Guppedantha Manasu March 25th: అనుపమపై దేవయాని మానసిక దాడి.. అడ్డుకున్న వసు.. నిజం చెప్పేసిన మను!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో దేవయాని అనుపమ వద్దకు వస్తుంది. యోగక్షేమాలు అడిగిన తర్వాత మను నీ కొడుకే అంట కదా అంటూ ప్రశ్నిస్తుంది. అలాగే నీకు పెళ్లి ఎప్పుడు అయింది, పెళ్లికి కూడా మమ్మల్ని పిలవలేదేంటి, ఆయన ఎవరు, ఆయన పేరేంటి, మను తండ్రి పేరేంటి అంటూ ఒకటే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అవన్నీ వదిలెయ్ అని అనుపమ అనగా.. నువ్వు ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులు అవుతుంటే నీ భర్త ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదంటని అంటుంది. కొంపదీసి మను కుంతీపుత్రుడా ఏంటి అనగానే.. అనుపమ షాక్ అవుతుంది. ఎందుకు అలా సీరియస్ గా చూస్తున్నావని దేవయాని అంటుంది.
మరి నీ కొడుక్కు తండ్రి ఎవరు, నీ భర్త ఎవరు అని అడిగితేనే నువ్వు ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు.. నీ భర్త ఎవరో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావా అంటుంది. నిన్ను చూస్తే చాలా మంచి దానిలా ఉన్నావు మరి ఇదేంటి.. నీలో కూడా ఏదో చీకటి కోణం ఉందనుకుంటా అంటుంది. ఈ టాపిక్ వదిలేయమని అనుపమ అనగా.. దేవయాని మాత్రం వదలను అంటూ అడుగుతూనే ఉంటుంది. నీ భర్త పేరు చెప్పడం నీకు ఇష్టంలేకపోతే కనీసం క్లూ అయినా ఇవ్వు అంటాడు. అంతలోనే వసు వస్తుంది. రా అను అంటూ దేవయాని అనగా.. అనుపమ గారిని ఏదో అడుగుతున్నారు అంటూ ప్రశ్నిస్తుంది. మను అనుపమ కొడుకు అని తెలిసింది అంటూ అనుపమ చెబుతుంది.

మను తండ్రి ఎవరు అని మాత్రమే నేను అడుగుతున్నాను అంటూ దేవయాని చెప్పగా.. ఎవరైతే మీకేంటి మేడమ్ అంటూ ప్రశ్నిస్తుంది. ఆమె భర్త ఎవరో తెలిస్తే.. ఇంటికి పిలిచి భోజనం పెట్టి, చీర పెడతానని అంటుంది. అదంతా ఎందుకు అంటూ అనగా... మీ అత్తయ్య నేను మాట్లాడుతుంటే మాట్లాడట్లేదు.. మీ మామయ్య ఏం చేస్తాడో నీకు అయినా తెలుసా అంటూ అడుగుతుంది. ఏంజెల్ సమాధానం చెప్పకపోయేసరికి నీక్కూడా చెప్పలేదా... ఏంజెల్ నీ మేనకోడలే కదా.. ఆమెకైనా చెప్పాలిగా అంటూ దేవయాని అంటుంది. ఆతర్వతా వసు చాలా గట్టిగా.. మీరు ఆపండి అంటూ అంటుంది. మా విషయాలు మీకు అనవసరం అంటుంది.
పరామర్శించడానికి వచ్చి ప్రశ్నలు అడగడం ఏంటి.. వచ్చామా కాఫీ తాగి వెళ్లిపోయామా అంటూ ఉండాలి అంటూ వసు అంటుంది. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టి.. పక్క వాళ్ల విషయాల గురించి వదిలేయండి అని చెప్పుకొస్తుంది. ఇక ఆ తర్వాత దేవయాని వెళ్లిపోగా.. శైలేంద్రను చూపిస్తారు. అప్పుడే ధరణి వచ్చి కాఫీ ఇవ్వాలా అంటూ భర్తను అడగ్గా.. ఆయన చాలా కోప్పడతాడు. నేను కాఫీ తెచ్చుకుని మీకు ఇవ్వకపోతే బెల్టుతో కొట్టుకుంటారేమో అని అడగ్గా... మరి ఈసారి కొరడాతో ఏమైనా కొట్టుకుంటారా అంటుంది. ఆ తర్వాత తల్లిని పిలవగా.. ఆమె లేదని, ఇంటికి రాలేదని చెబుతుంది. కానీ అప్పుడే ఇంటకి వచ్చి శైలేంద్ర చెంపపై కొడుతుంది.

నన్నెందుకు కొడుతున్నావు అమ్మా అని అనగా... వసుకు పడాల్సింది నీకు పడింది, నా ఫ్రస్ట్రేషన్ పోయింది అంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనగా.. నేను వెళ్లిన విషయాన్ని ఏంజెల్ వసుకు చెప్పగా వెంటనే ఆమె వచ్చి అడ్డుకుందని వివరిస్తుంది. ఇలా అనుపమ నా నుంచి తప్పించుకుందని చెబుతుంది. ఆ తర్వాత వసు, ఏంజెల్ ను చూపిస్తారు. నాకు, మా తాతయ్యకు అనుపమ అత్త గురించి ఏం తెలియదని, మహేంద్ర గారు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయనకు తెలిసే ఛాన్స్ ఉందని వివరిస్తుంది. కానీ ఆయనకు కూడా తెలీదంటే.. నీకు, రిషికి మధ్య జరిగినట్లుగా ఏదైనా గొడవ జరిగే ఛాన్స్ ఉందని చెబుతుంది. ఇక లాస్ట్ కు రిషి వసుయే నా భార్య అని చెప్పిందని గుర్తు చేస్తుంది.
అప్పట్లో మీరు నా దగ్గర నిజం దాచినందుకు నేను చాలా బాధ పడ్డానని.. ఇప్పుడు అత్తయ్యే కూడా అలాగే బిహేవ్ చేస్తోందని అంటుంది. ఆమె బాధ తీరాకా చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు ఆమే చెబుతుందని వసు కూడా అంటుంది. ఇక ఆ తర్వాత మను, మహేంద్రలను చూపిస్తారు. అనుపమ నిన్ను ఎందుకు కొడుకులా ట్రీట్ చేయలేదు అని అడుగుతాడు. నా కొడుకు రిషి, భార్య జగతి మధ్య దూరం కూడా ఇలాగే ఉండేదని వీరి ప్రేమ ఒక్కటి కావడానికి చాలా ఏళ్లు పట్టిందని అనగా.. మను మాట్లాడతాడు. తల్లిని అమ్మా అని పిలవలేకుండా ఉండడం చాలా కష్టంగా ఉందని అంటాడు. మీ మధ్య గొడవ ఏంటి చెప్పు అనగా.. మను మా మధ్య గొడవ లేదని అంటాడు.
దీంతో మహేంద్ర.. నేను నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను ఏంటో చెప్పు అంటాడు. నాక్కూడా పేరెంట్స్ తో కలిసి ఉండి.. వారికి ఏ కష్టం రాకుండా చూస్కోవాలని ఉందని మను అంటాడు. కానీ నాకు ఈ జీవితంలో అలాంటి రోజులు ఉండవని.. జీవితం మా మధ్య ఉన్న సమస్య సమస్యగానే ఉండిపోతుందని అంటాడు.


Click it and Unblock the Notifications











