Devi Nagavalli:మళ్ళీ వార్తల్లోకి.. కొత్త కారుతో హల్చల్.. కారు ఎంతంటే?

టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి అంటే ప్రత్యేక పరిచయం అక్కర్లేదు, న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె తక్కువ కాలంలో బుల్లితెర మీద పాపులారిటీ సంపాదించింది. ఆ పాపులారిటీ తోనే ఆమె బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఆమె ఎంటరై ఇతర కంటెస్టెంట్ లకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఆమె కారు కొనడం చర్చనీయాంశంగా మారింది. ఆమె కొన్న కారు ఏంటి? దాని ధర ఎంత? అనే వివరాల్లోకి వెళితే

బిగ్ బాస్ ఎంట్రీ

బిగ్ బాస్ ఎంట్రీ

టీవీ9 యాంకర్ గా పరిచయమైన దేవి నాగవల్లి బిగ్ బాస్ షోలో అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టే సమయంలో తాను గత మూడు సీజన్ అలా కాకుండా బిగ్ బాస్ కి లేడీ బిగ్ బాస్ గా మారుతానంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన దేవి నాగవల్లి హౌస్ లో ఉన్న మూడు వారాలు తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఈ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ముద్ర వేసుకుంది.

అనూహ్యంగా బయటకు

అనూహ్యంగా బయటకు

అయితే బయట టీవీలో కనిపించే టీవీ నైన్ దేవి వేరు బిగ్ బాస్ దేవి నాగవల్లి వేరు అన్నట్లుగా ఆమె ప్రవర్తన కూడా కనిపించింది. సింగర్ గా డాన్సర్ గా తనలో ఉన్న ఇతర అన్ని కళలను బయట పెట్టే ప్రయత్నం కూడా చేసినా ఆమె మూడో వారంలో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఈ షో తర్వాత ఈమె మళ్లీ యాంకర్ గా బాధ్యతలు చేపట్టి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటుంది.

ఎలిమినేషన్ వివాదం

ఎలిమినేషన్ వివాదం

అయితే నిజానికి దేవి ఎలిమినేషన్ గురించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు కూడా నడిచాయి. ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగలేదని వేరేవాళ్లు ఎలిమినేట్ కావాల్సి ఉన్నా కావాలని దేవి నాగవల్లి ని బయటకు పంపించారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దేవి నాగవల్లి బయటకు వచ్చాక కూడా ఇలాంటి కామెంట్స్ చేసింది, తను బయటకు రావడానికి కారణం ఓటింగ్ తక్కువ కావడమేనని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పారనీ బయటకు వచ్చాక నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అందరూ చెబుతున్నారు కానీ వాళ్ళను ఎలిమినేట్ చేయకుండా తనను ఎలిమినేట్ చేయడం బాధించిందని చెప్పుకొచ్చింది.

కారు కొన్నానంటూ

కారు కొన్నానంటూ

బిగ్ బాస్ తో ఆమె జర్నీ ముగిసిన ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవడమే కాక ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ వస్తున్న ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది. ఇక ఆ ఫోటోలో తను కొత్త కారు కొన్నట్టు ఆమె ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ తను స్కోడా ఆటోమేటిక్ కార్ కొన్నట్లు తెలిపింది.

కారు రేటెంత అంటే

కారు రేటెంత అంటే

ఇక ఈ కారు ధర దాదాపు రూ.25 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇక ఈ మధ్య దేవీ నాగవల్లి ఎదుర్కొన్న ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. రుధిరం అనే పదం అర్థం కూడా తెలియకుండా దారుణంగా మాట్లాడడంతో నెటిజన్లు ఆమెను ఏకిపారేశారు. ఆ తర్వాత కూడా ఉప్పుడు బియ్యం కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఆమె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X