బిగ్ బాస్ రీఎంట్రీపై షాకింగ్ అప్‌డేట్: అదిరిపోయే ఆఫర్ రిజెక్ట్ చేసిన మాజీ కంటెస్టెంట్.!
ఎలాంటి పరిస్థితుల్లో ప్రారంభించినా సూపర్ సక్సెస్ అవుతోంది బిగ్ బాస్ షో. గతంలో ఎన్నో వివాదాలు, అనుమానాల నడుమ వచ్చినా.. విజయవంతం అయిందీ షో. ఇక, కరోనా వైరస్ ప్రభావం చూపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రికార్డు స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను మరింత పెంచుకునేందుకు బిగ్ బాస్ నిర్వహకులు మరిన్ని ప్రయోగాలతో ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రీఎంట్రీ విషయంలో మరో ప్లాన్ చేశారు. ఈ సమయంలో ఓ మాజీ కంటెస్టెంట్ తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురి చేస్తోంది. ఆ వివరాలు మీకోసం.!

వాటిని మించిన స్పందనతో రికార్డులు
బిగ్ బాస్ తెలుగులో సూపర్ సక్సెస్‌ఫుల్ అయిన షోలలో ఒకటి. ఇప్పటికే మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. బుల్లితెరపై ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది. అంతేకాదు, టెలివిజన్ రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఇక, తాజాగా ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్ సైతం వాటన్నింటికీ మించిన రెస్పాన్స్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

షోపై ప్రత్యేక శ్రద్ధ.. సరికొత్త ప్రయోగాలు
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి బిగ్ బాస్ నిర్వహకులు షో విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మరింత ఎక్కువగా చూపించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్‌ను ఎక్కువగా ప్రసారం చేస్తూ మంచి రేటింగ్‌ను అందుకుంటున్నారు.

బిగ్ బాస్‌లో ఇప్పుడే ఇలా జరిగింది
తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో. ప్రస్తుత నాలుగో సీజన్‌లో మాత్రం గతంలో ఎన్నడూ చూపించని కొత్త కంటెంట్‌ను ప్రస్తారం చేస్తున్నారు నిర్వహకులు. సరికొత్తగా డిజైన్ చేసిన టాస్కులు, లవ్ ట్రాకులు, మసాలా సీన్లతో పాటు కొన్ని సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. వీటితో పాటు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ కొత్త పద్దతికి శ్రీకారం చుట్టింది బిగ్ బాస్ యూనిట్.

రీఎంట్రీ.. వైల్డ్ కార్డ్.. ఏం జరుగుతుంది
ఇక, బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతో మంది కంటెస్టెంట్లు ఫైనల్స్ వరకూ వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే, ఎలిమినేట్ అయిన వారితో గత సీజన్లలో రీఎంట్రీ కూడా ఇప్పించారు. నాలుగో సీజన్‌లో సైతం అలాంటిదేదో జరగబోతుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ రీఎంట్రీపై షాకింగ్ అప్‌డేట్
షో తుది అంకానికి చేరుకున్న సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే ఫెయిల్ అవుతుందని కామెంట్లు వినిపిస్తోన్న సమయంలో.. బిగ్ బాస్ నిర్వహకులు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌తో రీఎంట్రీ ఇప్పించబోతున్నారని ఇటీవల ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, కుమార్ సాయి మళ్లీ రాబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది.
Recommended Video

ఆఫర్ రిజెక్ట్ చేసిన మాజీ కంటెస్టెంట్.!
కుమార్ సాయి రీఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయమైందనే టాక్ వినిపిస్తోన్న సమయంలోనే.. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఆఫర్‌ను ఓ కంటెస్టెంట్ రిజెక్ట్ చేసినట్లు ఓ న్యూస్ లీకైంది. ఇలా చేసింది ఎవరో కాదు.. ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన దేవీ నాగవల్లే ఈ నిర్ణయం తీసుకుందట. అవును.. రీఎంట్రీ కోసం షో నిర్వహకులు ముందుగా ఆమెనే సంప్రదించినా.. తిరస్కరించిందని టాక్.


Click it and Unblock the Notifications











