దేత్తడి హారిక రెమ్యూనరేషన్ వివరాలు లీక్: అభిజీత్‌తో సమానంగా.. ఆ లెక్కలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
దేత్తడి వీడియోలతో సోషల్ మీడియాలో ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది అలేఖ్య హారిక. సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై తనదైన శైలిలో వీడియోలు రూపొందిస్తూ యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి రోజు నుంచే తన మార్క్ చూపిస్తూ ఫినాలేలో అడుగు పెట్టింది. ఫినాలేలో అందరి కంటే ముందే ఎలిమినేట్ అయిన హారిక బిగ్ బాస్ నుంచి భారీ మొత్తం అందుకున్నట్లు తెలిసింది. తాజాగా ఆమె రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

స్టైలిష్ ఎంట్రీ.. ఫైటర్‌గా పేరు సంపాదించింది
సోషల్ మీడియాలో వచ్చిన క్రేజ్‌తో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. ప్రీమియర్ ఎపిసోడ్‌లో స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. మొదటి నుంచే తన మార్క్ చూపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే తన వాయిస్ వినిపిస్తూ.. ఎదుటి వారికి గౌరవం ఇస్తూ మెప్పించింది. అలాగే, అద్భుతమైన ఆటతీరుతో లేడీ ఫైటర్ అని అనిపించుకుంది.

అభిజీత్‌తో లవ్ ట్రాక్.. మరింత పాపులారిటీ
ఆటతో ఆకట్టుకున్నప్పటికీ.. తోటి కంటెస్టెంట్ అభిజీత్‌తో లవ్ ట్రాక్ నడపడం ద్వారానే విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అతడి కోసమే ఆడుతూ.. అతడితోనే ఉంటూ తెగ హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలోనే అతకి హగ్గులు, ముద్దులు కూడా ఇచ్చింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ ‘అభిక'ను ట్రెండ్ చేశారు.

చివర్లో మారిపోయిన ఆట.... సపోర్ట్ తగ్గింది
ఫినాలే సమయంలో దేత్తడి హారిక ఆట పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు వరకూ అభిజీత్‌తో క్లోజ్‌గా ఉన్న ఆమె.. చివర్లో తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చుకుంది. ఇందులో భాగంగానే అఖిల్ సార్థక్‌తో చనువుగా వ్యవహరించింది. అతడికి హగ్గులిస్తూ.. ముద్దులు పెడుతూ రచ్చ రచ్చ చేసింది. దీంతో కీలక సమయంలో అభిజీత్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతు ఉపసంహరించుకున్నారు.

టాప్-5లోకి ప్రవేశం.. చివరి స్థానంలో నిలిచి
ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. అసాధారణ ఆట తీరుతో మగ కంటెస్టెంట్లకు పోటీని ఇచ్చింది. ఈ కారణంగానే పలుమార్లు నామినేషన్స్‌లో ఉన్నా సేఫ్ అవుతూ వచ్చింది. అంతేకాదు, ప్రేక్షకుల మద్దతుతో టాప్-5లోకి చేరుకుంది. కానీ, చివరి వారంలో ఆకట్టుకోవడంలో విఫలమైన ఆమె.. ఐదుగురిలో ఆఖరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

దేత్తడి హారిక రెమ్యూనరేషన్ వివరాలు లీక్
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేత్తడి హారిక లైవ్ చాట్‌లు, వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రెమ్యూనరేషన్ విషయాలు బయటకు వచ్చాయి. హారిక బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగింది. ఆమె రోజుకు రూ. 40 వేలు చార్జ్ చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 42 లక్షలు తీసుకుందట.

అభిజీత్‌తో సమానంగా.. ఆ లెక్కలు తెలిస్తే
దేత్తడి హారికకు బయట విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల.. అభిజీత్‌తో సమానంగా (అతడికి కూడా రోజుకు రూ. 40 వేలు) చార్జ్ చేసిందని సమాచారం. దీంతో టాప్ -5లో నిలిచిన వారిలో డైలీ రెమ్యూనరేషన్ పరంగా వీళ్లిద్దరికే ఎక్కువ ముట్టినట్లు తెలిసింది. మొత్తంగా చూసుకుంటే.. అభిజీత్‌కు విన్నర్ ప్రైజ్‌మనీ, సోహెల్‌కు రూ. 25 లక్షలు రావడంతో హారిక మూడో స్థానంలో ఉందని టాక్.


Click it and Unblock the Notifications











