దేత్తడి హారికకు భారీ ఆఫర్: బిగ్ బాస్ విన్నర్ కంటే ముందుగానే.. త్వరలోనే అధికారిక ప్రకటన

అలేఖ్య హారిక.. ఈ పేరు పెద్దగా తెలియక పోవచ్చు.. కానీ దేత్తడి హారిక అంటే మాత్రం చాలా మంది ఇట్టే గుర్తు పట్టేస్తుంటారు. అంతలా ఆమె కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. దేత్తడి పేరిట సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై వీడియోలు రూపొందించిన ఆమె.. విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షో వల్ల మరింత క్రేజ్ అందుకున్న హారిక.. తాజాగా ఓ భారీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

స్టైలిష్ లుక్‌తో వచ్చింది.. మార్క్ చూపింది

స్టైలిష్ లుక్‌తో వచ్చింది.. మార్క్ చూపింది

సోషల్ మీడియాలో దక్కిన క్రేజ్‌తో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దేత్తడి హారిక. స్టైలిష్ లుక్‌తో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి రోజు నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించింది. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూనే.. తన వాయిస్ వినిపించింది. దీంతో తక్కువ సమయంలోనే ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగిపోయింది.

లవ్ ట్రాకుతో ఫేమస్.. బాగా కలిసొచ్చింది

లవ్ ట్రాకుతో ఫేమస్.. బాగా కలిసొచ్చింది

మొదటి రోజే హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లను జంటలుగా చేశాడు బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఓ గేమ్‌లో భాగంగా అభిజీత్‌తో దేత్తడి హారికకు కనెక్షన్ కుదిర్చాడు. అయినప్పటికీ షో ఆరంభంలో అతడు మోనాల్ గజ్జర్‌తో చనువుగా ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె దూరమవడంతో.. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ అవడంతో ఓట్ల పరంగా లాభం చేకూర్చుకుంది.

Recommended Video

Bigg Boss Telugu 4 winner: Actor Abhijeet Duddala wins the trophy
ఏకంగా 8 సార్లు ఎంట్రీ ఇచ్చి ఫైటర్ అనేలా

ఏకంగా 8 సార్లు ఎంట్రీ ఇచ్చి ఫైటర్ అనేలా

మిగిలిన వ్యవహారాలు ఎలా ఉన్నా.. దేత్తడి హారిక బిగ్ బాస్ ఇచ్చే టాస్కుల పరంగా సత్తా చాటుతుండేది. ప్రతి దానిలోనూ వందకు వంద శాతం ఇస్తూ గేమర్ అనిపించుకుంది. అంతేకాదు, ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కుకు ఎంపికవడం ద్వారా ఫైటర్ అన్న పేరునూ దక్కించుకుంది. ఈ కారణంగానే పలుమార్లు నామినేషన్‌లో ఉన్నా సేఫ్ అవడంతో పాటు గ్రాండ్ ఫినాలేకు చేరింది.

చివరి స్థానంలో.. రెమ్యూనషన్ భారీగానే

చివరి స్థానంలో.. రెమ్యూనషన్ భారీగానే

ఎన్నో ఆశలు, అంచనాలతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టింది దేత్తడి హారిక. అయితే, ఊహించని విధంగా ఆమె ఐదుగురిలో ముందుగానే ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఐదో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, హారిక బిగ్ బాస్ హౌస్‌లో 105 రోజుల పాటు కొనసాగింది. ఆమె రోజుకు రూ. 40 వేలు చొప్పున.. మొత్తంగా రూ. 42 లక్షలు తీసుకుందట.

భారీ ఆఫర్ పట్టేసింది.. త్వరలోనే ప్రకటన

భారీ ఆఫర్ పట్టేసింది.. త్వరలోనే ప్రకటన

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేత్తడి హారిక ఫుల్ బిజీ అయిపోయింది. వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో గడుపుతోంది. ఈ క్రమంలోనే మళ్లీ తన వీడియోలపైనా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఓ వీడియోను సైతం వదిలింది. ఇలాంటి సమయంలో హారికకు ఓ బడా సంస్థ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.

బిగ్ బాస్ విన్నర్ కంటే ముందుగానే ఇలా

బిగ్ బాస్ విన్నర్ కంటే ముందుగానే ఇలా

తాజా సమాచారం ప్రకారం.. దేత్తడి హారిక ఓ ఓటీటీ సంస్థలో రెండు వెబ్ సిరీస్‌లలో నటించేందుకు గానూ సంతకం చేసేసిందట. ఇందుకోసం అమ్మడు భారీగానే చార్జ్ చేయబోతుందని తెలుస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ విన్నర్ అభిజీత్ ఇప్పటి వరకూ సినిమాపై ప్రకటన చేయకున్నా.. అతడి ఫ్రెండ్ హారిక మాత్రం దూసుకుపోతోందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X