దేత్తడి హారిక పొట్టి బట్టలపై తల్లి షాకింగ్ కామెంట్స్: బిగ్ బాస్‌లో బికినీ కూడా అంటూ!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో తెలుగమ్మాయి దేత్తడి హారిక ఒకరు. సమాజంలో జరిగే కొన్ని అంశాల ఆధారంగా వీడియోలు రూపొందించి ఫేమస్ అయి తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారణంగానే బిగ్ బాస్ షోలో అవకాశం అందుకుంది. అయితే, అందులో ఆమె వేసుకునే బట్టలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో హారిక మదర్ తన కూతురి డ్రెస్సింగ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ.. మరింత గుర్తింపు

స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ.. మరింత గుర్తింపు

సోషల్ మీడియాలో దక్కించుకున్న క్రేజ్‌తో ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. రావడం రావడంతోనే స్టైలిష్ లుక్‌తో వచ్చిన ఆమె.. ఎంతో మంది దృష్టిలో పడింది. ఆ సమయంలోనే హారికకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో ఆమె వ్యవహార శైలికి కూడా అంతే స్థాయిలో ఫిదా అయిపోయారు.

దేత్తడి హారిక.. మాస్ ఊరమాస్ ఇక్కడ

దేత్తడి హారిక.. మాస్ ఊరమాస్ ఇక్కడ

హారిక ఎంత స్టైలిష్‌గా కనిపిస్తుందో.. సమయం వచ్చినప్పుడు అంతే మాస్‌గా ఉంటుంది. ఈ విషయం చాలా సందర్భాల్లో బయట పడింది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు జరిగే సమయంలో ఆమెలోని మరో కోణం బయటకు వస్తుంది. దీంతో మాస్ ఆడియెన్స్ కూడా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఈ కారణంగానే హారిక ఇప్పటి వరకు షోలో కొనసాగుతోంది.

 అభిజీత్‌తో లవ్ ట్రాకుతో యమ ఫేమస్

అభిజీత్‌తో లవ్ ట్రాకుతో యమ ఫేమస్

మిస్టర్ కూల్ అండ్ కామ్ పర్సన్ అభిజీత్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో హారిక హైలైట్ అవుతోంది. నాలుగో సీజన్ ఆరంభంలో అతడు మోనాల్ గజ్జర్‌తో క్లోజ్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ఆమె దూరమవడంతో హారికతో చనువుగా ఉండడం ప్రారంభించాడు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో వాళ్ల పేరెంట్స్ కూడా స్పందించాల్సి వచ్చింది.

ఆ విషయంలో మాత్రం విమర్శల వర్షం

ఆ విషయంలో మాత్రం విమర్శల వర్షం

ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీదారుగా నిలిచి ఇంటి కెప్టెన్ అయింది హారిక. అదే సమయంలో టాస్కుల్లోనూ వందకు వంద శాతం ప్రయత్నాలు చేస్తోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆమె వేసుకునే బట్టల విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ పొట్టి బట్టలే వేసుకుంటుందని, క్లీవేజ్ షో బాగా చేస్తుందని ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.

పొట్టి బట్టలపై హారిక మదర్ కామెంట్స్

పొట్టి బట్టలపై హారిక మదర్ కామెంట్స్

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో హారిక తల్లి తన కూతురి పొట్టి బట్టల గురించి స్పందించారు. ‘ఒక అమ్మాయి డ్రెస్సింగ్‌పై మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ఎవరికీ లేదు. ఆ మాటకు వస్తే మేము కూడా ఏమీ చెప్పము. అసలు ఆమెను నచ్చిన డ్రెస్ వేసుకోవద్దని అనడానికి మీరు ఎవరు? అక్కడ ఆమె కంఫర్ట్‌ను బట్టే బట్టలు వేసుకుంటుంది' అని కీలక వ్యాఖ్యలు చేశారామె.

Recommended Video

Actor Ananda Chakrapani Interview Part 3
 బిగ్ బాస్‌ షోలో బికినీ వేసుకోమని అంటూ

బిగ్ బాస్‌ షోలో బికినీ వేసుకోమని అంటూ

అంతేకాదు, దీనిని కొనసాగిస్తూ ‘హారికను విమర్శించే వాళ్లందరికీ ఒక్కటే చెబుతున్నా.. ఆమె వేసుకునేది పొట్టి బట్టలే కావచ్చు. మీరు కూడా మీ అమ్మాయిలా ఆలోచించండి. వాస్తవానికి నేను కూడా బిగ్ బాస్‌లో బికినీ వేసుకుని తిరగమడం లేదు' అని చెప్పుకొచ్చారు. దీనికి ఆమె సోదరుడు కార్తీక్ కూడా మద్దతు తెలిపాడు. ‘మా అమ్మే హారిక బట్టలను కొంటుంది' అని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X