బిగ్ బాస్‌ హౌస్‌కు కొత్త కెప్టెన్ ఎంపిక: పడిన కష్టానికి సరైన ఫలితం వచ్చిందిగా.!

తెలుగులో సూపర్ సక్సెస్ అయిన షోలలో బిగ్ బాస్ ఒకటి. వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన దీనికి ఇక్కడి ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఈ షో విజయవంతం అయింది. అదే సమయంలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ కారణంగానే బిగ్ బాస్ షోలో ఏమి జరిగినా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో ఆసక్తికర పరిణామాలు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్‌కు ఎంపికైన కొత్త కెప్టెన్ గురించి వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.!

బిగ్ బాస్ షోలో ఇది చాలా ముఖ్యం

బిగ్ బాస్ షోలో ఇది చాలా ముఖ్యం

బిగ్ బాస్ షో అనేది కంటెస్టెంట్ల వ్యక్తిత్వానికి అద్దం పడుతుంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో పాల్గొనే వాళ్లందరూ గెలవడం కోసమే ఆడుతుంటారు. మరీ ముఖ్యంగా ప్రతి టాస్కులోనూ ప్రాణం పెట్టి మరీ పోరాడుతుంటారు. ఈ టాస్కులన్నింటిలోకెల్లా కెప్టెన్సీ కోసం జరిగే పోటీ చాలా ముఖ్యమైనది. దీనికి కారణం కెప్టెన్‌ అయితే ఓ వారం ఇమ్యూనిటీ లభించడమే.

బెస్ట్ పెర్ఫార్మర్లు.. కెప్టెన్సీకి అర్హులు

బెస్ట్ పెర్ఫార్మర్లు.. కెప్టెన్సీకి అర్హులు

కెప్టెన్సీకి పోటీ పడాలంటే అంతకు ముందు జరిగే లగ్జరీ బడ్జెట్ టాస్కులో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచాలి. అలా ఆ టాస్కులో బెస్ట్ పెర్ఫార్మర్లను ఎంచుకునే బాధ్యత మాత్రం హౌస్‌మేట్లదే. వాళ్లు ఎంపిక చేసిన వారే కెప్టెన్సీకి అర్హులు. ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో చెత్త ప్రదర్శన చేసిన వాళ్లనూ ఎంచుకుంటారు. అలాగే, బిగ్ బాస్ డైరెక్ట్‌గా కెప్టెన్‌ను నియమిస్తాడు.

వారానికో కెప్టెన్.. మరో అసిస్టెంట్

వారానికో కెప్టెన్.. మరో అసిస్టెంట్

వాస్తవానికి బిగ్ బాస్ హౌస్‌లో వారానికో కెప్టెన్ ఎంపిక అవుతాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలోనూ అలాగే జరిగింది. ఇంటికి సంబంధించిన పనులు, రేషన్ అంతా అతడి చేతుల్లోనే ఉండేది. అయితే, ఈ సీజన్‌లో మాత్రం రేషన్ మేనేజర్ అనే కొత్త పోస్టును తీసుకొచ్చారు. దీనికి అర్హులను ఎంచుకునే బాధ్యత మాత్రం హౌస్‌కు నియమితుడైన కొత్త కెప్టెన్‌దే.

ఈ వారం ముగ్గురు పోటీదారులు

ఈ వారం ముగ్గురు పోటీదారులు

ఈ వారానికి సంబంధించి.. బిగ్ బాస్ హౌస్‌లో కమాండో టాస్క్ జరిగింది. ఇప్పటి కెప్టెన్ అఖిల్ సార్థక్ సారథ్యంలో హౌస్‌మేట్స్ అందరూ కమాండోలలా మారిపోయి టాస్కులు చేశారు. మొత్తం నాలుగు టాస్కులు జరగగా, అందులో ముగ్గురు (అఖిల్ సార్థక్, అభిజీత్, దేత్తడి హారిక) మాత్రమే విజయవంతంగా పూర్తి చేశారు. తద్వారా కెప్టెన్సీ టాస్కుకు పోటీదారులుగా నిలిచారు.

బిగ్ బాస్‌ షోకు కొత్త కెప్టెన్ ఎంపిక

బిగ్ బాస్‌ షోకు కొత్త కెప్టెన్ ఎంపిక

వాస్తవానికి ఈ వారం కెప్టెన్సీ టాస్కు రెండు రోజుల క్రితమే జరగాల్సి ఉంది. కానీ, బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇవ్వడం కారణంగా ఇది ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం... కెప్టెన్సీ టాస్క్ పూర్తయిందట. ఈ పోటీలో దేత్తడి హారిక విజయం సాధించడం ద్వారా ఇంటికి కొత్త కెప్టెన్‌గా ఎంపిక అయిందని తెలిసింది.

Recommended Video

Allu Arjun Is My Favourite South Star Says Priya Punia
పడిన కష్టానికి సరైన ఫలితం వచ్చింది

పడిన కష్టానికి సరైన ఫలితం వచ్చింది

కమాండో హౌస్‌లో జరిగిన టాస్కుల్లో దేత్తడి హారిక.. 15 నిమిషాల్లో పెద్ద టైర్‌ను పది సార్లు దొర్లించుకుంటూ తీసుకెళ్లాలి. అయితే, ఆమె ఎనిమిది నిమిషాల్లోనే ఈ టాస్కును విజయవంతంగా పూర్తి చేసింది. అమ్మాయి అంతలా కష్టపడడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక, కెప్టెన్‌గా ఎంపికైన హారికకు ప్రస్తుత సారథి అఖిల్ కెప్టెన్సీ బ్యాండ్‌ను అందించాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X