Bigg boss 4: విడాకులు తీసుకున్నా.. ఆరేళ్ళ బాబు ఉన్నాడు డబ్బు కోసమే ఇక్కడికి వచ్చాను: టీవీ9 దేవి
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు ఆదివారం గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. కింగ్ నాగార్జున రెండవసారి హోస్ట్ గా ఆదరగొట్టేశారు. విభిన్నమైన షేడ్స్ తో నాగార్జున తన హోస్టింగ్ తో ఎంతగానో అలరించారు. ఇక హౌజ్ లోకి ఈ సారి నెవర్ బోఫోర్ అనేలా విభిన్న స్వభావాలు ఉన్న కంటెస్టెంట్స్ వచ్చారు. అతిథి అందులో ఎక్కువగా దేవి నాగవల్లిపైనే అందరి దృష్టి పడింది. ఆమె షోలో ఎలా అడుగులు వేయబోతోంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

కాంట్రవర్సీ షోలో..
టీవీ9 న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవి నాగవల్లి అప్పుడప్పుడు కాంట్రవర్సీ ఇంటర్వ్యూలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ లాంటి కాంట్రవర్సీ షోలో ఆమె ఏ విధంగా ముందుకు సాగనుంది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

పరుగులు పెట్టడమంటేనే ఇష్టం.
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందే తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకున్న దేవి మాటలతో కూడా షోకి మరింత హైప్ క్రియేట్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. రాజమండ్రిలో పుట్టిన నేను బికామ్ చదువుకున్నాను. గ్రాఫిక్స్ కోర్స్ అనంతరం ఇక ఛానెల్ లో చేరాను. ఆ తరువాత యాంకర్ గా అవకాశం వచ్చింది. నాకు పరుగులు పెట్టడమంటేనే ఇష్టం.

విడాకులు తీసుకున్నా..
పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని ఆ తరువాత యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ 8 నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేకపోయా. విడాకులు తీసుకున్నా. ఇప్పుడు నాకు 6ఏళ్ల బాబు ఉన్నాడు. మంచి అమ్మాయి అనే సర్టిఫికెట్ కోసం నేను ఉండలేను. బిగ్ బాద్ హౌజ్ లో లేడి విన్నర్ గా నిలవాలి అన్నదే నా కోరిక. కానీ బిగ్ బాద్ అంటే కొంచెం భయంగా ఉంది.

అందుకే బిగ్ బాస్ కి వచ్చాను..
న్యూస్ చదివేటప్పుడు డబ్బుకు సంబంధించిన వార్తలు ఎక్కువగా చదివాను. ఒక మనిషి అంత డబ్బు ఎలా సంపాదిస్తాడు అనుకునే దాన్ని. నా జీవితంలో అంత డబ్బు ఎప్పుడైనా చూస్తానా అనుకునేదాన్ని. వచ్చిన జీతం హోమ్ లోన్ కట్టడానికి సరిపోయేది. ఇక బిగ్ బాద్ లో విన్నర్ గా నిలిచి ప్రైజ్ మనీ కొట్టేయలని వచ్చినట్లు దేవి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











