తమిళ బిగ్ బాస్‌లోకి దేత్తడి హారిక: ఏకంగా కమల్ హాసన్‌‌తోనే అలా.. అరుదైన ఘనత సొంతం!

సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది తమ నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్ల ఆదరణతో ఊహించని రీతిలో పాపులర్ అవడంతో పాటు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇలా తన విభిన్నమైన వీడియోల ద్వారా ఎంతో మంది అభిమానాన్ని అందుకొంది అలేఖ్య హారిక. దేత్తడి అనే ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. బిగ్ బాస్ ఛాన్స్ పట్టేసింది. అక్కడా విజయవంతమైనా టైటిల్ వేటలో విఫలమైంది. ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్‌లో ప్రత్యక్షం అయింది హారిక. ఏకంగా కమల్ హాసన్ జర్నీలో భాగమైంది. ఆ వివరాలు మీకోసం!

అందరి అంచనాలనూ తలకిందులు చేసింది

అందరి అంచనాలనూ తలకిందులు చేసింది

సోషల్ మీడియాలో సెన్సేష్ అయినప్పటికీ ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. స్టైలిష్ లుక్‌తో హౌస్‌లోకి వచ్చిన ఈ అమ్మడు.. ఆరంభం నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపించింది. దీంతో తక్కువ సమయంలోనే ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగింది.

అతడితో లవ్ ట్రాక్‌.. సోషల్ మీడియాలో రచ్చ

అతడితో లవ్ ట్రాక్‌.. సోషల్ మీడియాలో రచ్చ

హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లకు కనెక్షన్ కుదిర్చాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఓ గేమ్‌లో భాగంగా అభిజీత్‌తో దేత్తడి హారికను జంటగా చేశాడు. అయినప్పటికీ షో ఆరంభంలో అతడు మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె దూరమవడంతో.. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ అయింది. దీంతో వీళ్లిద్దరి పేర్లతో 'అభిక' అనే ట్యాగ్ తెగ ట్రెండ్ అయింది.

అందులో సూపర్ గేమ్.. చివరికి సాధించింది

అందులో సూపర్ గేమ్.. చివరికి సాధించింది

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో దేత్తడి హారిక బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ గేమర్ అనిపించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. ఈ కారణంగానే గ్రాండ్ ఫినాలేకు చేరింది. కానీ, ముందుగానే ఎలిమినేట్ అయి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

హారిక రెమ్యూనరేషన్.. భారీగానే తీసుకుంది

హారిక రెమ్యూనరేషన్.. భారీగానే తీసుకుంది

సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన దేత్తడి హారిక.. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఆకట్టుకుంది. అందుకే షో ముగిసే వరకూ అందులో కొనసాగుతూ వచ్చింది. ఈ కారణంగానే భారీ స్థాయిలో రెమ్యూనరేష్ అందుకుని సత్తా చాటింది. దేత్తడి హారిక బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగింది. ఆమె రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు తీసుకుందట.

వెబ్ సిరీస్‌లు.. సినిమా ఆఫర్లు.. హారిక హవా

వెబ్ సిరీస్‌లు.. సినిమా ఆఫర్లు.. హారిక హవా

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేత్తడి హారిక ఫుల్ బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో గడుపుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ తన వీడియోలపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఓ వీడియోను సైతం వదిలింది. ఇలాంటి సమయంలో హారికకు ఓ బడా సంస్థ నుంచి వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాన్ని పొందినట్లు ప్రచారం జరుగుతోంది.

తమిళ బిగ్ బాస్‌లో హారిక.. కమల్ జర్నీలో

తమిళ బిగ్ బాస్‌లో హారిక.. కమల్ జర్నీలో


గత ఆదివారం తమిళ బిగ్ బాస్ నాలుగో సీజన్ ముగిసింది. ఇందులో ఆరి అర్జున్ విజయం సాధించాడు. ఇక, ఈ ఎపిసోడ్‌లో హోస్ట్ కమల్ హాసన్ జర్నీని వీడియో రూపంలో చూపించారు. అందులో ఆయన వీడియో కాల్ ద్వారా తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లను కలిసిన, హారికను సేవ్ చేసిన సన్నివేశాలు కూడా చూపించారు. దీంతో దేత్తడి పాప అరుదైన ఘనతను అందుకున్నట్లైంది.

జీవితానికి ఇంకేం కావాలి.. తమిళంలో కూడా

జీవితానికి ఇంకేం కావాలి.. తమిళంలో కూడా

కమల్ హాసన్ జర్నీ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన హారిక.. 'తమిళ బిగ్ బాస్‌లోని కమల్ హాసన్ సార్ జర్నీలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఆ వారం నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ రాసుకొచ్చింది. అలాగే, తమిళంలోనూ 'మీ అందరినీ ప్రేమిస్తున్నాను' అనే ఓ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X