దేత్తడి హారిక టాలీవుడ్ ఎంట్రీపై ఊహించని న్యూస్: భారీ సినిమాలో చేస్తున్నానని రివీల్ చేసేసింది

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది తమ టాలెంట్లను వెలుగులోకి తీసుకొచ్చి.. భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలా 'దేత్తడి' అనే పేరుతో వినూత్నమైన వీడియోలు రూపొందించి విపరీతమైన ఆదరణను అందుకుంటోంది హారిక అలేఖ్య. ఎంతో కాలంగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న ఆ భామ.. ఇటీవల ప్రసారమైన బిగ్ బాస్ వల్ల మరింత హైలైట్ అయింది. ఫలితంగా నటిగా ఎన్నో ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తన టాలీవుడ్ ఎంట్రీపై తాజాగా ఊహించని న్యూస్‌ను బయట పెట్టింది. ఆ వివరాలు మీకోసం!

అంచనాలు లేకుండానే వచ్చి అదరగొట్టింది

అంచనాలు లేకుండానే వచ్చి అదరగొట్టింది

ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. స్టైలిష్ లుక్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపించింది. దీంతో తక్కువ సమయంలోనే మంచి ఆటతీరుతో ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయింది.

లవ్ ట్రాకుతో ఫుల్ ఫేమస్.. అభికగా ట్రెండ్

లవ్ ట్రాకుతో ఫుల్ ఫేమస్.. అభికగా ట్రెండ్

మొదటి రోజే హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లను జంటలుగా చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఓ గేమ్‌లో భాగంగా అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిర్చాడు. అయినప్పటికీ షో ఆరంభంలో అతడు మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె దూరమవడంతో.. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ అయింది. దీంతో వీళ్లిద్దరి పేర్లతో 'అభిక' ట్రెండ్ అయింది.

ఎనిమిది సార్లు ఎంపిక... ఫైటర్‌గా గుర్తింపు

ఎనిమిది సార్లు ఎంపిక... ఫైటర్‌గా గుర్తింపు

మిగిలిన వ్యవహారాలు ఎలా ఉన్నా.. దేత్తడి హారిక బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ గేమర్ అనిపించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. ఈ కారణంగానే పలుమార్లు నామినేషన్‌లో ఉన్నా సేఫ్ అవడంతో పాటు గ్రాండ్ ఫినాలేకు చేరింది.

బిగ్ బాస్ వల్ల ఎంత సంపాదించిందో తెలుసా

బిగ్ బాస్ వల్ల ఎంత సంపాదించిందో తెలుసా

ఎన్నో ఆశలు, అంచనాలతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టింది దేత్తడి హారిక. అయితే, ఊహించని విధంగా ఆమె ఐదుగురిలో ముందుగానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, హారిక బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగింది. ఆమె రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు తీసుకుందట.

వరుస ఆఫర్లు అందుకుంటోన్న దేత్తడి పాప

వరుస ఆఫర్లు అందుకుంటోన్న దేత్తడి పాప

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేత్తడి హారిక ఫుల్ బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో గడుపుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ తన వీడియోలపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఓ వీడియోను సైతం వదిలింది. ఇలాంటి సమయంలో హారికకు ఓ బడా సంస్థ నుంచి వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాన్ని పొందినట్లు ప్రచారం జరుగుతోంది.

భారీ సినిమాలో చేస్తున్నానని రివీల్ చేసింది

భారీ సినిమాలో చేస్తున్నానని రివీల్ చేసింది

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను వదిలింది హారిక. ఈ సందర్భంగా ఓ నెటిజన్ 'మీ శ్రీకారం మూవీ ఎంత వరకు వచ్చింది' అని ప్రశ్నించింది. దీనికి 'షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే నా పార్ట్ కొంత భాగం చిత్రీకరణ జరిగింది. మిగిలిన దాన్ని త్వరోలనే పూర్తి చేస్తా' అని తెలిపింది. ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. కిశోర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X