బిగ్ బాస్‌లో మిడ్‌నైట్ మసాలా సీన్: బెడ్ మీద అభిజీత్ హారిక రొమాన్స్.. లెటర్‌తో బయటపడ్డ ప్రేమ!

అదిరిపోయే ఆరంభం దక్కించుకున్న నాలుగో సీజన్ ఫినాలే స్టేజ్‌కు చేరుకుంది. చివరి వారం కావడంతో ప్రేక్షకుల మనసు దోచుకునే విధంగా కంటెస్టెంట్లకు బిగ్ బాస్ గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త టాస్కులు ఇస్తున్నాడు. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఫ్రెండ్‌షిప్‌ను పక్కనపెట్టేసి తొలిసారి విడివిడిగా గేమ్ ఆడుతున్నారు. ఫలితంగా షో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ప్రేమ జంటల్లో ఒకటైన అభిజీత్ - హారిక అర్ధరాత్రి రొమాన్స్ చేసి హాట్ టాపిక్ అవుతున్నారు. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం.!

మారిన టైమింగ్.. సేమ్ రెస్పాన్స్

మారిన టైమింగ్.. సేమ్ రెస్పాన్స్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌ ప్రీమియర్ షోకు భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దానిని కంటిన్యూ చేస్తూ కొన్ని వారాల పాటు ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో, షో టైమింగ్‌ను 9.30 నుంచి 10 గంటలకు మార్చారు. వీకెండ్ ఎపిసోడ్ మాత్రం యథావిదిగా ఉంటుంది. వీక్ ఎపిసోడ్స్ ఆలస్యం అవుతున్నా ప్రేక్షఖకుల స్పందన మాత్రం తగ్గడం లేదని టాక్.

రొమాంటిక్ సీన్లతో సరికొత్తగా షో

రొమాంటిక్ సీన్లతో సరికొత్తగా షో

ఫినాలేకు ముందు బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రెండు వారాల్లో షోలో ఊహించని సంఘటనలు కనిపిస్తున్నాయి. రేస్ టు ఫినాలే ద్వారా ఇప్పటికే ఫినాలేకు చేరుకున్న అఖిల్ సార్థక్.. ఆరియానా గ్లోరీ, దేత్తడి హారికను పడేసే పనిలో బిజీగా ఉన్నాడు. వీళ్లిద్దరితో సమయం కుదిరినప్పుడల్లా రొమాంటిక్‌గా మాట్లాడుతున్నాడు.

వాళ్లిద్దరి మధ్యా పెరిగిన దూరం

వాళ్లిద్దరి మధ్యా పెరిగిన దూరం

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఉన్న ప్రేమ జంటల్లో అభిజీత్, దేత్తడి హారిక జోడీ ఒకటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి నుంచీ ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారీ ఇద్దరు. అయితే, రెండు వారాల క్రితం హోస్ట్ అక్కినేని నాగార్జున గేమ్ విషయంపై వీళ్లిద్దరికీ క్లాస్ తీసుకున్నాడు. అప్పటి నుంచి అభిజీత్, హారిక దూరం దూరంగా ఉంటున్నారు. అదే సమయంలో వేరే వాళ్లకు దగ్గరయ్యారు.

అభిని వదిలేసి అతడితో క్లోజ్‌గా

అభిని వదిలేసి అతడితో క్లోజ్‌గా

నాగార్జున సలహా ఇచ్చిన తర్వాత అభిజీత్‌కు దూరమైన హారిక.. పోయిన వారం ఏకంగా అతడినే నామినేట్ చేసింది. ఆ తర్వాత గ్యాప్‌ను మెయింటైన్ చేసుకుంటూ వస్తోంది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తో చనువుగా ఉంటోంది. ఎంతలా అంటే నాకు ముద్దివ్వు అని అతడు అడిగే అంత. ఇలాంటి సమయంలో అభిజీత్.. హారికకు ప్రేమ సందేశం పంపించడం హైలైట్ అవుతోంది.

హారికకు అభిజీత్ ప్రేమ సందేశం

హారికకు అభిజీత్ ప్రేమ సందేశం

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అందరూ పడుకున్న తర్వాత అభిజీత్.. హారికను ఉద్దేశించి ఓ టిష్యూ పేపర్ మీద సందేశాన్ని పంపించాడు. అందులో ‘ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ మీ (దయచేసి నాతో సమయాన్ని గడుపు)' అని రాశాడు. అది తన పక్కనే ఉన్న బెడ్‌పై పెట్టి వచ్చి పడుకున్నాడు. ఆ వెంటనే దాన్ని చూసిన దేత్తడి హారిక బాగా ఎమోషనల్ అయిపోయింది.

Recommended Video

Niharika Konidela wedding Saree Speciality
బిగ్ బాస్‌లో మిడ్‌నైట్ మసాలా సీన్

బిగ్ బాస్‌లో మిడ్‌నైట్ మసాలా సీన్

లెటర్ చూసిన వెంటనే బెడ్ మీద పడుకున్న అభిజీత్ దగ్గరకు వచ్చింది దేత్తడి హారిక. అంతేకాదు, అతడి మీద పడుకోబోయింది. దీంతో ‘నేను చెప్పేది నీకెప్పుడూ అర్థం కాదు. ఇప్పుడిలాంటి అస్సలు వద్దు' అన్నాడు. అయినప్పటికీ అతడి పక్కన పడుకుని హగ్ చేసుకుందామె. ఈ సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచిన ఈ సీన్‌తో అభిక మరోసారి హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X