అభిజీత్‌కు హారిక ప్రేమ కానుక: ఆ కంటెస్టెంట్‌కు కూడా ఇచ్చిపడేసింది.. చివరి స్టేజ్‌లో అవసరమా!

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్.. రికార్డు బ్రేకింగ్ రేటింగ్‌తో గ్రాండ్ ఓపెనింగ్స్‌ను అందుకుంది. ఆ తర్వాత ఒకే రకమైన ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. ఇక, ఇప్పుడు ఫినాలే స్టేజ్‌కు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో బిగ్ బాస్ కూడా కంటెస్టెంట్లకు సరైన పరీక్షలు పెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేత్తడి హారిక ఒక్కసారిగా హైలైట్ అయింది. అభిజీత్‌తో ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇవ్వడంతో పాటు మరో కంటెస్టెంట్‌కు ఇవ్వాల్సింది ఇచ్చి పడేసింది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. అసలేం జరిగింది? వివరాల్లోకి వెళ్తే...

స్టైలిష్ ఎంట్రీ.. తన మార్క్ కనిపించేలా

స్టైలిష్ ఎంట్రీ.. తన మార్క్ కనిపించేలా

సమాజంలో జరుగుతోన్న ట్రెండింగ్ అంశాలపై వీడియోలు చేస్తూ దేత్తడి పాపగా గుర్తింపు తెచ్చుకుంది హారిక అలేఖ్య. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ఆమె.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటోంది. స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.

అభిజీత్‌కు దగ్గర అవడంతో పాపులర్

అభిజీత్‌కు దగ్గర అవడంతో పాపులర్

బిగ్ బాస్ హౌస్‌లో నిజాయితీగా ఉంటూ.. ముక్కు సూటిగా తన అభిప్రాయాలను చెబుతూ హైలైట్ అయింది హారిక. అలాగే, ఎదుటి వారి అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ వచ్చింది. ఈ ప్రవర్తనతోనే ప్రేక్షకుల నుంచి మన్ననలు అందుకుంది. అదే సమయంలో తోటి కంటెస్టెంట్ అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటోంది హారిక. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది.

అతడితోనే ఉంటూ.. అండగా నిలుస్తూ

అతడితోనే ఉంటూ.. అండగా నిలుస్తూ

సీజన్ ఆరంభంలో మోనాల్ గజ్జర్‌తో క్లోజ్‌గా ఉన్న అభిజీత్.. ఆ తర్వాత ఆమెకు దూరం అయ్యాడు. ఒంటరిగా ఫీల్ అవుతోన్న సమయంలో అతడికి దేత్తడి హారిక దగ్గరైంది. క్లిష్ట సమయంలో అతడికి అండగా నిలిచింది. అంతేకాదు, టాస్కుల్లో సైతం అతడికి అనుకూలంగా ఆడుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో అభి టీమ్‌లో తనను వేయలేదని బిగ్ బాస్‌నే విమర్శించిందామె.

 అన్నింటిలోనూ అదరగొట్టినా నో యూజ్

అన్నింటిలోనూ అదరగొట్టినా నో యూజ్

బిగ్ బాస్ చరిత్రలోనే ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికైన కంటెస్టెంట్‌గా రికార్డులకెక్కింది దేత్తడి హారిక. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌కు చివరి కెప్టెన్‌గా ఎంపికైంది కూడా. ఇక, ఈ వారం ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లోనూ ఆమె బాగా కష్ట పడుతోంది. అయినప్పటికీ.. ఒక్కటంటే ఒక్క దానిలోనూ విజయం సాధించలేకపోయింది.

 ఆ కంటెస్టెంట్‌కు కూడా ఇచ్చిపడేసింది

ఆ కంటెస్టెంట్‌కు కూడా ఇచ్చిపడేసింది


ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ టాస్కులు ఇవ్వగా, ఆరియానా రెండు సార్లు, సోహెల్ ఒకసారి గెలిపొందాడు. శుక్రవారం జరిగిన వినోదం టాస్కులో హారిక చివరి వరకూ వెళ్లినా.. గతంలో మోనాల్ తనను కెప్టెన్ చేసిందనే కారణంతో ఆమె కోసం త్యాగం చేసి టాస్క్ ఓడిపోయింది. దీంతో చివరి స్టేజ్‌లో ఇలా చేయడంపై ఆమె ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

Allu Arjun’s Ala Vaikunthapurramuloo in Top Of Netflix's TOP 10 Most Watched Films Of 2020
 అసలు ఇదే.. అభికి హారిక ప్రేమ కానుక

అసలు ఇదే.. అభికి హారిక ప్రేమ కానుక

కొద్ది రోజులుగా అభిజీత్, హారిక మధ్య దూరం కనిపిస్తోంది. దీనికి అసలు కారణం ఏమిటో తెలియదు కానీ, ఆమె భయపడడం వల్లే ఇలా చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య తనతో టైమ్ స్పెండ్ చెయ్ అని అభిజీత్ అడగడంతో దీనికి బలం చేకూరినట్లైంది. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఎపిసోడ్‌లో అతడిని దగ్గరకు తీసుకుని, తన ప్రేమను మరోసారి బయటపెట్టింది హారిక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X