Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు చేదు అనుభవం.. వేధింపులపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు
బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ దేవొలీనా భట్టాచార్జికి చేదు అనుభవం ఎదురైంది. తనకు సంబంధించిన ఓ వీడియోను అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వీడియో ఉందని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆ వీడియోను పోస్టు చేసిన వ్యక్తి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈ విషయంపై దేవోలీనా మీడియాతో మాట్లాడుతూ..

బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన సంఘటనలతో
బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన సంఘటనలు దేవోలీనాకు తలనొప్పిగా మారాయి. ఇంటిలో తన అభిప్రాయాలను చెప్పిన ఆమెను తోటి కంటెస్టెంట్ షెహనాజ్ గిల్, అతని సోదరుడు సిద్ధార్థ్ శుక్లా టార్గెట్ చేసుకోవడం వివాదంగా మారింది. ఇంటిలో షెహనాజ్ గిల్‌తో చేసిన కెమిస్ట్రీ అంతా బోగస్ అంటూ ఓ అసభ్యకరమైన వీడియోను పోస్టు చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. దాంతో దేవోలీనాను సిద్దార్థ్ వర్గం దారుణంగా ట్రోలింగ్ చేస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

నన్ను టార్గెట్ చేస్తున్నారు
ఇటీవల ఓ వ్యక్తి నన్ను తీవ్రంగా టార్గెట్‌గా చేస్తున్నాడు. నా తల్లికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడు. అంతేకాకుండా ఆడియో క్లిప్పులను కూడా పంపించి వేధిస్తున్నాడు. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోను. కానీ అతడి చర్యలు శృతి మించుతున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అతడిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అని దేవోలీనా పేర్కొన్నారు.

ఇబ్బందిలో కుటుంబం
ఇంటర్నెట్, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ లాంటి విషయాలను దుర్వినియోగం చేస్తున్నారు. అతడి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారింది. అభిమాని అనే బంధాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అతడి వలన మా కుటుంబం ఇబ్బందిలో పడే పరిస్థితి కనిపిస్తున్నది. సైబర్ చట్టాల ప్రకారం ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. ఈ వేధింపుల నుంచి విముక్తి కలిగించండి అంటూ దేవోలీనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Recommended Video

ఫిర్యాదు నిజమేనని స్పష్టం
సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై దేవోలీనా స్పందిస్తూ.. తనను వేధిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు చేసింది నిజమే. సరైన దర్యాప్తు చేసి పోలీసులు నాకు సహకరిస్తామని, కఠిన చర్యలు తీసుకొంటామని చెప్పారు. సోషల్ మీడియాలో దారుణంగా వేధించే వారికి ఈ చర్యలు ఓ గుణపాఠంగా మారాలి. సెలబ్రిటీలను ట్రోల్ చేసే వారికి తగిన బుద్ది చెప్పేలా ఉండాలి. షెహనాజ్ గిల్‌కు ఆయన తమ్ముడు షెహనాజ్ పంపిన ఆడియో క్లిప్పును పంపాను. ఆయన నుంచి సమాధానం రాలేదు అని చెప్పారు.