వజ్రాల వ్యాపారి హత్య: పోలీసుల అదుపులో ప్రముఖ నటి, ఏమిటి లింకు?
ప్రముఖ టీవీ నటి దేవొలీనా భట్టాచార్జీని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ముంబైకి చెందిన ఓ వజ్రాల వ్యాపారి మరణంతో ఆమెకు కనెక్షన్ ఉందని భావించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం హిందీ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. 'సాథ్ నిభానా సాథియా' (తెలుగులో 'కోడలా కోడలా కొడుకు పెళ్లమా') లాంటి పాపులర్ సీరియళ్లలో దేవొలీనా నటిస్తున్నారు.
న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం... రాజేశ్వర్ ఉదాని అనే వ్యాపారి అనుమానాస్పద మరణంలో పాంత్‌నగర్ పోలీసులు ఆమెపై అనుమానం వ్యక్తం చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. దేవొలీనాతో పాటు పొలిటీషియన్ సచిన్ పవార్‌ను పోలీసులు ప్రశ్నించారు. పవార్ గతంలో బీజేపీ లీడర్ గా ఉన్నారు. ఈ ఇద్దరినీ పోలీసులు శనివారం కొన్ని గంటల పాటు విచారించారు.

అతడు ఇచ్చిన సమాచారంతో..
ఈ కేసుతో సంబంధమున్న దినేశ్ పవార్ అనే సస్పెండెడ్ పోలీసు కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో టీవీ నటి దేవొలీనాను అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్వర్ ఉదాని హత్య అనంతరం పారిపోయిన సచిన్ పవర్‌ను గౌహతిలో పట్టుకున్నారు.

ఇంకా చాలా మందికి లింకు?
రాజేశ్వర్ మృతదేహాన్ని మూడు రోజుల క్రితం పోలీసులు రాయ్‌గడ్ జిల్లా అడవుల్లో రికవరీ చేసుకున్నారు. అయితే ఈ హత్య కేసులో వారి పాత్ర ఏమిటనే దానిపై పోలీసులు నోరు విప్పడం లేదు. ఈ కేసులో వీరితో పాటు ఎంటర్టెన్మెంట్ రంగానికి చెందిన మరికొందరు మహిళల హస్తం ఉందని తెలుస్తోంది.

అక్కడి నుంచి వేరే వాహనంలో
57 ఏళ్ల రాజేశ్వర్ ఉదాని నవంబర్ 28 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసి పోలీసులు తర్వాత కొడ్నాప్ అయినట్లు తేల్చారు. అతడి డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం... రాజేశ్వర్ ఉదాని తనను పంత్‌నగర్ మార్కెట్ ఏరియాలో డ్రాప్ చేయమని చెప్పారని, అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లారని పోలీసులు గుర్తించారు.

కుళ్లిపోయిన శవం
అయితే ఎలాంటి గాయాలు లేని రాజేశ్వర్ ఉదాని భౌతిక కాయం కుళ్లిపోయిన దశలో డిసెంబర్ 5న లభించింది. అతడిని గుర్తించడానికి ఎలాంటి ఆధారాలు లేక పోగా రాజేశ్వర్ కుమారుడు అతడు వేసుకున్న దుస్తులు, షూస్ ఆధారంగా గుర్తించాడు.

ఇండస్ట్రీకి చెందిన వారికి లింక్
అతడిని కిడ్నాప్ చేసిన వారు ఒక ప్రదేశంలో చంపేసి పాన్‌వెల్ అడవిలో మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ఫోన్ డాటా చెక్ చేసిన పోలీసులకు రాజేశ్వర్ రెగ్యులర్‌గా కొన్ని బార్లకు వెళ్లేవాడని, గ్లామర్, ఎంటర్టెనింగ్ రంగానికి చెందిన మహిళలతో సంబంధాలు ఉండేవని, సచిన్ పవార్ ద్వారా అతడు వారిని కలిసేవాడని పోలీసులు గుర్తించారు.


Click it and Unblock the Notifications











