Guppedantha Manasu April 30th: వసుపై మనసుపడ్డ మను.. శైలేంద్ర చెంప పగులగొట్టిన మహేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ఏంజెల్ విశ్వంకు ఆ విషయాన్ని చెప్పి మనును విడిపిస్తానని అంటుంది. కానీ అనుపమ మాత్రం ఈ విషయం అతడికి చెప్పొద్దని అంటుంది. తండ్రి ఆరోగ్య పరిస్థితి మంచిలేదని వివరిస్తుంది. అయినా ఆరోగ్యం బాగానేలి విశ్వంను వదిలి నువ్విక్కడికి ఎలా వచ్చావని అంటుంది. బీపీ డౌన్ అయ్యే అవకాశం ఉంది.. నువ్వెళ్లు అని అంటుంది. ఇంతలోనే అనుపమ మనుతో మాట్లాడిందా అని ఏంజెల్ అనగా.. లేదని మహేంద్ర చెబుతాడు. నేను మాట్లాడితే మనుకు బాధ ఎక్కవవుతుందని, అందుకే వెళ్లలేదని అనగా.. ఏంజెల్ మాత్రం నువ్వెళ్లి మాట్లాడితేనే తనకు కాస్త సాంత్వన ఉంటుందని చెబుతుంది.

ఆ తర్వాత తాను వెళ్లిపోతనానని అనగా.. ఎలా వచ్చావని అడుగుతాడు మహేంద్ర. క్యాబ్ లో అనగానే నేను వచ్చి దింపుతానని అంటాడు. వెళ్లేముందు అనుపమ నువ్వు మనుతో మాట్లాడు అని చెబుతాడు. అది విన్న అనుపమ లోపలికి వస్తుంది. అది చూసిన మను థాంక్స్ మేడమ్ అంటాడు. ప్రేమతో వచ్చారా, సానుభూతితో వచ్చారా అని అడుగుతాడు. మీరెలా వచ్చారు.. సానుభూతితో అయితే సాటి మనిషిగా వచ్చారని, ప్రేమతో వచ్చానంటే తల్లిలా వచ్చావని అనుకుంటానని అంటాడు. నాకే మీపై ప్రేమ చూపించే అవకాశం రాలేదని చెబుతాడు. సరే నేను ఈ హత్య చేశానని మీరు నమ్ముతున్నారా అంటాడు. ఆమె మనుసులో చేయలేవని నాకు తెలుసు అంటూ అనుకుంటుంది.

Devayani Doubt on Shialendra in Rajeev Murder Case on Guppedantha Manasu April 30th 2024 Episode 1063

ఆ తర్వాత మను నేను మీ పెంపకంలో పెరిగాను, అలాంటి పని అస్సలే చేయనని అంటాడు. మన ఇద్దరి కష్టాలకు అసలైన కారణం నా తండ్రే మేడమ్. మనిద్దరం ఇలా సమస్యలు పడుతున్నామంటే ఆయనే రీజన్ అంటూ మను వివరిస్తాడు. మీకు తెలుసు నేను ఈ దత్తతను ఒప్పుకున్నానో, నేను నా తండ్రిని చూస్తాననే ఆశతో అంటూ చెబుతాడు. సారీ అది ఆశ కాదు.. అవసరం అంటూ వివరిస్తాడు. నా అసలైన తండ్రి ఎవరో తెలుసుకోవడానికే.. ఆయన ముందుకెళ్లి మమ్మల్ని ఇలా ఎందుకు వదిలేసి కష్టాల్లో తోశారని అడగడానికి మాత్రమే అంటూ చెప్పుకొస్తాడు. ఒకవేళ నేను ప్రాణాలు తీయాల్సి వస్తే అది అతడిదే అంటూ చెప్పుకొస్తాడు. ఇదంతా విన్న అనుపమ కోపంతో ఫైర్ అవుతుంది.

నువ్వు ఇలా చేయడం వల్లే నిజాలకు దూరం అవుతున్నావని, ఇంత కోపం నీకు ఎందుకు అని అంటుంది. అందరి మీద నీకు ఎలాంటి ఉద్దేశ్యం ఉందో.. మీ నాన్న మీద కూడా అలాంటి ఉద్దేశ్యమే ఉండాలని అంటుంది. ఈ కోపం నీకు అస్సలే మంచిది కాదని చెబుతుంది. ఇక వెళ్లేముందు మీరు సమాధానం చెప్పలేదు, నేను ఈ హత్య చేశానని నమ్ముతున్నారా అంటూ ప్రశ్నిస్తాడు. దానికి ఆమె లేదు అని సమాధానం చెబుతుంది. ఇక ఆ తర్వాత మహేంద్ర, శైలేంద్రలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా మహేంద్ర.. హంతకుడు మను కాదు నువ్వే అంటూ చెప్పుకొస్తాడు. నేనా... అలాంటి ఎందుకు అంటున్నారంటూ ఫైర్ అవుతాడు.

ఆ తర్వాత మహేంద్ర మాట్లాడుతూ.. రాజీవ్ నువ్వు తోడి దొంగలు అని అంటాడు. నాకు నీ మీదే అనుమానం ఉందని.. నువ్వే మా శత్రువు, ఎండీ సీటు కోసం నువ్వేమైనా చేస్తావంటూ ఫైర్ అవుతాడు. మనును దత్తత తీసుకుంటున్నానని.. ఇలా చేశావు కదా అంటూ నిలదీస్తాడు. ఇదంతా విన్న శైలేంద్ర ప్లీజ్ బాబాయ్.. అలా అనకండి.. మీరే అలా అంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందని అంటాడు. అయితే చచ్చిపో, నువ్వు పోతో మేమంతా హాయిగా ఉంటామని అంటాడు. మీరు నన్ను ఎందుకు నమ్మట్లేదు అని అంటూనే.. వసు విషయంలోనే వారిద్దరికీ గొడవ జరిగి మనుయే అతడిని చంపి ఉంటాడని అంటాడు. మను వసు మీద మనసు పడి ఉంటాడని వివరిస్తాడు. కానీ మహేంద్ర మాత్రం శైలేంద్ర చెంప పగులగొడతాడు.

Devayani Doubt on Shialendra in Rajeev Murder Case on Guppedantha Manasu April 30th 2024 Episode 1063

ఇక ఆ తర్వాత మను ఏ తప్పూ చేయలేదని నిరూపించి మరీ బయటకు తీసుకు వస్తానని.. చూడు అంటూ చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అనుపమ, వసులు తమ పెద్దమ్మ ఇంటికి వస్తారు. బాధను భరించలేని అనుపమ ఆమెను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కష్టం వచ్చిన ప్రతీసారి ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని, నువ్వేంటి ఇలా చేస్తున్నావని అంటుంది. మను ఆ హత్య చేసుండడని అనగా.. వసు కూడా ధైర్యం చెబుతుంది. అంతలోనే మహేంద్ర అక్కడకు వస్తాడు. మను ఏ తప్పూ చేయలేదని, అతడిని బయటకు తీసుకు వచ్చే పని నాదంటూ వివరిస్తాడు. అంతోలనే అనుపమ పెద్దమ్మ.. మనుది, నీది రక్త సంబంధం అంటూ చెప్పగా.. అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X