అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్ షో. ఈ కారణంగానే ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఈ షో సక్సెస్‌కు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో లవ్ ట్రాకులు కూడా ప్రధాన పాత్రను పోషించాయి. ప్రతి సీజన్‌లో ఏదో ఒక జంట హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. అయితే, ఈ సారి రెండు మూడు జోడీలు హైలైట్ అయ్యాయి. అందులో దేత్తడి హారిక - అభిజీత్ జంట ఒకటి. షో తర్వాత వీళ్లిద్దరి బంధంపై ఊహించని కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా హారిక దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?
ఇందులో మూడు జంటలు.. వీళ్లు ఒకటి

ఇందులో మూడు జంటలు.. వీళ్లు ఒకటి

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్, అభిజీత్ - దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ - ముక్కు అవినాష్ జంటలుగా హల్‌చల్ చేశారు. వీరిలో మొదటి జోడీనే ఎక్కువగా హైలైట్ అయింది. వీళ్ల తర్వాత అభిజీత్ - దేత్తడి హారిక కూడా బాగానే హాట్ టాపిక్ అయ్యారు. దీనికి కారణం ఎప్పుడూ ఇద్దరూ కలిసే కనిపిస్తుండడమే. దీంతో వీళ్లిద్రి మధ్య ట్రాక్ నిజమేనని అనుకున్నారు.

ఒకరి కోసం ఒకరు.... రచ్చ రచ్చ చేశారు

ఒకరి కోసం ఒకరు.... రచ్చ రచ్చ చేశారు

బిగ్ బాస్ హౌస్‌లో అభిజీత్.. దేత్తడి హారిక ఎంతో క్లోజ్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపించారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. హగ్గులు చేసుకోవడం.. అలగడం.. గొడవలు పడడం వంటివి చేస్తుండేవారు. దీంతో బయట వీళ్ల పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. అంతేకాదు, దీనిపై హారిక మదర్ కూడా స్పందించారు.

టైమ్ స్పెండ్ చెయ్ అంటే అభిక అన్నారు

టైమ్ స్పెండ్ చెయ్ అంటే అభిక అన్నారు

షో ఆరంభంలో అభిజీత్‌తో కాకుండా వేరే టీమ్‌లో వేయడంపై బిగ్ బాస్‌తో చిలిపిగా గొడవకు దిగింది దేత్తడి హారిక. షో చివరికి వచ్చే సరికి అతడికి దూరంగా ఉంటూ వేరే వాళ్లకు క్లోజ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తనతో సమయం గడపమని కోరుతూ అభిజీత్.. హారికకు ఏకంగా లెటర్ రాశాడు. దీంతో వీళ్లిద్దరి అభిమానులు 'అభిక' అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు.

బయటకు వచ్చాక అభి షాకింగ్ కామెంట్స్

బయటకు వచ్చాక అభి షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ హౌస్‌లో అద్భుతమైన ఆటతీరుతో నాలుగో సీజన్ విజేతగా నిలిచాడు అభిజీత్. బయటకు వచ్చిన తర్వాత నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే హారిక గురించి ప్రశ్నలు ఎదురవగా.. ఆమె తనకు సిస్టర్ అని షాకిచ్చాడు. అంతేకాదు, హౌస్‌లో ఉన్నప్పుడు కూడా ఆమెను సోదరి అని సంభోదించినట్లుగా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించాడతను.

హారిక కూడా బిగ్ బాస్‌పై నిందలు వేసింది

హారిక కూడా బిగ్ బాస్‌పై నిందలు వేసింది

హారిక కూడా దీనిపై స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'హౌస్‌ లోపలికి వెళ్లేప్పుడు బిగ్ బాస్ కనెక్షన్ కలిపే గేమ్ పెట్టాడు. అప్పుడు నాకు షూ, అభికీ సాక్స్ వచ్చాయి. అలాగే, ఇద్దరికీ నీట్‌నెస్ ఉండాలి. ఇలా మా ఇద్దరికీ ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయి. అందుకే అభీకి నాకు మధ్య కనెక్షన్ అలా కుదిరింది. అదే 15 వారాలు పాటు కొనసాగించాం' అని చెప్పుకొచ్చింది.

అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది

అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది

తాజాగా ఓ చిట్ చాట్ షోలో పాల్గొన్న హారిక.. అభిజీత్‌తో రిలేషన్‌పై మరోసారి వివరణ ఇచ్చింది. 'అందరూ అనుకున్నట్లు మేమిద్దరం లవర్స్ కాదు. హౌస్‌లో నిజంగానే బ్రదర్ అండ్ సిస్టర్‌లా ఉన్నాము. అది మాత్రం షోలో చూపించలేదు. ఈ విషయం మాతో పాటు హౌస్‌మేట్స్‌కు కూడా తెలుసు. షో తర్వాత అభి బిజీ అయ్యాడు. అందుకే కలవలేకపోయా' అంటూ క్లారిటీ ఇచ్చిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X