బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం: హౌస్‌లోకి ఆ కంటెస్టెంట్ రీఎంట్రీ ఖాయమే.!

By Manoj

తక్కువ సమయంలోనే విపరీతంగా ప్రేక్షకాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి మూడేళ్ల క్రితం వచ్చిన ఈ షో... సక్సెస్‌ఫుల్‌గా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. అదే సమయంలో నాలుగో సీజన్‌ను కూడా ఇటీవలే ప్రారంభించింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి తక్కువ ఫేమ్ ఉన్న కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నప్పటికీ.. ఆరంభం నుంచే ఈ షో దుమ్ముదులిపేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలిమినేట్ అయిన ఓ కంటెస్టెంట్ విషయంలో బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుందట. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్.? వివరాలు మీకోసం.!

ఇండియాలోనే మొదటి షోగా రికార్డు

ఇండియాలోనే మొదటి షోగా రికార్డు

బిగ్ బాస్ సీజన్ 4 ప్రీమియర్ ఎపిసోడ్‌తోనే టెలివిజన్‌లో సరికొత్త చరిత్రను లిఖించింది. అంగరంగ వైభవంగా సాగిన ఈ ఎపిసోడ్ టాప్ రేటింగ్ సాధించి పలు రికార్డులను క్రియేట్ చేసింది. ఫలితంగా భారతదేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన రియాలిటీగా షోగా ప్రథమ స్థానాన్ని అందుకుంది. ఈ రికార్డుతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

బిగ్ బాస్ ప్లాన్లతో పెరుగుతోన్న ఆసక్తి

బిగ్ బాస్ ప్లాన్లతో పెరుగుతోన్న ఆసక్తి

బిగ్ బాస్ షో ప్రీమియర్ ఎపిసోడ్ అదిరిపోయినప్పటికీ... మొదటి వారం అంత ఆసక్తికరంగా సాగలేదు. పెద్దగా పేరున్న కంటెస్టెంట్లు లేకపోవడంతో పాటు రొటీన్ ఫార్ములాతో ప్రేక్షకులకు బోర్ ఫీలింగ్ కలిగింది. అయితే, రెండో వారం నుంచి ఈ షో బాగా పుంజుకుంది. సగటున ఎనిమిది రేటింగ్ పాయింట్లు తెచ్చుకుని పర్వాలేదనిపించింది. తద్వారా ప్రేక్షకుల్లో షోపై ఆసక్తి పెరిగిపోయింది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అమలు.. కారణం ఇదే

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అమలు.. కారణం ఇదే

షో ప్రారంభమైన మూడు వారాలకే బిగ్ బాస్ హౌస్‌లోకి ముగ్గురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరు కమెడియన్ కుమార్ సాయి కాగా, జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్, స్వాతీ దీక్షిత్ మిగిలిన ఇద్దరు. ప్రస్తుతం ఐపీఎల్ నడుస్తున్న కారణంగానే.. బిగ్ బాస్‌పై ఆసక్తిని పెంచేందుకు నిర్వహకులు ఈ ముగ్గురినీ హౌస్‌లోకి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆ ఎలిమినేషన్ విషయంలో హైడ్రామా

ఆ ఎలిమినేషన్ విషయంలో హైడ్రామా

గత వారం హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయింది దేవీ నాగవల్లి. మూడో వారం నాటకీయ పరిణామాల నడుమ నామినేట్ అయిందామె. రెండో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన కరాటే కల్యాణీ... బిగ్ బాంబ్ రూపంలో వచ్చిన అధికారం ప్రకారం... దేవీని నేరుగా నామినేట్ చేసింది. దీంతో హౌస్‌మేట్ల ప్రమేయం లేకుండానే ఆమె ఆ లిస్టులో చేరి ఎలిమినేట్ అయిపోయింది.

ఆమెను టార్గెట్ చేయడం వల్లే ఇదంతా

ఆమెను టార్గెట్ చేయడం వల్లే ఇదంతా

బిగ్ బాస్ షో నుంచి దేవీ నాగవల్లి ఎలిమినేట్ అయిన తర్వాత ఎన్నో వార్తలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగానే హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు ఆమెను ఒక వర్గానికి చెందిన కొందరు కావాలనే టార్గెట్ చేశారని, వ్యతిరేకంగా క్యాంపైన్ చేయడంతో పాటు ఓట్లు పడకుండా ప్లాన్ చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో బయటికి వచ్చిన తర్వాత ఆమె మరింత హైలైట్ అవుతోంది.

బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం

బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం

దేవీ నాగవల్లి ఎలిమినేషన్‌ను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆమెను బిగ్ బాస్ హౌస్‌లోకి తిరిగి తీసుకు రావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు, ట్విట్టర్‌లో ఓ హ్యాష్ ట్యాగ్‌ను కూడా క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. దీంతో ఆమె విషయంలో బిగ్ బాస్ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4: Devi Nagavalli On Marriage
హౌస్‌లోకి ఆ కంటెస్టెంట్ గ్రాండ్ రీఎంట్రీ.!

హౌస్‌లోకి ఆ కంటెస్టెంట్ గ్రాండ్ రీఎంట్రీ.!

మూడో వారంలో ఎలిమినేట్ అయిన దేవీ నాగవల్లిని.. తిరిగి ఇంట్లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ప్రయత్నాలు చేస్తుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మేరకు నిర్వహకులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X