బిగ్ బాస్ హౌస్‌లోకి దేవీ నాగవల్లి రీఎంట్రీ: ఈ ఒక్క ఫొటోతో అందరికీ క్లారిటీ వచ్చేసినట్లే.!

By Manoj

జర్నలిస్టుగా కెరీర్‌ను ఆరంభించి తక్కువ సమయంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును అందుకుంది దేవీ నాగవల్లి. ప్రముఖ న్యూస్ ఛానెల్‌లో ప్రమోటర్‌గా పని చేస్తున్న ఆమె... తనదైన శైలి జర్నలిజంతో రాణిస్తోంది. ఇక, ఈ మధ్యనే ప్రారంభమైన బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తనలోని కొత్త యాంగిల్స్‌ను పరిచయం చేసుకుంది. అయితే, ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవీ నాగవల్లి రీఎంట్రీపై క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు మీకోసం.!

లేడీ బిగ్ బాస్ అవుతానని చెప్పి ఎంట్రీ

లేడీ బిగ్ బాస్ అవుతానని చెప్పి ఎంట్రీ

గత నెలలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ సీజన్‌లోకి జర్నలిస్ట్ దేవీ నాగవల్లి కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు ఆమె... ‘ఇప్పటి వరకు బిగ్ బాస్‌కు మగవారే విజేతలుగా నిలిచారు. ఈ సీజన్‌లో నేను గెలిచి లేడీ బిగ్ బాస్ అవుతాను' అని చెప్పింది. అలాగే, తన జీవితంలోని కష్టాలను కూడా వివరించింది.

మొదటి వారమే పంపాలని డిమాండ్లు

మొదటి వారమే పంపాలని డిమాండ్లు

రిపోర్టింగ్ ఫీల్డ్‌లో ఉన్న కారణంగా కొన్ని రాజకీయపరమైన అంశాల వల్ల దేవీ నాగవల్లి, ఆమె పని చేస్తున్న సంస్థను వ్యతిరేకించే వాళ్లు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా ఆమెను బిగ్ బాస్ హౌస్‌లో నుంచి బయటకు పంపాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే దేవీని ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో పాటు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.

తనలోని కొత్త దేవీని పరిచయం చేసింది

తనలోని కొత్త దేవీని పరిచయం చేసింది

బిగ్ బాస్ హౌస్‌లోకి రాకముందు వరకు దేవీ నాగవల్లి అంటే సీరియస్ పర్సన్ అని అనుకున్నారంతా. కానీ, షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెలోని ఎన్నో కోణాలు బయటకు వచ్చాయి. సరదాగా డ్యాన్స్‌లు చేయడం.. పాటలు పాడడం.. ఆటపట్టించడం సహా ఎన్నో రకాలుగా ఆమె ఎంజాయ్ చేసింది. ఫలితంగా దేవీలో ఇలాంటి యాంగిల్స్ కూడా ఉన్నాయా అని అంతా నోరెళ్లబెట్టేశారు.

 అనుకోకుండా నామినేట్.. ఎలిమినేషన్

అనుకోకుండా నామినేట్.. ఎలిమినేషన్

దేవీ నాగవల్లి మిగిలిన ఇంటి సభ్యుల్లా కాకుండా... ఎలిమినేట్ అయిన కరాటే కల్యాణీ వల్ల నామినేట్ అవ్వాల్సి వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే కంటెస్టెంట్‌కు వచ్చే బిగ్ బాంబ్ అనే అధికారంతో దేవీని నేరుగా నామినేట్ చేసిందామె. ఆ వారం మంచిగానే గేమ్ ఆడినప్పటికీ ఆమె ఎలిమినేట్ అయిపోయింది. వాస్తవానికి ఈమె ఎలిమినేట్ అవుతుందని ఎవరూ అనుకోలేదు.

బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ.. అందుకే షూట్లు

దేవీ నాగవల్లి ఎలిమినేషన్‌ను చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. దీంతో బిగ్ బాస్ షో నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెను మళ్లీ షోలోకి తీసుకురావాలని డిమాండ్ కూడా చేశారు. ఆ సమయంలోనే దేవీ బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే ఆమె ఫొటోషూట్లు చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది.

Recommended Video

Case 99 Movie Motion Poster Launch By Director Boyapati Srinu
 ఈ ఒక్క ఫొటోతో క్లారిటీ వచ్చేసినట్లే.!

ఈ ఒక్క ఫొటోతో క్లారిటీ వచ్చేసినట్లే.!

గంగవ్వ అనారోగ్య కారణాలతో హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో దేవీ నాగవల్లి రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె రిపోర్టింగ్ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చి షాకిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది బయటకు వచ్చిన తర్వాత దేవీ నాగవల్లి రీఎంట్రీ ఆ షోలోకి ఇచ్చే అవకాశాలే లేవన్న టాక్ బాగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X