Dethadi Harika: బాగా తగ్గిన దెత్తడి హారిక..బ్లాక్‌డ్రెస్‌లో బిగ్‌బాస్ పిల్ల కవ్వింపులు, చూపు తిప్పుకోలేరంతే!

ఇండియాలో నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకెళ్తోంది బిగ్‌బాస్. తొలుత హిందీలో అడుగుపెట్టిన ఈ షో తర్వాత మిగిలిన ప్రాంతీయ భాషల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో బిగ్‌బాస్ దిగిన తర్వాత మిగిలిన భాషల టీఆర్పీలను అది క్రాస్ చేసింది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ నడుస్తోంది. నాగార్జున ఆరోసారి హోస్ట్‌గా అదరగొడుతున్నారు. బిగ్‌బాస్ ద్వారా ఎంతో మంది పాపులర్ అయి.. అవకాశాలను అందుకున్నారు. అలాంటి వారిలో దెత్తడి హారిక ఒకరు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే :

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన దెత్తడి హారిక .. చాలా తక్కువ సమయంలోనే గుర్తింపును, ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్‌లో ఛాన్స్ కొట్టేసింది. సొసైటీలో ప్రతినిత్యం జరిగే విషయాలపై వెరైటీగా వీడియోలు తీస్తూ తన దేత్తడి అనే ఛానెల్‌లో వాటిని అప్‌లోడ్ చేసేది అలేఖ్య హారిక. మిగిలిన న్యూస్ ఛానెల్స్‌తో పోలిస్తే ఇవి కాస్త వినూత్నంగా ఉండటంతో పబ్లిక్‌ బాగా కనెక్ట్ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె పాపులర్ అయ్యారు.

Dethadi Harika PhotoShoot with Black Drees Her latest photos here

కాంట్రవర్సీ క్యారెక్టర్లు, పేరున్న యూట్యూబర్లను వెతికి పట్టుకోవడంలో ముందుండే బిగ్‌బాస్ నిర్వాహకులు.. తెలుగు సీజన్ 4లో హారికకు అవకాశం కల్పించారు. చలాకీగా , దూకుడుగా ఉండే హారిక వచ్చి రావడంతోనే తన మార్క్ చూపించింది. టాస్క్‌ల్లో, డిస్కషన్‌లో బాగా పార్టిసిపేట్ చేసేది. అలా ఎంట్రీ ఇచ్చిన కొద్దిరోజులకే హీరో అభిజీత్‌కు బాగా దగ్గరైంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారని, హౌస్ నుంచి బయటికి రాగానే పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అన్నంతగా అభిజీత్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యింది. ఇదే చివరి వరకు కొనసాగించింది.

బిగ్‌బాస్ సీజన్ 4లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌కి పోటీనిచ్చిన దేత్తడి హారిక ఏకంగా ఎనిమిదిసార్లు కెప్టెన్సీ టాస్క్‌కు అర్హత సాధించింది. బిగ్‌బాస్‌లో ఉన్నందుకు గాను రెమ్యునరేషన్ కింద దాదాపు రూ.40 లక్షల వరకు సంపాదించినట్లుగా అప్పట్లో టాక్ నడిచింది. బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక వెబ్‌సిరీస్‌లు, కొన్ని సినిమాల్లో నటించింది. సెలబ్రెటీగా మారిపోయిన క్రమంలో హారికను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా తెలంగాణ పర్యాటక శాఖ ప్రచారకర్తగా నియమించడం పెద్ద వివాదానికి దారి తీసింది.

ప్రభుత్వానికి, ఆ శాఖ మంత్రికి ఎలాంటి సమాచారం లేకుండానే హారికను ఆ పదవిలో నియమించడంపై అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. దీనిపై మనస్తాపం చెందిన హారిక తనకు ఏ పదవులు వద్దని , గతంలో మాదిరిగా తన పనులు తాను చేసుకుంటానని ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హారిక.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను , వీడియోలను వదులుతూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో అందాల ప్రదర్శన చేసింది. నాభి అందాలు చూపిస్తూ, నడుము మడతలతో గిలిగింతలు పెట్టింది. మరి ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X