twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్ రీయూనియన్ పార్టీ: 14 మందిలో ఇద్దరు కంటెస్టెంట్లు దూరం.. ఆ మోసం వల్లే రావడం లేదా?

    |

    తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ పోతోంది బిగ్ బాస్. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయం అయిన దీనికి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందజేస్తున్నారు. అందుకే సీజన్ మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ పోతోందీ షో. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ కూడా చివరి దశకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ కంటెస్టెంట్లతో రీయూనియన్ పార్టీ నిర్వహిస్తున్నారు. దీనికి ఇద్దరు కంటెస్టెంట్లు మినహా అంతా హాజరయ్యారు. మిస్సైన వాళ్లు ఎవరు? దానికి కారణం ఏంటి?

     19 మందిలో వాళైదుగురే మిగిలారు

    19 మందిలో వాళైదుగురే మిగిలారు

    బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలిపి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఐదుగురు ఆరియానా గ్లోరీ, దేత్తడి హారిక, అభిజీత్, అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌లు ఫినాలేకు చేరుకున్నారు. డిసెంబర్ 20 అంటే వచ్చే ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్న గ్రాండ్ ఫైనల్‌లో వీళ్ల నుంచి ఒకరు విజేతగా నిలవబోతున్న విషయం తెలిసిందే.

     సర్‌ప్రైజ్‌లతో సాగుతోన్న ఫినాలే వీక్

    సర్‌ప్రైజ్‌లతో సాగుతోన్న ఫినాలే వీక్

    నాలుగో సీజన్‌లో చివరి వారం కావడంతో స్పెషల్ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ షో నిర్వహకులు. ఇందులో భాగంగానే ఇప్పటికే గత సీజన్ల కంటెస్టేట్లు ఎంట్రీ ఇచ్చి టాప్-5 సభ్యులకు సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే, ఫినాలేకే చేరిన వారికి జర్నీ వీడియోలు చూపించారు. అంతేకాదు, ప్రతి ఒక్కరికీ భారీ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చి వాళ్లలో జోష్‌ను నింపాడు బిగ్ బాస్.

    ఆ కంటెస్టెంట్లతో రీయూనియన్ పార్టీ

    ఆ కంటెస్టెంట్లతో రీయూనియన్ పార్టీ

    ఫినాలేకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సీజన్‌లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో రీయూనియన్ పార్టీ నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా మాజీ కంటెస్టెంట్లను అద్దాల గదిలోకి తీసుకొచ్చేలా డిజైన్ చేశారు. శుక్రవారం శనివారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రసారం చేసేలా ప్లాన్ చేసుకున్నారు.

    మొదటిరోజు ఆరుగురు సభ్యుల ఎంట్రీ

    మొదటిరోజు ఆరుగురు సభ్యుల ఎంట్రీ

    రీయూనియన్ పార్టీలో భాగంగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో అందరి కంటే ముందుగా మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే టాప్-5 కంటెస్టెంట్లపై తన అభిప్రాయం చెప్పింది. ఆమె తర్వాత కరాటే కల్యాణీ, లాస్య ప్రవేశించారు. అనంతరం కుమార్ సాయి, స్వాతీ దీక్షిత్ జంటగా ఎంట్రీ ఇచ్చారు. చివర్లో గంగవ్వ వచ్చినా అది మాత్రం ప్రసారం చేయలేదు.

    రెండో రోజు మరో ఆరుగురు వస్తున్నారు

    రెండో రోజు మరో ఆరుగురు వస్తున్నారు

    శనివారం ఎపిసోడ్‌ను గంగవ్వ ఎంట్రీతో మొదలు పెట్టబోతున్నారు. ఆమెతో పాటు జోర్ధార్ సుజాత కూడా హౌస్‌లోకి రాబోతుంది. వీళ్లిద్దరు వెళ్లిపోయిన కొద్ది సేపటికి నోయల్ సీన్, హీరోయిన్ దివి వద్యా, మెహబూబ్ దిల్‌సే, జబర్ధస్త్ అవినాష్, డైరెక్టర్ సూర్య కిరణ్ వస్తారని తెలుస్తోంది. వీళ్లంతా ఆట పాటలతో ఫినాలే కంటెస్టెంట్లకు మజాను పంచబోతున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

    14 మందిలో ఇద్దరు కంటెస్టెంట్లు దూరం

    14 మందిలో ఇద్దరు కంటెస్టెంట్లు దూరం

    గత వారం వరకూ మొత్తం 14 మంది ఎలిమినేట్ అయ్యారు. వీరిలో ఇద్దర కంటెస్టెంట్లు దేవీ నాగవల్లి, అమ్మ రాజశేఖర్ రీయూనియన్ పార్టీకి రావడం లేదని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరోవైపు, తమను అన్యాయంగా ఎలిమినేట్ చేశారనే కారణంతోనే దేవీ, రాజశేఖర్ ఈ పార్టీకి దూరం అయ్యారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

    English summary
    తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ పోతోంది బిగ్ బాస్. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయం అయిన దీనికి తెలుగు ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందజేస్తున్నారు. అందుకే సీజన్ మీద సీజన్లు పూర్తి చేసుకుంటూ పోతోందీ షో. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ కూడా చివరి దశకు చేరింది. ఈ నేపథ్యంలో మాజీ కంటెస్టెంట్లతో రీయూనియన్ పార్టీ నిర్వహిస్తున్నారు. దీనికి ఇద్దరు కంటెస్టెంట్లు మినహా అంతా హాజరయ్యారు. మిస్సైన వాళ్లు ఎవరు? దానికి కారణం ఏంటి?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X