దేత్తడి హారిక పంట పడింది: ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో సమానంగా.. అరుదైన ఘనత సొంతం!

దేత్తడి హారిక.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. దీనికి కారణం సోషల్ మీడియాలో చేసే వీడియోలే అన్న విషయం అందరికీ తెలిసిందే. దేత్తడి పేరుతో సమాజంలో జరిగే అంశాలపై వినూత్నమైన వీడియోలు తయారు చేస్తూ.. ఎనలేని గుర్తింపును, ఫాలోయింగ్‌ను సంపాదించుకుందామె. అలా.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయింది. ఇక, తాజాగా దేత్తడి హారికకు అరుదైన గౌరవం దక్కింది. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో సమానమైన ఘనతను సొంతం చేసుకుంది. ఆ వివరాలు మీకోసం!

లావణ్య త్రిపాఠి గ్లామరస్ ఫోటోషూట్.. చావు కబురు చల్లగా అంటూ

 ఆ కారణంగా అవకాశం.. ఆటతో పాపులారిటీ

ఆ కారణంగా అవకాశం.. ఆటతో పాపులారిటీ

సోషల్ మీడియాలో దక్కిన క్రేజ్‌తో దేత్తడి హారిక బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ప్రవేశించింది. ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపిస్తూ వచ్చింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే మంచి ఆటతీరు కనబరుస్తూ ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయిందీ బ్యూటీ.

 యంగ్ హీరోతో ట్రాక్.. ప్రేమాయణం అనుకుని

యంగ్ హీరోతో ట్రాక్.. ప్రేమాయణం అనుకుని

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే కొందరిని జంటలుగా చేశారు. అలా కొన్ని క్వాలిటీస్ కలవడం వల్ల యంగ్ హీరో అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిరింది. అయినప్పటికీ షో ఆరంభంలో అతడు మోనాల్‌తో చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆమె దూరమవడంతో.. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ అయింది. అప్పటి నుంచి ట్రాక్ నడుపుతూ 'అభిక'గా ట్రెండ్ అయ్యారు.

బిగ్ బాస్‌లో ఏకైక కంటెస్టెంట్‌గా హారిక రికార్డ్

బిగ్ బాస్‌లో ఏకైక కంటెస్టెంట్‌గా హారిక రికార్డ్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఉన్న వాళ్లందరితో పోల్చుకుంటే దేత్తడి హారిక గేమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ ఆడేది. తద్వారా టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ గేమర్ అనిపించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. తద్వారా రికార్డును క్రియేట్ చేసింది.

 బిగ్ బాస్ వల్ల భారీగా.... వరుస అవకాశాలు

బిగ్ బాస్ వల్ల భారీగా.... వరుస అవకాశాలు

బిగ్ బాస్ ఫైనల్‌లో నిలిచిన ఐదుగురిలో హారిక ముందుగానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, హారిక బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగింది. ఆమె రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు తీసుకుందట. రెమ్యూనరేషన్‌తో పాటు బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది.

తెలంగాణ ప్రభుత్వం వల్ల హారిక హాట్ టాపిక్

తెలంగాణ ప్రభుత్వం వల్ల హారిక హాట్ టాపిక్

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (TSTDC) బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారికను ఎంపిక చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీ‌నివాస్ గుప్తా ఆమెకు నియమక పత్రం కూడా అందజేశారు. ఆ తర్వాత దీనిపై విమర్శలు చెలరేగడంతో హారిక మేటర్ వివాదాస్పదం అయిపోయింది. దీంతో ఆమె స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకుంది.

దేత్తడి హారిక పంట పడింది.. అరుదైన ఘనత

దేత్తడి హారిక పంట పడింది.. అరుదైన ఘనత

బృహస్పతి ఫౌండేషన్ ప్రతి ఏటా రైజింగ్ స్టార్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇక, ఈ ఏడాదికి గానూ పలువురికి దీన్ని అందజేశారు. అందులో దేత్తడి హారిక ఒకరు. తాజాగా జరిగిన ఫంక్షన్‌లో ఆ అవార్డును అందుకుందామె. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమెతో పాటు అఖిల్ సార్థక్ రైజింగ్ స్టార్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X