింగ్ పెట్టుకున్నాడు అభిజీత్. ఆ వెంటనే మిగిలిన కంటెస్టెంట్లను కాదని, హారికకు చార్జ్ పెట్టాడు. ఇదే విషయాన్ని నాగార్జున సైతం ప్రస్తావించడంతో వీళ్ల మధ్య బంధం బయట పడింది. ఆ తర్వాత హోటల్ టాస్కులో సైతం వీళ్లిద్దరూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకోవడం చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే.

ఆ పని చేయడంపై హారిక బ్రదర్ రియాక్షన్

ఆ పని చేయడంపై హారిక బ్రదర్ రియాక్షన్

బిగ్ బాస్ హౌస్‌లో ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. తద్వారా షో రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. గత ఎపిసోడ్‌లో బిగ్ బాస్ - హౌస్‌మేట్స్ మధ్య డీల్ అనే టాస్క్ నడిచింది. ఇందులో భాగంగానే హారిక తన జుట్టును మెడపై వరకు కత్తిరించుకోవడంతో పాటు ఎరుపు రంగుకు కూడా వేసుకుంది. దీనిపై ఆమె సోదరుడు వంశీ కార్తీక్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Ghajjar Extra Glamour
హారికను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చాడు

హారికను వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చాడు

జుట్టు కత్తిరించుకునే సమయంలో ‘నేనిలాంటి పనులు చేయనని మా బ్రదర్‌కు మాటిచ్చాను' అంటూ ఏడ్చేసింది హారిక. తాజాగా దీనిపై స్పందించిన ఆమె సోదరుడు ‘నువ్వు హౌస్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్. నువ్వు జట్టు కత్తిరించుకోవడంపై కోపం లేదు. కానీ, నిన్ను టీజ్ చేయడానికి నాకో అవకాశం వచ్చింది. ఇకపై నిన్ను వదలను బుజ్జితల్లి' అంటూ పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X