అభిజీత్ - హారిక పెళ్లికి గ్రీన్ సిగ్నల్: వాళ్ల గురించి నోయల్ చెప్పిన సీక్రెట్ వల్లే ఈ నిర్ణయం!

తెలుగు బుల్లితెరపై రోజురోజుకూ విశేషమైన ఆదరణను అందుకుంటూ టాప్‌ ప్లేస్‌లో వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త థీమ్‌తో ముందుకొస్తూ ప్రభావాన్ని మరింతగా పెంచుకుంటోంది. మన భాషలో ఈ షో సూపర్ సక్సెస్ అవడానికి ఎన్నో అంశాలు దోహదపడ్డాయి. అందులో హౌస్‌లో జరిగే లవ్ ట్రాకులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో మాదిరిగానే ప్రస్తుత సీజన్‌లోనూ ప్రేమ కహానీలు కనిపిస్తున్నాయి. అందులో అభిజీత్ - హారిక ట్రాక్ ఒకటి. షో ఆరంభం నుంచి ట్రెండ్ అవుతోన్న ఈ జంట పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆ వివరాలు మీకోసం.!

 బిగ్ బాస్ విజయంలో ట్రాకుల పాత్ర

బిగ్ బాస్ విజయంలో ట్రాకుల పాత్ర

బిగ్ బాస్ షో అన్ని భాషల్లోనూ లవ్ ట్రాకుల కారణంగానే హైలైట్ అవుతోంది. మన తెలుగులో కూడా ఇదే తరహా వ్యవహారాలు హాట్ టాపిక్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. మొదటి సీజన్‌లో దీక్షా పంత్ - ప్రిన్స్, రెండో సీజన్‌లో తేజస్వీ - సామ్రాట్, తనీష్ - దీప్తీ సునయన, మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ - పునర్నవి భూపాలం ట్రాకులు నడపడం వల్ల షోకు చాలా ప్లస్ అయింది.

నాలుగో సీజన్‌లో మూడు జంటలు

నాలుగో సీజన్‌లో మూడు జంటలు

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ మొదటి రోజు నుంచే లవ్ ట్రాకుల కారణంగా ఫేమస్ అయింది. ప్రారంభంలో అభిజీత్ - మోనాల్ గజ్జర్ ఎంతో క్లోజ్‌గా ఉన్నారు. ఆ సమయంలో వీళ్లిద్దరి ట్రాక్ కంటిన్యూ అవుతుందనుకున్నారు. కానీ, ఊహించని విధంగా మోనాల్ - అఖిల్ సార్థక్‌తో, అభి - హారికతో ఫిక్స్ అయ్యారు. అలాగే, అవినాష్ - ఆరియానా జంట కూడా పాపులర్‌గా మారింది.

బిగ్ బాస్ వేరు చేశాడని ఏడవడంతో

బిగ్ బాస్ వేరు చేశాడని ఏడవడంతో

గతంలో జరిగిన ఓ టాస్కులో తనను అభిజీత్‌ను వేరు వేరు టీమ్‌లలో పెట్టడంపై హారిక నిరాశకు లోనైంది. ఆ సమయంలోనే ఇలా ఎందుకు చేశావ్ బిగ్ బాస్ అంటూ కెమెరాల ముందు ప్రశ్నించింది. ఈ సన్నివేశం తర్వాత వీళ్లిద్దరి మధ్య నిజమైన ట్రాక్ నడుస్తుందని ప్రతి ఒక్కరికీ అనిపించింది. ఆ తర్వాత కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

ముద్దులు.. హగ్గులతో మరింత ఫేమ్

ముద్దులు.. హగ్గులతో మరింత ఫేమ్

బిగ్ బాస్ హౌస్‌లో ఏది జరిగినా సంచలనం అవుతుందన్న విషయం తెలిసిందే. అది తెలిసి కూడా అభిజీత్ - హారిక తరచూ హగ్గులు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తున్నారు. అదే సమయంలో తరచూ ఒకే దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. ఒకరిని ఒకరు సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో వీళ్ల ట్రాకుపై ఓ బలమైన అభిప్రాయం ఏర్పడిపోయింది.

అభిజీత్ - హారిక పెళ్లికి గ్రీన్ సిగ్నల్

అభిజీత్ - హారిక పెళ్లికి గ్రీన్ సిగ్నల్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో టైటిల్ ఫేవరేట్లలో ఒకడిగా ఉన్న అభిజీత్.. టాప్ -5లో ఉంటుందనుకుంటున్న హారిక గేమ్ మీద కూడా బాగానే ఫోకస్ పెడుతున్నారు. ఒక్కోసారి కలిసి ఆడినట్లుగా అనిపిస్తుండడంతో వీళ్లను ‘అభిక'గా సంబోధిస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా దీనికి పేరెంట్స్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

ఆ కంటెస్టెంట్ చెప్పడం వల్లే ఈ నిర్ణయం!

ఆ కంటెస్టెంట్ చెప్పడం వల్లే ఈ నిర్ణయం!

తాజాగా హారిక తల్లి, ఆమె సోదరుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. ‘అభిజీత్ - హారిక మధ్య క్యూట్ ఫ్రెండ్‌షిప్ ఉంది. ఈ విషయం నోయల్ కూడా మాకు చెప్పాడు. ఒకవేళ అది లవ్ అయినా మాకు ప్రాబ్లమ్ లేదు. అభీ వాళ్ల ఫ్యామిలీకి కూడా నచ్చితే పెళ్లికి మేము సిద్ధమే' అంటూ చెప్పడంతో అభిక ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X