For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డైరెక్షన్ ఫీల్డ్‌లోకి దేత్తడి హారిక ఎంట్రీ: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో కలిసి బెడ్ సీన్‌తో రచ్చ!

  |

  సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ తక్కవ సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిపోయింది దేత్తడి హారిక. సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై ఫోకస్ చేస్తూ వీడియోలు రూపొందించిన ఆమె.. అనతి కాలంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈమె క్రేజ్ రెట్టింపు అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆఫర్లను అందుకుంటోన్న హారిక.. తాజాగా డైరెక్షన్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో కంటెస్టెంట్‌తో కలిసి అదరగొట్టేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  అలా ఎంట్రీ ఇచ్చింది... ఇలా మారింది

  అలా ఎంట్రీ ఇచ్చింది... ఇలా మారింది

  ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. స్టైలిష్ లుక్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపించింది. దీంతో తక్కువ సమయంలోనే మంచి ఆటతీరుతో ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయింది.

  అతడితో ట్రాక్.. ప్రేమాయణం అన్నారు

  అతడితో ట్రాక్.. ప్రేమాయణం అన్నారు

  మొదటి రోజే హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లను జంటలుగా చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఓ గేమ్‌లో భాగంగా అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిర్చాడు. అయినప్పటికీ షో ఆరంభంలో అతడు మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె దూరమవడంతో.. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ అయింది. దీంతో వీళ్లిద్దరి పేర్లతో ‘అభిక' ట్రెండ్ అయింది.

  అదొక్కటే హారికను ఫినాలేకు చేర్చింది

  అదొక్కటే హారికను ఫినాలేకు చేర్చింది

  మిగిలిన వ్యవహారాలు ఎలా ఉన్నా.. దేత్తడి హారిక బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ గేమర్ అనిపించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. ఈ కారణంగానే పలుమార్లు నామినేషన్‌లో ఉన్నా సేఫ్ అవడంతో పాటు గ్రాండ్ ఫినాలేకు చేరింది.

   బిగ్ బాస్ వల్ల అన్ని రకాలుగా లాభమే

  బిగ్ బాస్ వల్ల అన్ని రకాలుగా లాభమే

  ఎన్నో ఆశలు, అంచనాలతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టింది దేత్తడి హారిక. అయితే, ఊహించని విధంగా ఆమె ఐదుగురిలో ముందుగానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, హారిక బిగ్ బాస్ షో ద్వారా మొత్తంగా రూ. 42 లక్షలు తీసుకుందట. అంతేకాదు, వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది కూడా.

  అతడి కోసం డైరెక్టర్‌గా మారిన హారిక

  అతడి కోసం డైరెక్టర్‌గా మారిన హారిక

  ర్యాప్ సాంగ్‌లతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన గుర్తింపును తెచ్చుకున్నాడు టాలెంటెడ్ సింగర్ నోయల్ సీన్. ఈ మధ్య ఎన్నో ఇండిపెండెంట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘మారదే మారదే' అనే ఓ పాటను రెడీ చేశాడు. దీన్ని శుక్రవారం సాయంత్రమే విడుదల చేశాడు. ఈ పాట ద్వారానే దేత్తడి హారిక డైరెక్టర్‌గా మారింది. ఈ విషయాన్ని నోయల్ పోస్ట్ చేశాడు.

  ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో కలిసి రచ్చ

  ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో కలిసి రచ్చ

  నోయల్‌కు క్లోజ్ ఫ్రెండ్ అయిన వితిక షేరు కూడా హారికతో కలిసి డైరెక్షన్ చేసింది. ఓ రూమ్‌లో జరిగిన బెడ్ సీన్‌ను వీళ్లిద్దరూ కంపోజ్ చేస్తున్నట్లు ఓ ఫొటోను షేర్ చేసిన వితిక.. ‘నిన్ను డైరెక్ట్ చేయడం సంతోషం. హారికతో చాలా ఫన్నీగా సాగింది. ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్' అంటూ ఆమె ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టుకోగా.. దాన్ని నోయల్ కూడా పోస్ట్ చేసుకున్నాడు.

  English summary
  Dhethadi Alekhya Harika (Big Boss) Wiki, Age, Boyfriend, Net Worth Alekhya Harika is a famous Youtuber and Actress from Hyderabad, Telangana, India. She is known for her humor videos and Telangana slang. Alekhya came into the limelight for her comedy web series Called “Dhethadi”.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X