చిన్న వయసులో తొందరపడింది.. దాన్ని తప్పుగా చూడకూడదు: హారిక తల్లి షాకింగ్ రియాక్షన్

గత వాటితో పోలిస్తే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారినే ఎక్కువగా తీసుకున్నారు. అందులో దేత్తడి హారిక ఒకరు. వినూత్నమైన వీడియోలతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఆమె.. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని గుర్తింపును అందుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టింది. ఆటకు ఆట.. వినోదానికి వినోదం పంచుతూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో హారిక చిన్న వయసులో చేసిన ఓ పొరపాటు గురించి తాజాగా ఆమె తల్లి షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

స్టైలిష్‌గా ఎంట్రీ... అతడితో లవ్ ట్రాక్

స్టైలిష్‌గా ఎంట్రీ... అతడితో లవ్ ట్రాక్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. షో ఆరంభంలో సోలోగా గేమ్ ఆడిన ఆమె.. ప్రతిసారీ తన మార్క్ కనిపించేలా ప్రయత్నించింది. అంతేకాదు, ఓ టాస్క్ కోసం ఏకంగా తన జుట్టునే కత్తిరించుకుంది. ఈ ఘటన తర్వాత ఆమె బాగా పాపులర్ అయిపోయింది. ఇక, అభిజీత్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారంతో మరింత గుర్తింపును దక్కించుకుంది.

బిగ్ బాస్‌ను నిందించడంతో ఫేమస్

బిగ్ బాస్‌ను నిందించడంతో ఫేమస్

షో ఆరంభంలో మోనాల్ గజ్జర్‌తో సన్నిహితంగా ఉన్న అభిజీత్.. ఆ తర్వాత ఆమెకు గుడ్‌బై చెప్పేశాడు. ఈ క్రమంలోనే దేత్తడి హారికతో క్లోజ్ అయ్యాడు. అంతేకాదు, వీళ్లిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నారని అంతా అనుకునేలా ప్రవర్తించేవారు. ఒకానొక సందర్భంలో ఓ టాస్కులో అభి టీమ్‌ను కాదని, తనను వేరే జట్టులో ఉంచాడని బిగ్ బాస్‌నే నిందించిందామె.

తల్లిని పర్మీషన్ అడగడంతో హైలైట్

తల్లిని పర్మీషన్ అడగడంతో హైలైట్

కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో హారిక తల్లి జ్యోతి వచ్చి అభిజీత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తన కూతురిని ఎంతో కేరింగ్‌గా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. సరిగ్గా అప్పుడే అభిజీత్.. ‘ఆంటీ.. బిగ్ బాస్ తర్వాత హారికను ఓ చోటుకి తీసుకెళ్తా. దానికి మీ పర్మీషన్ కావాలి' అని అడగడం హైలైట్ అయింది.

అభిజీత్ - హారిక పెళ్లి.. హాట్ టాపిక్

అభిజీత్ - హారిక పెళ్లి.. హాట్ టాపిక్

బిగ్ బాస్ హౌస్‌లో వాళ్లిద్దరూ వ్యవహరిస్తున్న తీరుతో బయట అభిజీత్ - దేత్తడి హారిక పెళ్లి జరగబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, వీళ్లిద్దరి పేర్లను కలిపి ‘అభిక' అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు ఇద్దరి ఫ్యాన్స్. ఆ తర్వాత హారిక తల్లి ‘అభి తల్లిదండ్రులకు అభ్యంతరం లేకపోతే హారికను అతడికిచ్చి పెళ్లి చేస్తాను' అని చెప్పడంతో హాట్ టాపిక్ అయ్యారిద్దరూ.

హారిక గురించి తల్లి షాకింగ్ కామెంట్స్

హారిక గురించి తల్లి షాకింగ్ కామెంట్స్

దేత్తడి హారిక బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె తల్లి జ్యోతి తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు. ఈ సమయంలోనే షోలో తన కూతురు వ్యవహరిస్తున్న తీరుపై ఊహించని విధంగా స్పందిస్తున్నారామె. గతంలో హారిక డ్రెస్సింగ్‌పై వస్తున్న ట్రోల్స్‌ను ఖండించిన ఆమె.. తాజాగా తన కూతురి బ్రేకప్‌ గురించి మాట్లాడుతూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చారామె.

Recommended Video

Rowdy Baby Hits 1 Billion Views, Dhanush, Sai Pallavi Tweets
చిన్న వయసులో తొందరపడిందని

చిన్న వయసులో తొందరపడిందని

తాను ఒకరిని ప్రేమించానని, బ్రేకప్ కూడా అయిందని, ఈ విషయం తన తల్లికి చెప్పలేదని హారిక ఇటీవల ఓ సీక్రెట్ లీక్ చేసింది. దీనిపై స్పందించిన ఆమె తల్లి.. ‘బ్రేకప్ అయిపోయిందని కాబట్టి దాని గురించి ఆమె దగ్గర మళ్లీ ప్రస్తావించను. చిన్న వయసులో జరిగింది కాబట్టి అది పెద్ద తప్పుగా అనిపించడం లేదు. వయసు ప్రభావం వల్లే జరిగుంటుంది' అని చెప్పుకొచ్చారామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X