యుద్ధంలోనే ఉన్నాం..ఫైట్ ఇంకా ఉంది.... అరియానాకు హారిక హెచ్చరిక

బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ ముగియడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్లు మాత్రం తమ విజయానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఆటపాటలతో జోష్‌లో కనిపించిన కంటెస్టెంట్లు విన్నర్ అనే పదం వినిపించగానే అలర్ట్ అవుతున్నారు. 99వ రోజు ఇంటిలో ఏం జరిగిందంటే...

బిగ్‌బాస్ సర్‌ప్రైజ్

బిగ్‌బాస్ సర్‌ప్రైజ్

ప్రతీ రోజు మాదిరిగానే వేకప్ సాంగ్‌తో ఉదయమే నిద్ర లేచిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. గత 99 రోజుల ప్రయాణంలో జరిగిన సంఘటనలను, బిగ్‌బాస్ హెచ్చరికలను పాట రూపంలో మలిచి వారి ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేశారు. ఇంటి సభ్యులు తమ మాటలను, చేష్టలను గుర్తు తెచ్చుకొంటూ అందరూ కలిసి డ్యాన్స్ చేశారు.

ముఖానికి మాస్కులు ధరించి

ముఖానికి మాస్కులు ధరించి


ఆ తర్వాత ముఖానికి మాస్క్ ధరించి ఓ గేమ్‌ను ఇంటి సభ్యుల ముందు ఉంచారు. ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలను తెలిపి.. ఎవరైతే తమ ముఖానికి మాస్క్ తొలగించేలా చేశారనే విషయాన్ని చెప్పాలని బిగ్‌బాస్ గేమ్ రూల్ చెప్పారు. దాంతో అందరూ ఒక్కొక్కరి గురించి చెబుతూ వారి అభిప్రాయాలను వెల్లడించారు. చివర్లో ఒకరి ముఖం మీద నుంచి మాస్క్ తీసి.. వారి గురించి చెప్పడంతో గేమ్ ముగిసింది.

హరిక, అరియానానే టార్గెట్

హరిక, అరియానానే టార్గెట్

ఇక ఇంటిలో సరదాగా ఉన్న సభ్యుల మధ్య బిగ్‌బాస్ చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఇంటిలో తాము ఎందుకు విన్నర్‌ కావాలనుకొంటున్నారో.. ఎవరు అర్హులో చెప్పాలని మరో గేమ్ ఇచ్చాడు. దాంతో తమ గురించి గొప్పగా చెప్పుకొన్న సభ్యులు.. ఇంటిలో టైటిల్‌కు ఎవరు అర్హులు కాదో చెప్ప సమయంలో హారికకు అర్హత లేదు అంటూ అభిజిత్ అన్నాడు. ఆ తర్వాత అరియానాకు అర్హత లేదని అఖిల్, సోహెల్ చెప్పారు. హారికకు అర్హత లేదని అరియానా చెప్పింది.

అరియానా, హారిక మధ్య చర్చ

అరియానా, హారిక మధ్య చర్చ

మొత్తంగా ఇంటి సభ్యుల్లో ముగ్గురు మేల్ కంటెస్టెంట్ వేళ్లు ఫీమేల్‌లో కంటెస్టెంట్ల వైపే చూపించాయి. దాంతో హారిక, అరియానాలో అనుమానాలు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తమతో మంచిగా ఉన్న వ్యక్తులే తమను అర్హత లేని వారని చెప్పడంతో హార్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆరియానా, హారిక మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

ఈ సారి ఉమెన్ టైటిల్ విన్నర్ కావాలి

ఈ సారి ఉమెన్ టైటిల్ విన్నర్ కావాలి

అనర్హులు టాస్క్ సందర్భంగా అమ్మాయిల పేర్లే వచ్చాయని అరియానాతో హారిక పాయింట్ లేవనెత్తింది. ఐదుగురు సభ్యులు ఉండటం వల్ల మగ, ఆడ నిష్పత్తి 3:2గా ఉంది. ఇంకొకరు ఉంటే నిష్పత్తి సమానంగా ఉండేది అంటూ హారిక చెప్పింది. దీంతో ఈ ఫైట్ చాలా టఫ్‌గా ఉందనిపిస్తుందని అరియానా అంటే... ఈ రోజు జరిగిన పరిణామాలతో ఈ సారి ఉమెన్ విజేతగా నిలువాలనే ఆలోచన బలంగా కనిపిస్తున్నది అని హారిక అన్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
యుద్ధంలోనే ఉన్నా..ఫైట్ ఇంకా ఉంది..

యుద్ధంలోనే ఉన్నా..ఫైట్ ఇంకా ఉంది..

ఉదయం నుంచి మంచి మూడ్‌లో ఉన్నాం. టాప్ 5లోకి వచ్చామనే సంతోషం హరించుకుపోయింది. ఇంటి సభ్యులు మళ్లీ గేమ్ మూడ్‌లోకి వచ్చారనిపిస్తున్నది. కాబట్టి ఫైటింగ్ ఇంకా ఉంది. ఇంకా యుద్ధంలోనే ఉన్నాం. ఫైట్ ఇంకా కొనసాగుతుంది అంటూ అరియానా, హారిక చెప్పుకొంటూ కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X