బిగ్‌బాస్ ఆఫర్ రాగానే.. ముందు ఇంట్లో నుంచి వెళ్లిపో అన్నారు.. దేత్తడి హరిక
బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు దేత్తడి హారిక గురించి బాగానే ప్రచారం జరిగింది. దేత్తడి అంటూ తెలంగాణ యాస, భాషతో ఇప్పటికే లక్షలాది మందిని ఆకట్టుకొన్న హారిక మంచి మాస్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ ప్రేక్షకులకు కావాల్సినంత మసాలాను అందించేందుకు హారిక సిద్ధమైనట్టు కనిపించారు. మంచి జోష్‌తో బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన దేత్తడి హారిక మాట్లాడుతూ..
Recommended Video

1 మిలియన్ ఫాలోవర్స్‌తో
నా పేరు హారిక. నేను పనిచేసే ఆఫీస్ వాళ్లు దేత్తడి అనే తగిలించారు. దేత్తడి అంటే హుషారైన బాడీ లాంగ్వేజ్‌తో ఇచ్చే ఎక్స్‌ప్రెషన్. నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. అయితే నేను తీసిన వీడియోలకు మంచి పాపులారిటీ వచ్చింది. 1 మిలియన్ ఫాలోవర్స్, 22 కోట్ల వ్యూస్ రావడం ఓ రికార్డు. అయితే ఎలాంటి ప్లాన్ లేకుండా వీడియోలు తీశాం. కంటెంట్ కనెక్ట్ ఉండేలా చూసుకొన్నాం అని హరిక చెప్పారు. బిగ్‌బాస్ వేదికపై మాట్లాడుతూ..

చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్ చూసేదాన్ని
నాకు చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్ చూడటం అలవాటు. మా అమ్మ జ్యోతికి ఇతర భాషల్లో బిగ్ బాస్ చూడటం అలవాటు. మా అన్నకు, నాకు బిగ్‌బాస్ తెగచూపించేది మా అమ్మ. అలా నాకు చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్‌కు వెళ్లాలనే కోరిక కలిగింది. ఇదంతా నిజమేనా.. నిజంగా ఇలా జరుగుతుందా అనేది నన్ను వెంటాడుతుండేది అని హరిక అన్నారు.

బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత
ఇక నాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిందనే సరికి మా అమ్మకు పట్టలేనంత సంతోషం వచ్చింది. వెంటనే ఇంట్లో నుంచి వెళ్లు అంటూ వెంటపడ్డారు. ముందు వెళ్తావా లేదా అంటూ హడావిడి చేశారు. బిగ్‌బాస్ హౌస్‌లో వేరే వాళ్లను చూసిన ఆమెకు.. అలాంటి షోలో తన కూతురిని చూసుకోవాలనుకొన్నది అని దేత్తడి హరిక తెలిపారు.

మీ అమ్మ జ్యోతికి థ్యాంక్స్ అంటూ నాగ్
బిగ్‌బాస్ అంటే ఎంతో ఇష్టపడే హారిక తల్లిపై హెస్ట్ నాగార్జున అభినందించారు. తన కూతురిని ఇలా ఎంకరేజ్ చేయాలనుకొనే తల్లులు చాలా తక్కువ మంది ఉంటారు. నీకు అలాంటి అమ్మ దొరికినందుకు సంతోష పడాల్సిందే. ఎనీ వే బిగ్‌బాస్‌కు వచ్చినందుకు హరిక నీకు థ్యాంక్స్ అంటూ నాగార్జున అన్నారు.

తెలంగాణ యాసతో దడదడలాడిస్తున్న హారిక
ఇక దేత్తడి హారిక అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న యూట్యూబర్. తెలంగాణ యాసతో యాంకర్‌గా దడదడలాడించేస్తారు. హుషారైన అమ్మాయిగా అందరికి సుపరితులే. బిగ్‌బాస్ మీదకు ఫస్ట్ అటెంస్ట్‌లోనే బోల్డ్‌గా హాట్ హాట్‌గా మంచి మాస్ పాటతో అడుగుపెట్టింది. నాగ్‌తో కలిసి కాసేపు వేదికపై హంగామా చేసింది. అదే హంగామా ఇంట్లో కూడా మొదలు కాబోతుందనే సంకేతాలు ఇచ్చారు.

యూట్యూబర్‌గా దేత్తడి అంటూ హారిక
ఇక హారిక చదువుకొంటుండగానే.. యూట్యూబర్‌గా అనుకోకుండా మంచి అవకాశం వచ్చింది. దేత్తడి, చిత్ విచిత్రం అనే సీరిస్‌లు బాగా పాపులర్ అయ్యాయి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యూట్యూబ్‌లో కొద్ది రోజుల్లోనే హిట్ కావడంతో అదే ప్రొఫేషన్‌లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు బిగ్‌బాస్ వరకు ఆమె ప్రయాణం కొనసాగింది.


Click it and Unblock the Notifications











