అభిజీత్‌తో లవ్ ట్రాక్‌పై హారిక షాకింగ్ కామెంట్స్: తప్పంతా మూడో వ్యక్తిదే అంటూ ఇచ్చి పడేసింది

అన్ని భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ రియాలిటీ షోలో ఏం జరిగినా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. మరీ ముఖ్యంగా హౌస్‌లో జరిగే లవ్ ట్రాకులు బాగా పాపులర్ అవుతుంటాయి. గతంలో చాలా జంటలు ఇలానే తరచూ వార్తల్లోకి ఎక్కాయి. ఈ సీజన్‌లో కూడా పలు జోడీలు హైలైట్ అయ్యాయి. అందులో దేత్తడి హారిక - అభిజీత్ జంట ఒకటి. ఇటీవలే ఆమె నా చెల్లి అని షాకిచ్చాడు బిగ్ బాస్ విన్నర్. ఈ నేపథ్యంలో హారిక మరో వ్యక్తిని నిందిస్తూ కామెంట్లు చేసింది. ఆ వివరాలు మీకోసం!

మోనాల్ దూరమైన వెంటనే దగ్గరైంది

మోనాల్ దూరమైన వెంటనే దగ్గరైంది


నాలుగో సీజన్ ఆరంభంలో హీరోయిన్ మోనాల్ గజ్జర్‌తో క్లోజ్ అయ్యాడు యంగ్ హీరో అభిజీత్. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆమె అతడికి దూరమై.. మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌కు దగ్గరైంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌కు దేత్తడి హారిక క్లోజ్ అయింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ స్నేహంగా ఉంటూ వచ్చారు.

లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకునేలా

లవ్ ట్రాక్ నడుస్తుందని అనుకునేలా

దేత్తడి హారిక - అభిజీత్ జంటపై బాగా ఫోకస్ చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపించారు. అందుకు అనుగుణంగానే వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. హగ్గులు చేసుకోవడం.. అలగడం.. గొడవలు పడడం వంటివి చేస్తుండేవారు. దీంతో వీళ్లిద్దరి పేర్లను కలిపి ‘అభిక' అని ట్రెండ్ చేశారు అభిమానులు.

అభిజీత్ లెటర్‌తో ప్రచారం బలమైంది

అభిజీత్ లెటర్‌తో ప్రచారం బలమైంది

షో ఆరంభంలో అభిజీత్‌తో కాకుండా వేరే టీమ్‌లో వేయడంపై బిగ్ బాస్‌తో చిలిపిగా గొడవకు దిగింది దేత్తడి హారిక. షో చివరికి వచ్చే సరికి అతడికి దూరంగా ఉంటూ వేరే వాళ్లకు క్లోజ్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో తనతో సమయం గడపమని కోరుతూ అభిజీత్.. హారికకు ఏకంగా లెటర్ రాశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందన్న వార్తలకు బలం చేకూరినట్లైంది.

సిస్టర్ అంటూ కామెంట్.. ఆమె కూడా

సిస్టర్ అంటూ కామెంట్.. ఆమె కూడా

బిగ్ బాస్ హౌస్‌లో అద్భుతమైన ఆటతీరుతో నాలుగో సీజన్ విజేతగా నిలిచాడు అభిజీత్. బయటకు వచ్చిన తర్వాత నుంచి వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే హారిక గురించి ప్రశ్నలు ఎదురవగా.. ఆమె తనకు సిస్టర్ అని షాకిచ్చాడు. ఆ తర్వాత ఇదే విషయంపై ఆమె కూడా స్పందిస్తూ.. తాము అలాంటి రిలేషన్‌తోనే ఉన్నామని క్లారిటీ ఇచ్చింది.

లవ్ ట్రాక్‌పై హారిక షాకింగ్ కామెంట్స్

లవ్ ట్రాక్‌పై హారిక షాకింగ్ కామెంట్స్

ఇటీవల ‘హౌస్‌ లోపలికి వెళ్లేప్పుడు బిగ్ బాస్ కనెక్షన్ కలిపే గేమ్ పెట్టాడు. అప్పుడు నాకు షూ, అభికీ సాక్స్ వచ్చాయి. అలాగే, ఇద్దరికీ నీట్‌నెస్ ఉండాలి. ఇలా మా ఇద్దరికీ ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయి. అందుకే అభీకి నాకు మధ్య కనెక్షన్ అలా కుదిరింది. అదే 15 వారాలు పాటు కొనసాగించాం' అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన హారిక.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది.

మూడో వ్యక్తిదే అంటూ ఇచ్చి పడేసింది

మూడో వ్యక్తిదే అంటూ ఇచ్చి పడేసింది


తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అభితో ఉన్న బంధం గురించి మాట్లాడుతూ.. ‘మేమిద్దరం అన్నా చెల్లెలి రిలేషన్‌తోనే ఉన్నాం. అందుకే అతడి దగ్గర చనువుగా ఉండేదాన్ని. కానీ, మమ్మల్ని లవర్స్‌ను చేసేశారు. ఈ మొత్తంలో క్రెడిట్ బిగ్ బాస్ ఎడిటర్‌కే ఇవ్వాలి. అసలైనవి చూపించని ఆయన వల్లే మాకు లవర్స్ అనే ట్యాగ్ వచ్చింది' అంటూ చెప్పుకొచ్చింది దేత్తడి హారిక.

Recommended Video

AR Rahman Mother Kareema Begum Passes Away | ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి మరణం..!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X