Guppedantha Manasu April 13th: డీఆర్ఎస్ అదిరిపోయే ప్లాన్.. మను, రిషిలు తిప్పికొట్టగలరా.. రిషి అసలు వస్తాడా?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కు అంతా వస్తున్నారా అని మహేంద్ర అడుగుతాడు. అనుపమ మాత్రం తాను రావట్లేదని చెబుతుంది. వసు రావొచ్చుగా అని చెప్పగా.. నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది నేను రానని అంటుంది. ఎవరో వస్తానని మీరు రాననడం కరెక్టు కాదని చెప్పగా.. అందరూ కలిసే వెళ్దామని మహేంద్ర అంటాడు. మను కూడా ఓకే చెప్పగా.. అనుపమ సైలెంట్ గా ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత దేవయాని కనిపించగా.. కొడుకును చూస్తూ చప్పట్లు కొడుతుంది. మనం కరెక్టు దారిలో వెళ్తున్నాం.. ఇలాగే చేస్తే మనం అనుకున్నది జరుగుతుందని వివరిస్తుంది.

ఎండీ సీటు నా చేతిలోకి వచ్చేందుకు అందరినీ అడ్డు తొలగించుకుంటూ వస్తున్నా.. ఇప్పటి వరకు నాకు సీటు దక్కలేదని చెబుతాడు. దేవయాని త్వరగానే మన ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనగా... శైలేంద్ర తండ్రిపై కోప్పడతాడు. ఆయనే మన శత్రువు అని, ఆయనకు తెలియకుండా ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటంటూ ఫైర్ అవుతాడు. ఆ తర్వాత దేవయాని మాట్లాడుతూ.. ఆయన అంతే, న్యాయం, ధర్మం వైపే ఆయన నిలబడుతూ ఉంటారని చెప్పుకొస్తుంది. ఆయన కన్నెర్రచేస్తే మనం భస్మం అయిపోతామని తండ్రి గురించి వదిలేయమని చెబుతుంది. ఇక ఆ తర్వాత తన దగ్గర ఓ మంచి ప్లాన్ ఉందని.. అది అమలు చేస్తే మళ్లీ అనుపమ కాలేజీ నుంచి వెళ్లిపోతుందని చెబుతుంది.

Devayani Fires on Vasudhara About Rishi on Guppedantha Manasu April 13th 2024 Episode 1049

అంతలోనే అక్కడకు ధరణి వస్తుంది. ఎవరికో హెల్ప్ చేయాలనుకుంటున్నారు కదా.. షాకింగ్ గా అనిపిస్తుందని అంటుంది. కానీ మీరు చేసే మంచి మంచి వాళ్లకు అయితే మంచి జరగాలని, చెడు వాళ్లకు అయితే చెడు జరగాలని ఆ దేవుడిని కోరుకుంటానని అంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక భోజనం చేసిన మనును చూపిస్తారు. వసు మను వద్దకు వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నారు అని అంటుంది. మేడమ్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుందిగా.. రేపు కాలేజీకి ఎందుకు రమ్మంటున్నారని అనగా.. తల్లిమీద బాగానే ప్రేమ ఉందన్ వసు చెబుతుంది. తనకు గాయం పూర్తిగా నయం అయిందని... ఎక్వు రెస్ట్ తీసుకుంటే ఇతర సమస్యలు కూడా వస్తాయని వివరిస్తుంది. అందుకే రమ్మంటున్నామని.. కాలేజీకి వచ్చాక కూడా ఎక్కువ స్ట్రెయిన్ కావాల్సిన అవసరం లేదని చెబుతుంది.

Devayani Fires on Vasudhara About Rishi on Guppedantha Manasu April 13th 2024 Episode 1049

ఇక ఆ తర్వాత మను మీరు దేవయాని గారు అన్న మాటలకు చాలా ఇబ్బంది పడ్డారు కదా అని అన్నాడు. అవును.. ఆయనంటే నాకు ప్రాణం అని, అలాంటిది తనను మర్చిపోయావని చెప్పడం నాకు నచ్చలేదని చెబుతుంది. నేను మీకు సాయం చేస్తాను.. త్వరలోనే రిషి సార్ ను తిరిగి తీసుకు వద్దామని అంటాడు. ఇక ఆ తర్వాత మహేంద్ర, అనుపమలు అక్కడకు రాగా వాళ్లకు చెప్పేసి వెళ్లిపోతాడు మను. ఆ తర్వాత శైలేంద్ర కనిపిస్తాడు. రాజీవ్ ఇంకా రావట్లేదని అనుకుంటూ అతడికి ఫోన్ చేస్తాడు. నువ్వే వాళ్ల వద్దకు వెళ్లి మన ప్లాన్ సక్సెస్ అయ్యేలా చేయు అని అంటాడు. లేదు అక్కడైతే అంతా ఉంటారు.. తనే ఇక్కడకు వచ్చాకా మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేస్త్తాడు.

Devayani Fires on Vasudhara About Rishi on Guppedantha Manasu April 13th 2024 Episode 1049

ఆ తర్వాత రాజీవ్ కు దేవయాని ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావని అడగ్గా.. శైలేంద్ర చెప్పిన పని చేస్తున్నానని అంటాడు. అది కాగానే ఇంకో పని చేయాలని దేవయాని వివరిస్తుంది. కానీ అదేంటో మనకు వినిపించకుండా చెబుతారు. ఈ ప్లాన్ మిస్ కావొద్దని అనగా.. అస్సలే మిస్ చేయనని అంటాడు. అంతలోనే విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు అక్కడకు వస్తారు. రేపు కాలేజీలో మీటింగ్ ఉందని.. మేము పనికి రామని అంటారు. నేను మీకో బంపర్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను అని.. నేను చెప్పిన పని చేస్తే ఒక్కరికి 50 వేలు ఇస్తానని అంటాడు. అవీ సరిపోవంటే లక్ష ఇస్తానని చెప్పుకొస్తాడు. అయితే మీరు కాలేజీలో ఇలా చేస్తేనే డబ్బులు ఇస్తామని అంటాడు.

Devayani Fires on Vasudhara About Rishi on Guppedantha Manasu April 13th 2024 Episode 1049

దానికి వాళ్లు ఇది తప్పనిపిస్తుంది సార్.. మేమేం చేయమని అనగా.. రాజీవ్ డబ్బులు వద్దా అని అడుగుతాడు. ఆ తర్వాత అంతా ఆలోచించుకుని చేస్తామని చెబుతారు. అప్పుడే రాజీవ్ అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేస్తాడు. అవన్నీ తీసుకుని వాళ్లు వెళఅలిపోతారు. ఇక తర్వాతి రోజు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ స్టార్ అయిపోతుంది. అక్కడకు దేవయాని కూడా వస్తుంది. మనుతో పాటు వు ఫైల్స్ సర్దుకుంటూ ఉంటారు. అంతా వచ్చినట్లేనా అని వసుధార మాట్లాడడం ప్రారంభిస్తుంది. మీ పిల్లలకు అటెండెన్స్ తగ్గడం వల్లే ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చిందని చెబుతుంది. అటెండెన్స్ తగ్గితే అన్ని రకాలుగా వెనుక పడిపోతారని అంటుంది. అలాగే అక్కడే ఉన్న ఓ విద్యార్థిని లేపి ఎందుకు అటెండెన్స్ తగ్గిందని అనగా.. అతడి తల్లి లేచి చెడువాసాలు చేస్తూ కాలేజీకి రావట్లేదని అంటుంది. ఇంతటితో సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X