‘బంచికుబం’లు చేసే దాన్ని కాదు: కంటెస్టెంట్లతో దేవీ వాగ్వాదం.. చివరకు అదే చూపించారుగా!

By Manoj

బిగ్ బాస్ సీజన్‌ 4 రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వారం అంతంతమాత్రంగానే సాగిన ఈ షో... రెండో వారం నుంచి పర్వాలేదనిపిస్తోంది. దీంతో ఇప్పుడిప్పుడే దీన్ని చూసేందుకు ప్రేక్షకులు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ కూడా సరికొత్త వ్యూహాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాడు. ఫలితంగా షోపై హైప్ క్రియేట్ అవుతోంది. ఇదిలాఉండగా.. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య రచ్చ జరిగే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. తాజా ఎపిసోడ్‌లో దేవీ నాగవల్లి 'బంచికుబం'ల విషయంలో ముగ్గురు కంటెస్టెంట్లపై ఫైర్ అయింది. అసలేం జరిగింది.? పూర్తి వివరాల్లోకి వెళితే...

అనుమానాలకు చెక్ పెడుతూ స్టార్ట్

అనుమానాలకు చెక్ పెడుతూ స్టార్ట్

మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అవడంతో నాలుగో దానిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఇది ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా ఈ సీజన్‌ను మొదలెట్టారు. అందుకోసం ముందుగానే కంటెస్టెంట్లను క్వారంటైన్‌లో ఉంచారు. షూట్ సమయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆ కంటెస్టెంట్ల వల్లే బిగ్ బాస్‌ 4 ఢీలా

ఆ కంటెస్టెంట్ల వల్లే బిగ్ బాస్‌ 4 ఢీలా

హడావిడి లేకపోయినా అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది బిగ్ బాస్ షో. ఆ మధ్య విడుదలైన టీజర్లతో పాటు మొదటి రోజు కనిపించిన హడావిడితో ఈ సీజన్ కూడా సూపర్ సక్సెస్ అవుతుందన్న టాక్ వినిపించింది. అయితే, హౌస్‌లోకి పంపించిన పదహారు మంది కంటెస్టెంట్లలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారు పెద్దగా ఫేమ్ ఉన్న వాళ్లు లేకపోవడంతో షో డీలా పడింది.

‘లేడీ బిగ్ బాస్' అయ్యేందుకు ప్లాన్

‘లేడీ బిగ్ బాస్' అయ్యేందుకు ప్లాన్

ఇక, ఈ సీజన్‌లో హౌస్‌లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్లలో ప్రముఖ న్యూస్ ఛానెల్ యాంకర్ దేవీ నాగవల్లి కొంత ప్రత్యేకమనే చెప్పాలి. జర్నలిస్టుగా ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ఆమె... జీవితంలోనూ ఆటుపోట్లను అనుభవించారు. ఈ విషయాన్ని దేవీనే స్వయంగా వెల్లడించారు. అంతేకాదు, ఈ సారి లేడీ బిగ్ బాస్ అయ్యేందుకే తాను ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆమెపై ట్రోలింగ్.... మరింత హైలైట్

ఆమెపై ట్రోలింగ్.... మరింత హైలైట్

దేవీ నాగవల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. #Eliminatedevinagavalli అనే హ్యాష్ ట్యాగ్‌‌తో కొందరు ఆకతాయిలు ఈ న్యూస్ యాంకర్‌పై వ్యతిరేకతను చూపించారు. ఈ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవడంతో దేవీ నాగవల్లి బాగా హైలైట్ అయ్యారు. దీంతో ఆమె గురించి చాలా మంది గూగుల్‌లో వెతికేస్తున్నారట.

మరో దేవీ నాగవల్లిని చూపిస్తోంది

మరో దేవీ నాగవల్లిని చూపిస్తోంది

బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత దేవీ నాగవల్లి... న్యూస్ యాంకర్‌లానే సీరియస్ మోడ్‌లో కనిపించింది. ప్రతి అంశంపై విశ్లేషణలు చేస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ కట్టప్ప ప్లాన్‌ను ముందుగానే పసిగట్టింది. ఇలాంటి తరుణంలో నాగార్జున ఇచ్చిన టాస్క్‌లో మాత్రం అదిరిపోయే డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది. అలాగే, మిగతా వాటిలోనూ అద్భుతంగా నటిస్తూ మిప్పిస్తోంది.

కంటెస్టెంట్లతో దేవీ నాగవల్లి వాగ్వాదం

కంటెస్టెంట్లతో దేవీ నాగవల్లి వాగ్వాదం

బుధవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయమని టాస్క్ ఇచ్చాడు. ఇందుకోసం మోనాల్ - సోహైల్, మెహబూబ్ - హారికలను జంటలుగా చేశాడు. అలాగే, అమ్మా రాజశేఖర్ సోలో కంటెస్టెంట్‌గా.. లాస్య, నోయల్ జడ్జ్‌లు వ్యవహరించారు. మిగిలిన వాళ్లు యాడ్స్ చేయాలని సూచించాడు. ఆ సమయంలో దేవీ.. హౌస్‌మేట్స్‌తో వాగ్వాదానికి దిగింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Episode 12 Highlights : బిగ్ బాస్ ముందు ఏడ్చేసిన Gangavva | Filmibeat Telugu
‘బంచికుబం'లు చేసే దాన్ని కాదు

‘బంచికుబం'లు చేసే దాన్ని కాదు

యాడ్ షూటింగ్‌లో భాగంగా ‘బంచికుబం పాన్' అనే వీడియో చేయాలని అభి, అఖిల్, కల్యాణీ, దేవీ భావించారు. అయితే, అందులో మసాలా ఎక్కువగా ఉండడంతో దేవీ ఆ క్యారెక్టర్ చేయలేనని వాదనకు దిగింది. ‘నేను బంచికుబంలు చేసే దాన్ని కాదు. జర్నలిస్టుగా ఉండి అలాంటివి ప్రోత్సహించలేను' అంటూ చెప్పింది. కానీ, వినోదం కోసం చివరకు ఆ పాత్రను చేయాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X